Wednesday, 27 July 2016

శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం






శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం సకల మనోభీష్టాలను నెరవేర్చగలదు. ఈ స్తోత్రం ను ఎవ్వరైన పారాయణం చేయవచ్చు. కానీ గురు ముఖంగా నేర్చుకొని పారాయణం చేయడం మంచిది. ఎందుకంటే శ్రీ విద్యా సాంప్రదాయంలో శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రం అగ్రగణ్యమైనది. ఇది షోడశాక్షరి మంత్ర సమానమైనది. దీనిని తప్పులుగా చదవకూడదు.ఈ స్తోత్రం లోని పద విభజన ను సక్రమంగా అర్ధం చేసుకొని చదవాలి. లేని యెడల తీవ్ర దోషం అవుతుంది.

అర్ధం తెలుసుకొనే ఈ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. అర్ధం తెలుసుకోకుండా గుడ్డిగా పారాయణం చేసినట్లైతే సామాన్య ఫలితాలు ఉంటాయి.

పరమాత్మ యొక్క పూర్తి స్వరూపం, వైభవం ఈ లలిత సహస్రనామం తెలుపుతుంది. దీనిని ప్రతి నిత్యం పారాయణం చేసినట్లైతే  జీవితం, మానవ జన్మ సాఫల్యం పొందుతాయి.

ఆపదలో ఉన్నవారు ఈ స్తోత్రం ను మండలం రోజులు అన్నీ నియమాలను పాటించి ప్రతి నిత్యం పారాయణం చేస్తే ఆపదలు తొలిగిపోతాయి. సమస్యలు ఉన్నవారు మరియు కోరికలు ఉన్నవారు వారి సమస్యలు.తొలగి మనోభీష్టాలు నెరవేరుటకు ఈ విధం గా పారాయణం చేయాలి.

గురువు లేని వాళ్ళు ఈ వీడియో లో ఉన్నవిధంగా పారాయణం చేయవచ్చు. ఇందులో ఉన్న ఉచ్చరణను సరిగా అర్ధం చేసుకొని పారాయణం చేయవచ్చు.

అదేవిధంగా చదవలేనివారలు ఈ శ్లోకాలను వీడియో ద్వారా ఉదయం, సాయంత్రం వినవచ్చు. మంచి ఫలితాలు ఉంటాయి.



No comments:

Post a Comment