Sunday, 11 August 2019

నైరుతి వీధి శూల


నైరుతి వీధి శూల

వీధి శూల అంటే వీధి యొక్క చూపు లేక పోటు అని అర్ధం.  సాధారణం గా వీధి శూల మేలు చేయదు. అయితే ఈశాన్య వీధిశూల మేలు చేస్తుంది... పడమర వాయవ్యం, దక్షిణ ఆగ్నేయం వీధి పోటు కూడా మంచివే. నష్టాలను ఇవ్వవు. అన్నిటికన్నా నైరుతి వీధి శూల చాలా ప్రమాదం.
గృహ యజమాని, యజమానురాలు ఇంకా పెద్ద సంతానం పై దీని ప్రభావం అధికం. కుటుంబం మొత్తం కూడా ఈ వీధి శూల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. దక్షిణ నైరుతి వీధి శూల వల్ల గుండె జబ్బులు, ప్రమాదాలు, యాక్సిడెంట్స్ లో మృతి చెందడం... యజమాని ఉద్యోగం లేదా వృత్తిలో తీవ్ర సమస్యలు పొందడం, ఇంకా అనైతిక మైన పనులు చేసి పరువును పోగొట్టుకోవడం వంటివి జరగగలవు...
పడమర నైరుతి వీధిశూల స్త్రీల పై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది.. ప్రవర్తన దోషాలు, గుండె జబ్బులు. వృత్తిలో సమస్యలు, అధిక ఖర్చు, ప్రమాదాలు  జరగగలవు.
మొత్తం మీద గమనిస్తే నైరుతి వీధి శూల ప్రమాదాలను, గుండె జబ్బులను, వృత్తిలో సమస్యలను ఇంకా వివాహం లేట్ అవ్వడం, అబార్షన్స్ అవ్వడం, మగ సంతానం లేకపోవడం వంటి ఫలితాలు ఉంటాయి..ఈ వీధిశూల కుటుంబం మొత్తాన్ని వేధిస్తుంది. ముఖ్యంగా యజమాని, యజమానురాలు ఇంకా పెద్ద సంతానం జాగ్రత్తగా ఉండాలి...
ఈ వీధి శూలను వెంటనే సవరించాలి... నిర్లక్ష్యం చేయరాదు..


సూర్యదేవర వేణుగోపాల్... M. A (జ్యోతిష్యం)
సుందరయ్య నగర్ ... మధిర
ఖమ్మం జిల్లా 507203
Venusuryadevara@gmail.com


No comments:

Post a Comment