Saturday, 17 December 2016

తల స్నానం ఏ వారం చేయాలి.

తలస్నానం, అభ్యంగన స్నానం ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు చేయకూడదు. మన హిందూ జ్యోతీష్య గ్రంధాలు ఈ స్నానం విషయంలో అనేక సూచనలు చేశాయి.  మానవ ప్రయోజనార్ధం, ప్రకృతి నియమాలను దృష్టిలో ఉంచుకొని ఈ సలహాలను సూచించుట జరిగింది. ప్రస్తుత సమాజం ఈ నియమాలను అంతగా పట్టించుకోవడం లేదు. కానీ ఈ నియమాలను పాటిస్తే మంచి తప్పక జరుగుతుంది.

 తలస్నానం ఏ వారం చేయాలో, ఏ వారం చేయకూడదో, ఈ క్రింది పట్టికను గమనిస్తే తెలుస్తుంది.. 

ఆదివారం   తలస్నానం  చేస్తే  మనిషి తేజస్సు, అందం తగ్గుతుంది. మనస్తాపం కలుగుతుంది. చెడు వార్తలు వినవలసి వస్తుంది.

సోమవారం తలస్నానం వలన ముఖ కాంతి తగ్గుతుంది. అనవసర భయాలు ఆవరిస్తాయి. 

మంగళవారం తలస్నానం వలన అపాయం, ఆయుక్షీణమ్ కలుగుతుంది.. వివాహిత స్త్రీలు మంగళ వారం తలస్నానం చేస్తే భర్తకు కలసిరాదు.

బుధవారం తలస్నానం వలన కీర్తి, ధన, విద్యా లాభం కలుగుతుంది. అన్నింటా శుభం.

గురువారం తలస్నానం వలన విద్యలో ఆటంకాలు, అధిక ఖర్చు,  ఆందోళన, అందరితో విభేదాలు కలుగుతాయి.

శుక్రవారం తలస్నానం వలన అనారోగ్యం, ధన వస్తు నష్టం ఉంటాయి.

శనివారం తలస్నానం ఆయుర్దాయం పెంచుతుంది. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. అన్ని పనులు విజయవంతం అవుతాయి. సకల భోగాలు కలుగుతాయి.


పై విషయాలను మనం గమనిస్తే తలస్నానం బుధవారం, శనివారం చేస్తే మంచిదని తెలుస్తుంది.

మిగిలిన రోజులందు అత్యవసరంగా చేయవలసివస్తే తలకు కొంచెం నువ్వుల నూనె రాసుకొని, నీటిలో కొంచెం పూలు, గరిక వేసి తలస్నానం చేయవచ్చు. అయితే సోమవారం రోజు తలస్నానం పూర్తి నిషిద్దం. 

అభ్యంగన స్నానం  విషయంలో మంగళ, గురు వారములందు పూర్తి నిషిద్దం మిగిలిన వారాలలో చేయవచ్చు. ధన ప్రాప్తి కోసం శనివారం ఉదయం, లేదా శుక్రవారం సాయంత్రం అభ్యంగన స్నానం చేయాలి.

ఈ నియమాలన్నీ సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడే వర్తిస్తాయి. 

venusuryadevara@gmail.com

సూర్యదేవర వేణుగోపాల్  M. A. జ్యోతిష్యం

H. NO 1-879, సుందరయ్య నగర్ 

మధిర, ఖమ్మం జిల్లా   తెలంగాణా 507203


No comments:

Post a Comment