స్త్రీ, పురుష జాతకాలలో కుజ గ్రహం 2, 4, 7, 8,10, 12 వ భావాలలో లేదా స్థానాలలో ఉంటే అది కుజ దోషం గా పరిగణించ బడుతుంది. ఈ దోషం వలన వివాహం ఆలస్యం అవుతుంది. వివాహ జీవితంలో అనేక సమస్యలు ఏర్పడి కొన్ని సందర్భాలలో దంపతులు విడిపోవడం జరుగుతుంది. కుజ దోషానికి అనేక మినహాయింపులు ఉంటాయి. ఈ మినహాయింపులను పరిశీలించకుండా కుజ దోషం నిర్ధారించకూడదు. నేటి కాలంలో వివాహం ఆలస్యం అయితే లేదా వివాహ జీవితంలో సమస్యలు వస్తే కుజదోషం ఉందంటూ భయపెట్టడం జరుగుతుంది. పూర్తిగా శాస్రం తెలియనివారు కుజదోషం పేరు చెప్పి ప్రజలను భయ భ్రాంతులకు గురిచేసి వారి అమాయకత్వాన్ని సొమ్ముచేసుకుంటున్నారు. కనుక ప్రజలు సరియైన దైవజ్ఞుని సంప్రదించాలి. కుజదోషం దాని మినహాయింపులు తెలుసుకుందాం.
ఈ దోషం ప్రామాణిక జ్యోతీష్య గ్రంధాలైన ధర్మసింధువు, నిర్ణయ సింధువు మొదలైన గ్రంధాలలో ఉదహరింపబడలేదు. కుజ దోష వివరణ చింతామణి వివాహ ప్రకరణం, వివాహ మాలిక, నారద సంహిత మొదలైన గ్రంధాలలో ఉంది.
.జాతకంలో.ఈ క్రింది స్థానాలలో కుజుడు ఉంటే కుజదోషంగా చూడ.కూడదు.
.
కర్కాటక సింహరాసులలోనూ, ఇంకా మకర రాశిలోను కుజును మిత్ర రాసులలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు. కుజుడు 2 వ స్థానంలో ఉండే దోషం మిధున రాశి, కన్య రాశి అయితే కుజ దోషం లేదు..
12 వ స్థానం వృషభ, తులా రాసులైతే దోషం లేదు. 4 వ స్థానం మేషరాశి, వృశ్ఛిక రాశి అయితే దోషం లేదు. 7 వ స్థానం మకర కర్కాటక రాసులైతే కుజదోషం ఉండదు. 8 వ స్థానం ధనస్సు మీన రాసులైతే దోషం ఉండదు.
ఇంకా కుజుడు గురు, చంద్ర గ్రహాలతో కలసి ఉంటే కుజదోషం లేదు. జాతకంలో శుక్ర గ్రహం బలం గా ఉంటే కుజదోషం లేదు. వధూవరుల ఇద్దరికీ కుజుడు 2, 4, 7, 8, 12 రాసులలో ఉంటే కుజదోషం పరిహరింపబడి సుఖప్రదమైన వివాహ జీవితాన్ని పొందుతారు.
దేవ కేరళమ్ అనే జ్యోతిష్య గ్రంధం ప్రకారం దంపతులలో ఒకరి జాతకంలో కుజదోషం ఉండి మరొకరి జాతకంలో కుజదోషం లేకపోతే వివాహ జీవితంలో తీవ్ర సమస్యలు ఉంటాయి.
దైవజ్ణ సంపూర్ణ చంద్రికా అనే గ్రంధం ప్రకారం అశ్విని, మృగశిరా, పునర్వసు, పుష్యమి, ఉత్తర, స్వాతి, అనురాధా, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, శ్రవణం, ఉత్తరభాద్ర, రేవతి నక్షత్రాలలో జన్మించిన వారికి కుజదోషం ఉండదు.
ఈ విధంగా అనేక మినహాయింపులు కుజదోషానికి ఉంతాయి . అన్ని జాతకాలకు కుజ దోషం వర్తించదు. ఇది అందరూ ముఖ్యంగా గుర్తుంచుకోవాలి.
కుజ దోష పరిహారాలు......
జాతకంలో కుజదోషం ఉంది అని నిర్ధారిస్తే ఈ క్రింది పరిహారాలు పాటించాలి. దోషం తోలగిపోతుంది.....
.
కనకపుష్య రాగం ఉంగరాన్ని ధరించాలి.
కందులు ఎర్రని వస్త్రం లో చుట్టి దానం ఇవ్వాలి. మంగళ వారం రోజు గోమాతకు కందులు సమర్పించాలి.
శ్రీ లక్ష్మి నృసింహా స్వామి వారిని ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధించవచ్చు.
నరసింహ స్వామి వారి కళ్యాణం చేయించాలి.
కుజ గ్రహ శ్లోకాన్ని 7 సార్లు మరియు గురుగ్రహ శ్లోకాన్ని 16 సార్లు రోజు పఠించాలి.
అవసరం అయితే కుజగ్రహ జపం, శాంతి హోమం జరిపించాలి.
ప్రతిరోజూ శ్రీ లక్ష్మి నృసింహ కరావలంబ స్తోత్రం లేదా సహస్రనామ స్తోత్రమ్ చదవాలి.
11 మంగళ వారాలు సుబ్రహ్మణ్య స్వామిని అన్నీ నియమాలతో పూజించాలి.
మొదలైన పరిహారాలు పాటిస్తే కుజ దోష పరిహారం జరుగుతుంది.
జాతకంలో ఉన్న కుజదోష బలాన్ని బట్టి పరిహారాలను పాటించాలి.
దీనికై అనుభవం మరియు పూర్తి శాస్ర జ్ణానం
ఉన్నదైవజ్ఞుని సంప్రదించాలి...
సూర్యదేవర వేణుగోపాల్ M.A జ్యోతిష్యం
సుందరయ్య నగర్ మధిర ఖమ్మం జిల్లా తెలంగాణా
507203
venusuryadevara@gmail.com

No comments:
Post a Comment