జ్యోతిష్య,వాస్తు,సంఖ్యాశాస్త్ర,యోగా సమగ్ర విశ్లేషణ .... సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)
Wednesday, 29 March 2017
Tuesday, 28 March 2017
2017- 2018 .హేవళంబి నామ స|ర ఫలితాలు
ఓం శ్రీ గురుభ్యోనమ:
ఓం శ్రీ మాత్రే నమ:
శ్రీ హేవళంబి నామ సం|ర ఫలం ఈ విధంగా వుంది.
ధరా మరా గోకుల ధర్మ ప్రసాక్తా ఖలు హేవళంబే
సీదంతి సర్వే విరలార్ఘ సస్యెర్వృష్టిబి; క్షుధ్భయా పీడితాశ్చ
తస్కరై; పార్ధి వైర్ధెవి హ్యాభిభూత మిదం జగత్
అర్ఘం భవతి సామాన్యం హేవళంబే మహోదయే
హెవళంబేత్వితి భీతిర్మధ్య సస్యార్ధ వృష్టయ:
భాతి భూర్భూపతి క్షోభ: ఖండ విద్యుల్లతాది
శ్రీ హేవళంబి నామ సం|రం లో ప్రభుత్వాలు దేశాన్ని చక్కగా, సమర్ధవంతగా పరిపాలిస్తాయి.కొన్ని ప్రాంతలందు అల్లర్లు జరుగుతాయి. మోసం దుర్మార్గం ప్రబలుతుంది. పంటలు అనుకూలించవు. ధాన్యాదుల ధరలు మందగిస్తాయి ,సామాన్యం గా ఉంటాయి. తక్కువ వర్షపాతం ఉంటుంది. ఉరుములు మెరుపులతో గాలి ఉంటుంది. చొర బాధలు అధికం అవుతాయి. వ్యవసాయం అంతగా లాభసాటిగా ఉండదు.
హేవళంబి సం|రం నకు రాజు బుధుడు , మంత్రి శుక్రుడు, సేనాధిపతి గురుడు,సస్యాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి శని, మేఘాధిపతి గురుడు, రసాధిపతి బుధుడు, నీరసాధిపతి రవి.
ఈ సం|రానికి వీరు నవనాయకులు. నవ నాయకులలో 7 ఆధిపత్యములు శుభ గ్రహాలకు 2 ఆధిపత్యములు పాప గ్రహాలకు వచ్చినది. పరిపాలన సమర్ధవంతంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమర్ధవంతమైన పరిపాలను అందిస్తాయి. ఆర్ధిక విధానాలలో అనేక నూతన మార్పులు వస్తాయి. రూపాయి విలువ పెరుగుతుంది. అయితే వెండి బంగారం ధరలు అనేక మార్పులకు లోనుకాగలవు. స్వల్పంగా తగ్గే వీలుంది. ప్రజలు విదేశీ నాగరికతకు బాగా అలవాటు పడతారు. విలాసాలకు ధనం బాగా ఖర్చు పెడతారు. దేశం లోని ప్రధాన రాజకీయ పార్టీలో సంక్షోభం వస్తుంది. పాలక పక్షం పై అనేక విమర్శలు వస్తాయి.. పాకిస్తాన్ తో సరిహద్దులో యుద్ద వాతావరణం ఉంటుంది. మన సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పై పూర్తి ఆధిపత్యం పొందుతుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రానికి ఘర్షణ ఉంటుంది. ఉత్తర భారతంలో భూకంపాలు ఉంటాయి. వెస్ట్ బెంగాల్. ఒరిస్సా తదితర ప్రాంతాలందు వరదలు వస్తాయి. ప్రాణ ఆస్తినష్టం అధికం. ISRO ప్రయోగాలు అంతర్జాతీయంగా మంచి పేరు ప్రతిష్టాలను తెస్తాయి. క్రీడా రంగంలో విజయాలు ఉంటాయి.
ఉత్తరప్రదేశ్ లో BSP లో అంతర్గత కుమ్ములాటలు ఉంటాయి. అఖిలేశ్ యాదవ్ కు గడ్డుకాలం. అదేవిధంగా ఇక్కడ BJP లో కూడా సమస్యలు వస్తాయి. ఆంధ్ర తెలంగాణ మధ్య జల వివాదం కొంచెం తీవ్రంగా రాగల వీలుంది. అధికార BJP ప్రజాబలం తగ్గుతుంది. అక్టోబరు నుండి BJP పార్టీ కి శని ప్రభావం అధికం గా ఉంటుంది. కనుక దేశవ్యాప్తంగా BJP ప్రభ క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. కాంగ్రెస్ పార్టీ లో అనేక మార్పులు చోటుచేసుకొంటాయి. సీనియర్స్ కు గుర్తింపు ఉండదు.ఉత్తర భారతంలో కాంగ్రెస్ కొంచెం మెరుగు పడుతుంది. ఆంధ్ర తెలంగాణా లలో వారసత్వ రాజకీయాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. తెలంగాణ ముఖ్య మంత్రి కేసిఆర్ గారు తమ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సినీ రంగం నార్మల్ గా వుంటుంది. వ్యవసాయం బాగుంటుంది. ప్రత్తి ,పసుపు, సుగంధ ద్రవ్యాలు, వేరుశెనగ , మొక్క జొన్నలకు మంచి ధరలు ఉంటాయి. మిర్చి ధర గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మామిడి ధర కొండెక్కుతుంది.
అక్టోబరు, డిసెంబరు మధ్య కాలసర్పయోగం ఉంటుంది. దీని వలన అనే సమస్యలు వస్తాయి.అధికారం లో ఉండేవారు సమస్యలు పొందుతారు. అనేక రాజకీయ సంక్షోభాలు రాజకీయ పార్టీ లందు వస్తాయి.తుఫానులు, భూకంపాలు వస్తాయి. యుద్ద వాతావరణం వుంటుంది.ప్రార్ధన ప్రదేశాలు దేవాలయాలో అపశ్రుతులు ఉంటాయి. SHAREMARKET సమస్యలు ఉంటాయి. సీనియర్ రాజకీయ నాయకులకు ప్రమాదం. అమెరికా లో రాజకీయ సమస్యలు ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. బంగ్లాదేశ్ లో ప్రముఖ రాజకీయ నాయకులకు ప్రమాదం వుండవచ్చు. పాకిస్తాన్ లో ప్రభుత్వానికి సైన్యానికి మధ్య సమస్యలు వస్తాయి. ఉత్తర భారతంలో భూకంపాలు, తుఫానులు వస్తాయి.
మనదేశంలో ప్రసిద్ది వహించిన వ్యక్తి మరణం పొందే వీలుంది. విమాన ప్రమాదం లో ప్రసిద్దులు మరణం పొందే వీలుంది. ఈ సం|రం రోడ్డు ప్రమాదాలు అధికం. 2 పెద్ద రైలు ప్రమాదాలు జరుగుతాయి. తెలుగు సినీ రంగం సీనియర్ నటులను కోల్పోతుంది. హాస్య నటులు వివాదాలలో చిక్కుకుంటారు. ఆంధ్ర లో ప్రత్యేక హోదా ఉద్యమం పెరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీ ఆదరణ కొంచెం తగ్గవచ్చు. దక్షిణ భారతం లో బిజేపి పాగా వేయలేదు.. ఒరిస్సా లో బిజూ పట్నాయక్ ప్రభ కొంత తగ్గుతుంది. దేశం మొత్తం మీద BJP ప్రభ తగ్గుతుంది. ప్రధాని విదేశీ పర్యటనలు అధికం. చైనా పాకిస్తాన్ మధ్య సంబంధాలు కొంత మేరకు దెబ్బతింటాయి. ఆఫ్రికా ఖండం ప్రకృతి వైపరీత్యాలు అధికం అవుతాయి. సిమెంట్ ఇసుక ఇనుము ధరలు పెరుగుతాయి. ఒక ముఖ్య సంఘటన ప్రజలను భయానికి గురిచేస్తుంది. భారత్ లో నేరాల సంఖ్య అధికం. చంద్రబాబు గారికి, మోడి గారికి మరియు కేసిఆర్ గారికి ఈ సం|రం అంతగా కలసిరాదు. జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్ ఐటి రంగాలు కుదేలౌతాయి. ఐటి ఉద్యోగులకు ఈ స|రం కలిసిరాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గుతుంది. సంక్షేమ పధకాలకు ధనం చాలక రుణాలు చేయవలసి వస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక సంక్షేమ పధకం ప్రవేశ పెడుతుంది. శాంతి భద్రతలు బాగా నియంత్రించ బడతాయి. అమెరికా విదేశీ విధానం అనేక విమర్శలకు గురిఅవుతుంది. నూతన వీసాల మంజూరు లో తీవ్ర జాప్యం ఉంటుంది. ముస్లిం ఉగ్రవాదం పెరుగుతుంది. మనదేశం లో సంగీత, సాహిత్య, రాజకీయ నాయకులకు ప్రమాదం ఉంటుంది. సీనియర్ రాజకీయ నాయకుని కి ప్రమాదం ఉండవచ్చు.
ఈ సం|రం మిధున, కర్కాటక, సింహా, ధనసు, మరియు మకర రాశుల వారికి చెడుకాలం. దేశ గ్రహస్తితి కాలసర్ప యోగంలో ఉండుటవలన అనేక వైపరీత్యాలు ఏర్పడవచ్చు. కనుక ప్రభుత్వాలు యధాశక్తి చండీ హోమాలు, సుబ్రహ్మణ్య, మరియు రుద్ర శాంతులు చేయిస్తే మంచిది. వ్యక్తులు కూడా యధా శక్తి నిత్య అనుష్టానాలు మానివేయ రాదు. సంధ్యావందనం అర్హత ఉన్నవారు తప్పనిసరిగా సంధ్యావందనం చేయాలి. ఈ సం|రం ప్రతి వారు 3 సార్లు నువ్వులు దానం చేయుట మంచిది. సమస్త దోషాలు పోతాయి.
ఈ సం|రం 2 చంద్ర గ్రహణాలు, 2 సూర్య గ్రహణాలు ఉన్నవి. అయితే సూర్య గ్రహణాలు మనదేశం లో గోచరించవు. చంద్ర గ్రహణాలు గోచరిస్తాయి. మనం అన్ని నియమాలు పాటించాలి.
శ్రావణ శుక్ల పౌర్ణిమ సోమవారం ది.07-08-2017 చూడామణి నామం కల కేతుగ్రస్త చంద్ర గ్రహణం....ఇది పూర్తిగా భారతదేశం అంతటా గోచరిస్తుంది......
స్పర్శ కాలం రాత్రి 10:52 నిలకు
మధ్యకాలం రాత్రి 11:50 నిలకు
మోక్ష కాలం రాత్రి 12:49 నిలకు.
గ్రహణ పుణ్యసమయం 1 గం-57 ని....
గ్రహణం శ్రవణా నక్షత్రం లో పడుతుంది.... మకర రాశి వారు చూడరాదు.
అన్ని నియమాలు అందరూ పాటించాలి.
2 వ గ్రహణం మాఘ శుక్ల పౌర్ణిమ బుధవారం ది.31-01-2018 పడుతుంది...ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం....ఇది పుష్యమి, ఆశ్లేష ల లో జరుగుతుంది. కర్కాటక రాశి వారు చూడరాదు...
గ్రహణ స్పర్శ కాలం.... సా 05- 17 నిలకు
నిమిలనకాలం సా 06-21 నిలకు
మధ్యకాలం..... రా. 06:59 నిలకు
ఉన్మీలనకాలం రా. 07-37 నిలకు
మోక్షకాలం రా. 08-41 నిలకు
గ్రహణ పుణ్యకాలం 03 గం 24 నిలకు....బింబదర్శన కాలం 1 గం 16 నిలకు
అందరు అన్నీ నియమాలు పాటించాలి.
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:
సూర్యదేవర శ్రీ వేణుగోపాల్ M. A. జ్యోతిష్యం.
సుందరయ్య నగర్ మధిర ఖమ్మం జిల్లా తెలంగాణా
venusuryadevara@gmail.com
\
Thursday, 23 March 2017
29 వ తేదీనే ఉగాది జరుపుకోవాలి.
ఈ హేవళంబి సం|ర ఉగాది 29 వ తేదీ న జరుపుకోవాలి. కొంతమంది 28 వ తేదీ ఉగాది అని ప్రచారం చేయడం జరుగుతుంది. ఇటువంటి వాదోపవాదాల వలన సామాన్య ప్రజలు ఉగాది యే రోజు జరుపుకోవాలో తెలియక సతమతమౌతున్నారు. మన హిందూ సంస్కృతి పట్ల చులకన భావం ఏర్పడుతుంది.
తెలుగు మాసాలలో ప్రధమ మాసం చైత్ర మాసం. ఆ చైత్ర మాసంలో మొదటగా వచ్చే తిధి పాడ్యమి. ఈ పాడ్యమి నే ఉగాది అని నిర్ణయించి పండుగ జరుపుకుంటున్నాము. అంటే చైత్ర శుక్ల పాడ్యమి ఉగాది. అయితే ఈ పాడ్యమి 2 రోజులుండటం వలన యే రోజు ఉగాది జరుపుకోవాలి అన్న మీమాంస ఏర్పడింది. 28 తెదీ న పాడ్యమి తిధి ఉదయం గం|| 08:39 ని|| లకు ప్రవేశించి 29 వ తేదీ ఉదయం గం|| 07:00 ని|| ల వరకు వ్యాప్తి చెంది ఉంది. అంటే 28 మరియు 29 తేదీ లలో 2 రోజులకు పాడ్యమి వ్యాప్తి ఉంది. 28 కూడా వ్యాప్తి ఉన్నది కాబట్టి 28 వ తేదీనే ఉగాది అని కొంత మంది పండితులు భావించుట జరిగింది.
ఇక్కడ ముఖ్య విషయం ఏమంటే సూర్యోదయం తో ఉండే పాడ్యమినే ఉగాది గా భావించాలి. ..ఈ విషయాన్నిధర్మసింధు..నిర్ణయ సింధు వంటి జ్యోతిష్య గ్రంధాలు ఉదహరించుట జరిగింది. 2 రోజులకు పాడ్యమి ఉంటే సూర్యోదయం తో వుండే పాడ్యమి రోజునే ఉగాది గా స్వీకరించాలి. కనుక సూర్యోదయం తో ఉండే పాడ్యమి 29 వ తేదీ న ఉన్నది కనుక ఈ రోజునే ఉగాది గా నిర్ణయించి పండుగ జరుపుకోవాలి. 2 రోజులకు పాడ్యమి సూర్యోదయం తో వుంటే ముందు రోజునే ఉగాది జరుపుకోవాలి. ఇక్కడి 2 రోజులకు పాడ్యమి ఉన్నప్పటికి మొదటి రోజు సూర్యోదయం నకు అమావాస్య ఉంది. కాబట్టి 28 ఉగాది కాదు.
28 వ తెదీ న సూర్యోదయం తో అమావాస్య ఉంది. పాడ్యమి తిధి ఉదయం గం|| 08:39 ని|| లకు ప్రవేశించింది ఆ రోజు సూర్యోదయం గం|| 05: 59 ని||లకు ఉంది . పాడ్యమి సూర్యోదయానికి లేదు. సూర్యోదయానికి అమావాస్య ఉంది. 29 వ తెదీ నందు సూర్యోదయం గం|| 06:00 ని||లకు జరుగుతుంది. ఈ రోజు పాడ్యమి తిధి ఉదయం గం||07:00 ని||ల వరకు ఉంది. అంటే సూర్యోదయం తో పాడ్యమి ఉంది. కనుక 29 వ తేదీ రోజునే ఉగాది జరుపుకోవాలి. ఇది శాస్త్ర సమ్మతం....
సూర్యదేవర శ్రీ వేణుగోపాల్ ఎం.ఏ (జ్యోతిష్యం)
సుందరయ్య నగర్, మధిర ఖమ్మం జిల్లా, తెలంగాణా..
తెలుగు మాసాలలో ప్రధమ మాసం చైత్ర మాసం. ఆ చైత్ర మాసంలో మొదటగా వచ్చే తిధి పాడ్యమి. ఈ పాడ్యమి నే ఉగాది అని నిర్ణయించి పండుగ జరుపుకుంటున్నాము. అంటే చైత్ర శుక్ల పాడ్యమి ఉగాది. అయితే ఈ పాడ్యమి 2 రోజులుండటం వలన యే రోజు ఉగాది జరుపుకోవాలి అన్న మీమాంస ఏర్పడింది. 28 తెదీ న పాడ్యమి తిధి ఉదయం గం|| 08:39 ని|| లకు ప్రవేశించి 29 వ తేదీ ఉదయం గం|| 07:00 ని|| ల వరకు వ్యాప్తి చెంది ఉంది. అంటే 28 మరియు 29 తేదీ లలో 2 రోజులకు పాడ్యమి వ్యాప్తి ఉంది. 28 కూడా వ్యాప్తి ఉన్నది కాబట్టి 28 వ తేదీనే ఉగాది అని కొంత మంది పండితులు భావించుట జరిగింది.
ఇక్కడ ముఖ్య విషయం ఏమంటే సూర్యోదయం తో ఉండే పాడ్యమినే ఉగాది గా భావించాలి. ..ఈ విషయాన్నిధర్మసింధు..నిర్ణయ సింధు వంటి జ్యోతిష్య గ్రంధాలు ఉదహరించుట జరిగింది. 2 రోజులకు పాడ్యమి ఉంటే సూర్యోదయం తో వుండే పాడ్యమి రోజునే ఉగాది గా స్వీకరించాలి. కనుక సూర్యోదయం తో ఉండే పాడ్యమి 29 వ తేదీ న ఉన్నది కనుక ఈ రోజునే ఉగాది గా నిర్ణయించి పండుగ జరుపుకోవాలి. 2 రోజులకు పాడ్యమి సూర్యోదయం తో వుంటే ముందు రోజునే ఉగాది జరుపుకోవాలి. ఇక్కడి 2 రోజులకు పాడ్యమి ఉన్నప్పటికి మొదటి రోజు సూర్యోదయం నకు అమావాస్య ఉంది. కాబట్టి 28 ఉగాది కాదు.
28 వ తెదీ న సూర్యోదయం తో అమావాస్య ఉంది. పాడ్యమి తిధి ఉదయం గం|| 08:39 ని|| లకు ప్రవేశించింది ఆ రోజు సూర్యోదయం గం|| 05: 59 ని||లకు ఉంది . పాడ్యమి సూర్యోదయానికి లేదు. సూర్యోదయానికి అమావాస్య ఉంది. 29 వ తెదీ నందు సూర్యోదయం గం|| 06:00 ని||లకు జరుగుతుంది. ఈ రోజు పాడ్యమి తిధి ఉదయం గం||07:00 ని||ల వరకు ఉంది. అంటే సూర్యోదయం తో పాడ్యమి ఉంది. కనుక 29 వ తేదీ రోజునే ఉగాది జరుపుకోవాలి. ఇది శాస్త్ర సమ్మతం....
సూర్యదేవర శ్రీ వేణుగోపాల్ ఎం.ఏ (జ్యోతిష్యం)
సుందరయ్య నగర్, మధిర ఖమ్మం జిల్లా, తెలంగాణా..
Monday, 20 March 2017
ఇంటికి ప్రహరీ రక్షణ కవచం
ఇంటికి ప్రహరీ రక్షణ కవచం.
సూర్యదేవర
వేణుగోపాల్. M.A (జ్యోతిష్యం)
నైసర్గిక వాస్తు
దోషాలను అరికడుతుంది. గృహానికి ప్రహరీ లేకపోతే ఆ గృహం చుట్టూ ఉన్న వాస్తు
దోషాల వలన అందులో ఉండేవారు బాధపడవలసి వస్తుంది.
అష్ట దిక్కులను మన గృహానికి అనుగుణంగా సవరించుకొని మేలు పొందాలంటే ప్రహరీ
నిర్మాణం తప్పనిసరి. ప్రహరీ గోడను అనుభవం కలిగిన వాస్తు పండితుని
పర్యవేక్షణలో నిర్మించాలి. పెరిగి ఉన్న మూలాలను,దిక్కులను సవరించి ప్రహరిని నిర్మించాలి. స్థలం ఉన్నంత
మేరకు ప్రహరీని కట్టకూడదు. మంచి ఫలితాల కోసం దిక్కులను సవరించి
ప్రహరిని కట్టాలి. యే నిర్మాణానికైనా ప్రహరీ తప్పనిసరి. గృహానికి
ప్రహరీ చాలా ముఖ్యం. ప్రహరీలు లేని గృహం రాణించదు.
ప్రహరీ నిర్మాణ
సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రహరి పునాది లేదా ఫౌండేషన్
ఎట్టి పరిస్థితిలోను ఇంటి పునాదిని మించకూడదు. ఇంటిపునాది కంటే
ప్రహరీ పునాది ఎత్తులో ఉంటే ఇంటి ఆయుర్దాయం తగ్గిపోతుంది. దక్షిణం
మరియు పడమర లు ఎత్తులో ఉండాలని కొంతమంది ఇంటి పునాది కంటే ప్రహరీ పునాది ని ఎత్తులో
కడుతున్నారు. ఇది చాలా తప్పు. అన్ని దిశలందు
ప్రహరీ ఫౌండేషన్ ఇంటి ఫౌండేషన్ కన్నా తక్కువలోనే ఉండాలి.
ప్రహరీలకు తూర్పు
ఉత్తరంలో కట్టే ఫౌండేషన్ దక్షిణం పడమరల ఫౌండేషన్ కన్నా తక్కువ ఎత్తులో ఉంచాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రహరీ నిర్మాణం 2 విధాలుగా ఉంటుంది. 4 దిక్కులందు
సమానమైన ఎత్తులో ప్రహరీ నిర్మించుట ఒక పద్దతి. తూర్పు ప్రహరీ
పడమర ప్రహరీ కన్నా తక్కువలో మరియు దక్షిణం ప్రహరీ ఉత్తరం ప్రహరీ కన్నా ఎత్తులో ఉంచి
ప్రహరీ నిర్మించుట 2 వ పద్దతి. ఈ రెండింటిలో
2 వ పద్దతి సరియైనది. ప్రహరీ కట్టేటప్పుడు
కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి. ముందుగా గృహానికి దక్షిణం, పడమరల వైపు ప్రహరీని నిర్మించాలి. ఈ దిక్కులందు ప్రహరీ లేకుండా తూర్పు, ఉత్తర దిశలందు కాంపౌండ్ నిర్మించరాదు. పడమర,దక్షిణాల
వైపు జలాశయాలు, బావులు, బొర్లు, లోతైన గుంటలు, పెద్ద డ్రైనేజీలు ఉన్నప్పుడూ కొంత స్థలం వదలి ప్రహరీ నిర్మించాలి. ఈ పల్లపు ప్రాంతాలను
ఆనుకొని ప్రహరీ కట్టకూడదు. కనీసం 5 నుండి 12 అడుగుల వరకు ఖాళీ స్థలం వదలి ప్రహరీ నిర్మించాలి.
అప్పుడే ప్రహరీ వలన మంచి ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా పడమర దక్షిణ ముఖాలుగా నిర్మించే
గృహాల కు నైరుతి ప్రాంతం నందు ప్రహరికి ఆనించి మెట్లను నిర్మిస్తున్నారు ఇది తప్పు.
అదేవిధంగా నైరుతి మూసివేయాలని మరుగుదొడ్లు లేదా స్టోర్ రూమ్స్ నైరుతిని మూసివేసి నిర్మిస్తున్నారు
ఇది కూడా చాలా తప్పు. ఈ విధమైన నిర్మాణాల వలన ప్రహరీ ప్రయోజనం నెరవేరదు. ఇటువంటి నిర్మాణాలు
వలన కాంపౌండ్ బయట ఉన్న పల్లంతో తీవ్ర నష్టం జరుగుతుంది. తప్పనిసరి పరిస్థితులలో కాంపౌండ్
కు టచ్ చేసి మరుగుదొడ్లు నిర్మించవలసి వస్తే తప్పనిసరిగా కాంపౌండ్ బయట మట్టి వేసి ఎత్తు
చేయాలి. కాంపౌండ్ బయట పల్లం లేకుండా మట్టి వేసి ఎత్తు లేపడం గాని లేదా అరుగులు వంటివి
కట్టడంగాని చేయాలి. ప్రహరీ గోడకు గృహం లోని యే భాగము టచ్ కాకుండా నిర్మించడం మంచిది.
తూర్పు ఉత్తర
సింహద్వారం తో నిర్మించే గృహాలకు సింహద్వారం బయటకు కనిపించే విధంగా ప్రహరీ నిర్మించాలి.
తూర్పు ఉత్తరాలలో బాగా ఎత్తులో ప్రహరి నిర్మించుట మంచిది కాదు. మగ సంతానానికి ఎదుగుదల
లోపిస్తుంది. అయితే దక్షిణ పశ్చిమ దిశలలో ప్రహరీని ఎత్తులో ఉంచవచ్చు. తూర్పు ఉత్తరాలలో మరీ ఎత్తులో
ప్రహరీ మంచిది కాదు. దక్షిణం, పడమరల వైపు కూడా గాలికి అవరోధం రానంత మేర
ఎత్తులో ప్రహరీ నిర్మించాలి. మన పూర్వ నిర్మాణాలలో దక్షిణం,పడమరల
వైపు ఇంటిని ఖాయం చేసి ఉండటం మనం చూస్తూంటాము. ఇది చాలా తప్పు. ఇటువంటి గృహాలకు నైసర్గిక
వాస్తు దోషాలు బాగా తమ ప్రభావాన్ని చూపిస్తాయి. కొంతమంది నైరుతి మూసి నిర్మాణాలు చేయవచ్చునని
సలహా ఇస్తున్నారు. ఇది కూడా తప్పు. నైరుతి మూసి నిర్మాణాలు చేస్తే ఇటువంటి నిర్మాణాలకు
నైరుతి లో ఉండే నైసర్గిక వాస్తు దోషం తగిలి తీవ్ర నష్టాలు వస్తాయి. ఇంటికి దక్షిణం
పడమర లో వేరే గృహం ఉంటే ఈ దిక్కులందు కాంపౌండ్ అవసరం లేదని భావిస్తారు.ఇది తప్పు. మన
ప్రహరీ మనం కట్టుకోవలసిందే.
ప్రహరి ప్రధాన
గృహం నుండి దక్షిణం ఆగ్నేయ, దక్షిణ నైరుతి దిక్కులు సమానమైన కొలతతో 90 డిగ్రీలు
గా ఉండాలి. అదేవిధంగా పడమర వైపు పడమర, పడమర వాయవ్యం, పశ్చిమ నైరుతి ప్రధాన గృహం నుండి సమానమైన కొలతతో 90 డిగ్రీలు గా ఉండాలి. ఏ దిశ పెరగరాదు. అయితే తూర్పు ఉత్తరం వైపు తూర్పు ఆగ్నేయం కన్నా
తూర్పు ఈశాన్యం అదే విధంగా ఉత్తర వాయవ్యం కన్నా ఉత్తర ఈశాన్యం ఎంతో కొంత పెరిగే విధంగా
ప్రహరీ నిర్మించాలి. ఈశాన్యం పెరగకుండా ఉండరాదు. ఇంటి ప్రహరీ గోడ కు వీధి శూల తగిలే
పక్షంలో నిర్లక్ష్యం చేయరాదు. ప్రహరీ కి ఎంతో కొంత ఖాళీ వదలి వేరే గోడను ప్రహరీ కి
అడ్డం గా నిర్మించాలి. అప్పుడే ప్రహరీ కి వీధి శూల నుండి రక్షణ లభిస్తుంది.
ఈ రోజుల్లో
చాలామంది ప్రహరిలను ఇంటి బీముల పై నిర్మిస్తున్నారు. ఇంటి బీమ్స్ ను ఇంటి నుండి బయటకు
పెంచి వాటిపై ఇంటికి ఎడంగా ప్రహరిని కడుతున్నారు. భూమి పై మట్టం నుండి కాంపౌండ్, ఇంటి
గోడలు ఎడంగా ఉన్నప్పటికి భూమి అడుగు భాగంలో ప్రధాన గృహం మరియు ప్రహరీలు బీమ్స్ ద్వారా
కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఇటువంటి నిర్మాణం వలన ప్రహరీ ప్రయోజనం నెరవేరదు. ప్రహరీ ఇంటికి
మద్య ఖచ్చితంగా కనెక్షన్ ఉండకూడదు. ఇంటికి ప్రహరీ మధ్య కనెక్షన్ ఉంటే ప్రహరీలకు తగిలే
నైసర్గిక వాస్తు దోషాలు ఇంటికి కూడా తగిలి అనేక సమస్యలు వస్తాయి. కనుక ప్రహరీలకు వేరే
పిల్లర్స్, బీమ్స్ వేసి ప్రహరిని నిర్మించాలి.
ఇంటి శ్లాబ్స్
ప్రహరీ గోడలపై వచ్చే విధంగా నిర్మించరాదు. ఇంటి శ్లాబ్ ఇంటి ప్రహరి కన్నా 2 లేక 3 అంగుళాలు
లోపలికి ఉండే విధం గా వేయాలి. సెప్టిక్ టాంకులు,బోర్లు మొ|నవి ప్రహరికి టచ్ కాకుండా ఉండాలి.ప్రహరీ పై ఇంటికన్నా ఎత్తులో ఆర్చీలు డిజైన్లు
కట్టరాదు. క్రూర మృగాల బొమ్మలు, భయం గొలిపే బొమ్మలు ప్రహరీపై
ఉంచరాదు. ఇంకా ప్రహరీ పై గాజు పెంకు లను అమర్చకూడదు. ఇంటిని నిర్మించిన తదుపరి ప్రహరిని
నిర్మించుట మంచిది. ఇంటిని ప్రాతిపదికగా తీసుకొని ప్రహరిని నిర్మించుట మంచిది. ఇంటికన్నా
ప్రహరీ ముందుగా నిర్మిస్తే ఇంటిని ప్రహరికి అనుగుణంగా సవరించాలి. ఇది మంచి పద్దతి కాదు.
అయితే ఖాళీ స్థలానికి నైరుతి ఆగ్నేయ దిక్కుల విపరీతంగా పెరిగిఉంటే ముందుగా పెరిగి ఉన్న
దిక్కులను సవరించి ప్రహరీ నిర్మించాలి. అప్పుడు ఇల్లు సకాలంలో పూర్తి అవుతుంది.
ప్రహరికు ఉచ్చ
స్థానంలో గేట్లు అమర్చాలి. ప్రహరికి కాలువలకు మధ్య ఎంతోకొంత ఖాళీ ఉండాలి. ప్రహరికి
ఆనుకొని కాలువలు ఏ దిశలోనూ ఉండరాదు. పాత గృహానికి కాంపౌండ్ నిర్మించే సమయంలో చాలా జాగ్రత్తలు
తీసుకోవాలి. ప్రధాన గృహానికి పారు చెడకుండా ప్రహరీ కట్టాలి. అదే విధంగా ప్రధాన గృహం
ను ప్రాతిపదిక గా తీసుకొనే ప్రహరీ కట్టాలి. ప్రధాన గృహం నుండి కొలత తీసుకొని ప్రహరీ
కట్టాలి. అంతేకాని ప్రహరికి నూతనంగా మూలమట్టం వేసి కట్టకూడదు. ఇంటిపారు లోనే ప్రహరీ
ఉండాలి. ప్రహరీ గోడలు అన్నీ సమానమైన మందం తో నిర్మించాలి. దక్షిణ పడమరల వైపు ఎక్కువ
మందం తో నిర్మించి తూర్పు ఉత్తరాలలో తక్కువ మందంతో ప్రహరీ నిర్మించవచ్చు. ఇలా కాకుండా
తక్కువ మందంతో ప్రహరీ ని దక్షిణ పడమరలలో నిర్మించి ఎక్కువ మందంతో తూర్పు ఉత్తరాలలో
ప్రహరి కట్టరాదు. 4 వైపులా సమానమైన మందంతో ప్రహరీ కట్టవచ్చును. ఇంటి సింహద్వారంలో గాని
ఇతర దర్వాజలో కాని ప్రహరీ గోడ పిల్లర్స్ రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా బోర్లు టాంకులు
మరియు బావులందు ప్రహరీ పిల్లర్లు రాకూడదు.
ప్రహరికి అమర్చే గేట్లు తూర్పు ఉత్తరాలలో ఇంటికన్నా తక్కువ ఎత్తులో
ఉంచితే మంచిది. దక్షిణ పడమరల వైపు ఎత్తులో వుంచవచ్చు. అయితే ప్రహరీ గోడ నైరుతి లో ఉన్న
ఎత్తుకంటే ఈ గేట్లు ఎత్తులో ఉండరాదు. ప్రహరీ గోడ మధ్య చెట్లు ఉండకూడదు. ఈ విధంగా అన్ని
జాగ్రత్తలు తీసుకొని ప్రహరీ నిర్మిస్తే నైసర్గిక
వాస్తు దోషాలు తొలగి సుఖ సౌఖ్యాలు పొందవచ్చు.
సూర్యదేవర వేణుగోపాల్ M. A జ్యోతిష్యం
H.NO—1-879 సుందరయ్య నగర్ మధిర
ఖమ్మం జిల్లా తెలంగాణా
Wednesday, 8 March 2017
Suryadevara Venugopal: యేఏ పుష్పాలతో నవగ్రహాలను పూజించాలి?
Suryadevara Venugopal: యేఏ పుష్పాలతో నవగ్రహాలను పూజించాలి?: మానవ జీవితం సుఖప్రదంగా సాగిపోవాలంటే నవగ్రహాల యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలి. ఈ నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవడం కోసం జప, పూజ విధులు మర...
యేఏ పుష్పాలతో నవగ్రహాలను పూజించాలి?
మానవ జీవితం సుఖప్రదంగా సాగిపోవాలంటే నవగ్రహాల యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలి. ఈ నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవడం కోసం జప, పూజ విధులు మరియు స్తోత్ర విధానాలు మన శాస్త్రాలు ఉదహరించాయి వీటిని పాటించడం వలన నవగ్రహ ఆశీర్వాదం లభించి మానవ జీవితం లోని సమస్యలు తొలగిపోతాయి.. యే ఏ పూలతో నవగ్రహాలను పూజిస్తే మంచి జరుగుతుందో ఆ పూల వివరాలను భవిష్య పురాణం తెలియ జేసింది, గ్రహ శాంతి పూజలందు భవిష్య పురాణం చెప్పిన ప్రకారం ఆ యా గ్రహ దేవతలను పూజిస్తే వారి అనుగ్రహం సులభంగా లభించి సమస్యలు తొలగిపోతాయి.
హయారి కుసుమైః సూర్యం కుముదై చంద్ర అర్చయేత్
క్షితిజమ్ తు జపాపుష్పై చంపకేన తు సోమజం
శతపత్రై గురుః పూజ్యో జాజి పుష్పైస్తు భార్గవః
మల్లికా కుసుమై పంగు: కుంద పుష్పైర్విధంతుద:
కేతస్తు వివిధై: పుష్పే: శాంతి కాలేషు సర్వధా
భవిష్య పురాణం
రవిని పచ్చ గన్నేరు తో చంద్రుని కలువలతో, కుజ గ్రహాన్ని దాసాని పూలతో, బుధుని సంపెంగలతో, గురుని పద్మాలతో, జాజి పూలతో శుక్రుని, శని గ్రహాన్ని మల్లె పూలతో ఇంకా మొల్ల పూలతో రాహువుని, కేతు గ్రహాన్ని వివిధ పుష్పాలతో పూజిస్తే నవగ్రహ అనుగ్రహం సత్వరమే లభించి సమస్యలు తీరిపోతాయి.
Subscribe to:
Posts (Atom)