Thursday, 3 August 2017

దంతావధానం ఏ విధంగా చేయాలి?

దంతవధానం లేకుండా చేసే పూజా, జపాలు వ్యర్ధం. మంచి ఆరోగ్యం కోసం దంతావధానం తప్పక చేయాలి.  మన ప్రాచీన హైందవ గ్రంధాలు దంతావధానం ఏ విధంగా చేయాలి  ఏ యే పుల్లలతో చేయాలి అనే విషయాలను చక్కగా వివరించాయి. వీటిని పాటిస్తే మంచి తప్పక జరుగుతుంది.....

ప్రాగ్ముఖస్య ధృతిఃసౌఖ్యం  శరీర ఆరోగ్య మేవచ .......      గర్గ సంహిత

ఈశానాభిముఖః కుర్యాద్వాగ్యతో  దంతావధానం..........    జాతుకర్ణ్య


వీటి అర్ధం ఏమంటే  ఎల్లప్పుడు తూర్పు తిరిగి కానీ, లేదా ఈశాన్యం వైపు తిరిగి కానీ దంతావధానం చేయాలి.. ఈ విధంగా చేస్తే మంచి ఆరోగ్యము, సుఖం లభిస్తాయి.

ఉత్తరం వైపు తిరిగి కూడా దంతావధానం చేయవచ్చు.   మంచి ఆరోగ్యం సిద్దిస్తుంది..

దంతావధానం ఎప్పుడు దక్షిణం, పడమర ల వైపు తిరిగి చేయకూడదు,

 పశ్చిమే   దక్షిణే చైవ కుర్యాద్ధంత ధావనం ......    పద్మపురాణం......


చండ్ర, కానుగ, మేడి, మర్రి, చింత, వెదురు, మామిడి, వేప, ఉత్తరేణి, మారేడు, జిల్లేడు, కడిమి, రేగు, తుమికి   మొదలగు పుల్లలతో దంతావధానం చేయడం మంచిది.  నేటి కాలంలో వేప పుల్ల ఎక్కువ ప్రాముఖ్యతను పొందింది.

కుశమ్ కాసం పలాసం చ శింశపమ్ యస్తు భక్షయేత్
తావద్భవతి  చాండాలో యావద్ గంగాం నపస్యాత్   

 ఆచార మయూఖం.....

అంటే మోదుగ, మునగ, ప్రత్తి, దర్భ,గడ్డి, కుంకుడు మొదలగు పుల్లలతో  దంతావధానం చేయరాదు..

ఇంకా సూర్యోదయానికి ముందే దంతావధానం మంచిది.  ఆహారం తీసుకొన్న ప్రతిసారి నోటిని పుక్కిలించాలి.....

ప్రతి రోజు 2 సార్లు అంటే ఉదయం  సాయంత్రం దంతావధానం చేయాలని అనేక గ్రంథాలు చెప్పాయి......



సూర్యదేవర వేణుగోపాల్.  ఏం. ఏ   జ్యోతిష్యం.

ఇంటి నంబరు..... 1-879

సుందరయ్య నగర్  మధిర    ఖమ్మం జిల్లా

తెలంగాణా  507203
venusuryadevara@gmail.com

No comments:

Post a Comment