ఆషాఢ శుద్ధ పూర్ణిమ ది. 27-07-2018 శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం 4 వ పాదం మకరరాశి లో కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉంటుంది......ఇది భారత దేశం అంతటా గోచరిస్తుంది. అన్ని నియమాలు యధావిధిగా పాటించాలి.
గ్రహణ స్పర్శ కాలం. రాత్రి.గం|| 11: 55 ని|లకు
గ్రహణ మధ్య కాలం . రాత్రి. గం|| 01:54 ని|లకు
గ్రహణ మోక్ష కాలం. తె||ఝా| గం|| 03:50ని|లకు
గ్రహణ ఆద్యంత పుణ్యకాలం. గం||03:50 ని|లు.
ఈ గ్రహణం రాత్రి సమయం లో సంభవించుట వలన శుక్రవారం పగలు ఎటువంటి నియమాలు ఉండవు. అన్ని కార్య క్రమములు యధావిధిగా చేసుకోవచ్చును.
ఆలయములు ఉదయ పూజాదికాలు అనంతరం మూసివేయవచ్చు.
గ్రహణానంతరం
ది. 28-07-2018 శనివారం రోజు... ఉదయ సమయంలో స్నానం చేసి పూజాదికాలు, శాంతి పూజలు చేసుకోవచ్చు.
గర్భిణీ స్త్రీలు గ్రహణం వీక్షించ రాదు.
మకర రాశి వారు, ముఖ్యంగా ఊత్తరాషాఢ, శ్రవణ నక్షత్ర జాతకులు ఈ గ్రహణం చూడ రాదు. యధావిధిగా శాంతులు చేయించుకోవాలి.
సూర్యదేవర వేణుగోపాల్. M. A. జ్యోతిష్యం
సుందరయ్య నగర్. మధిర ఖమ్మం జిల్లా
తెలంగాణ
No comments:
Post a Comment