Sunday, 12 May 2019

పూజ గది.- వాస్తు నియమాలు.

పూజ గది- వాస్తు నియమాలు


గృహం లో పూజ ఈశాన్యం నందు చేయడం మంచిది. ఉత్తర ఈశాన్యం గాని లేదా తూర్పు ఈశాన్యం లో గాని పూజ చేయడం శ్రేష్టం. పూజ ఎప్పుడు తూర్పు దిక్కునకు అభిముఖంగా అంటే తూర్పు వైపు తిరిగి పూజ చేయాలి.  తూర్పు ముఖంగా పూజ చేసే వీలు లేనప్పుడు ఉత్తర ముఖంగా పూజ చేయవచ్చు. తూర్పు లేదా ఉత్తరం ముఖంగా చేసే పూజలు మంచి ఫలితాలనిస్తాయి. కోరికలు ఫలిస్తాయి. పడమర ముఖంగా గాని లేదా దక్షిణ ముఖంగా చేసే పూజలు అంతగా ఫలితాలను ఇవ్వవు. అందువల్ల ఈ దిక్కులకు ఎదురుగా కూర్చుని పూజ చేయ కూడదు. పడమర దిక్కు అభిముఖంగా చేసే పూజలు మధ్యమ ఫలాలను ఇస్తాయి. దక్షిణ ముఖ పూజ అధమం.

ఈశాన్యం దిక్కును పూర్తిగా మూసివేస్తూ పూజ గదిని నిర్మించరాదు. గృహానికి ఈశాన్యం లో తప్పనిసరిగా ద్వారం ఉండాలి. ఈ దిక్కును మూసివేయ రాదు. ఈ దిక్కు లో బరువులు ఉంచరాదు. ఈశాన్యం లో పూజ ఉన్నప్పుడూ పెద్ద మందిరాలు కానీ బరువు కలిగిన వస్తువులు కానీ ఉంచరాదు.

పూజ వలన ఈశాన్య దిక్కును మూసివేయ రాదు. ఈశాన్యం లో పూజ వలన ఈ దిక్కును మూసివేయ వలసి వస్తే, పూజ ను తూర్పు దిక్కులో కానీ లేదా ఉత్తర దిక్కు నందు కానీ చేయవచ్చు. అంటే తూర్పు లేదా ఉత్తర దిశలందు పూజ గది ని నిర్మించి పూజ చేయవచ్చు.

కొంతమంది తూర్పు లేదా ఉత్తరం లందు పెద్ద హాల్స్ నిర్మించి, ఈ హాల్స్ లో పూర్తి ఈశాన్యం లో పూజ గది నిర్మించి ఈశాన్యం ను మూసి  వేస్తున్నారు. ఇది వాస్తు కు విరుద్దం.

ఈశాన్యం లో పూజ మంచిదని ఈశాన్యం దిక్కును ఎప్పుడు మూసివేయకూడదు  బరువులు ఉంచకూడదు. ఈ విధ మైన అమరిక వలన అనేక సమస్యలు వస్తాయి. ఈశాన్యం దిక్కు కు ఇబ్బంది కలగనప్పుడు మాత్రమే పూజను ఈశాన్యం లో చేయాలి.  ఈశాన్యం దిక్కు కు పూజ వలన బరువు పెరిగి, మూత వేయవలసి వచ్చినప్పుడు, పూజ ను తూర్పున గాని లేదా ఉత్తరం దిక్కులందు చేయాలి. ఇది మాత్రమే మంచి పద్దతి.


సూర్యదేవర వేణుగోపాల్. M. A (జ్యోతిష్యం)
సుందరయ్య నగర్  మధిర
తెలంగాణా.