జ్యోతిష్య,వాస్తు,సంఖ్యాశాస్త్ర,యోగా సమగ్ర విశ్లేషణ .... సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)
Saturday, 3 March 2018
Suryadevara Venugopal: సర్వాపన్నివారణకు సుందర కాండ.
Suryadevara Venugopal: సర్వాపన్నివారణకు సుందర కాండ.: నవగ్రహ దోష నివారణకు వాల్మీకి రామాయణం లోని సుందరకాండ కల్పతరువు గా చెప్పబడింది. మానవ జీవితం లోని వివిధ సమస్యల నివారణకు శ్రీ సుందరకాండ పారాయణం...
సర్వాపన్నివారణకు సుందర కాండ.
నవగ్రహ దోష నివారణకు వాల్మీకి రామాయణం లోని సుందరకాండ కల్పతరువు గా చెప్పబడింది. మానవ జీవితం లోని వివిధ సమస్యల నివారణకు శ్రీ సుందరకాండ పారాయణం గొప్ప నివారణ గా మన పూర్వీకులు సూచించారు. ఇప్పటికీ మన హిందూ సంస్కృతి లో సుందరకాండకు విశేష మైన ప్రాముఖ్యత ఉంది. అనేక ఆపద నివారణకు సుందరకాండ పారాయణం దివ్యఔషధం గా అనేక పూర్వ గ్రంధాలు, మహర్షులు చెప్పడం జరిగింది. ఇప్పటికీ అనేకులు ఈ దివ్య మైన సుందర కాండ ను ఒక నిర్దుష్టమైన పద్దతిలో పారాయణం చేసి అనేక సమస్యల నుండి విముక్తిని పొందుతున్నారు.
సుందర కాండను ఏ విధంగా పారాయణం చేయాలి, ఏ సమస్యకు ఏ సర్గను పారాయణం చేయాలి అనే విషయాలను తెలుసుకొని పారాయణం చేస్తే అనేక మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఏ సమస్యకు ఏ సర్గ పారాయణం చేయాలో తెలుసుకుందాం.....
భూత ప్రేత భయ నివారణకు అనేక మానసిక ఆరోగ్య సమస్యలకు సుందరకాండ లోని 3 వ సర్గ "లంక విజయం" ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.
సంపద వృద్దికి అనేక ఆర్ధిక సమస్యల నివారణకు 15 వ సర్గ "లంకలో సీతాదేవి దర్శనం" ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.
పీడకలలు అనేక భయ నివారణకు 27 వ సర్గ " త్రిజట స్వప్నం" ను 21 రోజుల పాటు పారాయణం చేయాలి.
కోప నివారణకు సాత్విక గుణ వృద్దికి 21 వ సర్గ " సీతా రావణ సంవాదం" ను 11 రోజుల పాటు పారాయణం చేయాలి.
ఎడబాసిన బంధు సమాగమానికి 33 వ సర్గ నుండి 44 వ సర్గ వరకు "సీతా హనుమత్ సంవాదం ను " కనీసం 2 మండలాల పాటు పారాయణం చేయాలి.
సర్వాపన్నివారణకు 36 వ సర్గ " అంగళీయక ఘట్టం " ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.
శత్రువు ల పై జయానికి 42 వ సర్గ నుండి 47 వ సర్గ " హనుమంతులవారు వివిధ రాక్షస సంహారం" ఘట్టాలను 21 రోజుల పాటు పారాయణం చేయాలి.
గృహ వృద్దికి అనేక స్థిరాస్థి వృద్దికి 54 వ సర్గ "లంక దహన ఘట్టం" ను 3 మండలాలు పాటు పారాయణం చేయాలి.
సకల అభీష్ట సిద్దికి 41 వ సర్గ "అశోక వన ధ్వంసం" ఘట్టం ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.
పుత్ర సంతానం కోసం సప్త సర్గ పారాయణం 68 రోజులందు పారాయణం చేయాలి.
వివాహ సిద్దికి 9 రోజులలో సుందరకాండ మొత్తము ను పారాయణం చేయాలి.
విద్యా సమస్యలకు మొత్తం సుందర కాండ ను 7 రోజులందు పారాయణం చేయాలి.
శీఘ్ర ఉద్యోగ ప్రాప్తికి మొత్తం సుందర కాండ ను 9 లేదా 11 రోజులలో పారాయణం చేయాలి.
అనేక సమస్యలకు, ఆపదలకు ,వేదనలకు మొత్తం సుందర కాండ ను ఒకే రోజు లో పారాయణం చేయాలి.
నైవేద్యం గా పాయసం, పులిహోర, అప్పాలు, చక్కెర పొంగలి లేదా యధా శక్తి గా నివేదించాలి.
ఆవుపాలు, అరటిపండ్లు తప్పనిసరి.
పారాయణానికి ముందు గాని తరువాత గాని,శ్రీ రామరక్ష స్తోత్రం తప్పనిసరిగా పాటించాలి. ప్రతిరోజూ పారాయణం అనంతరం హనుమత్ పూజ ను చేయాలి.
పూర్తి పారాయణం ముగిసిన పిదప యధాశక్తి అన్నదానం చేసిన మంచి ప్రయోజనం కలుగుతుంది.
venusuryadevara@gmail. com
సూర్యదేవర వేణుగోపాల్ M. A (జ్యోతిష్యం)
H. NO. 1-879
సుందరయ్య నగర్ మధిర
ఖమ్మం జిల్లా తెలంగాణా
507203
Sunday, 21 January 2018
Suryadevara Venugopal: 31-01-2018 సంపూర్ణ చంద్రగ్రహణం
Suryadevara Venugopal: 31-01-2018 సంపూర్ణ చంద్రగ్రహణం: మాఘ శుద్ధ పౌర్ణిమ బుధవారం, ది. 31-01-2018 పుష్యమి నక్షత్ర కర్కాటక రాశి యందు రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం .......... గ్రహణ స్పర్...
31-01-2018 సంపూర్ణ చంద్రగ్రహణం
మాఘ శుద్ధ పౌర్ణిమ బుధవారం, ది. 31-01-2018 పుష్యమి నక్షత్ర కర్కాటక రాశి యందు
రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం ..........
గ్రహణ స్పర్శ కాలం సాయంత్రం గం|| 05:17 ని|లకు....
గ్రహణ మధ్యకాలం రాత్రి గం|| 06:58 ని|లకు....
గ్రహణ మోక్ష కాలం రాత్రి గం|| 08:41 ని|లకు
గ్రహణ ఆద్యంత పుణ్యకాలం.... గం|| 03:24 ని||లు
ఈ గ్రహణం భారత దేశం అంతా గోచరించును. ఇది కర్కాటక రాశియందు పట్టుట వలన పుష్యమి, ఆశ్లేష రాశి వారు చూడకూడదు.
అన్ని నియమాలు ఆచరించాలి.
గ్రహణానంతరం స్నానం చేసి భోజనాదికాలు చేయాలి.
మంత్రానుష్టానం కలవారు ఈ పుణ్యకాలం నందు మంత్రానుష్టానం చేయుట మంచిది.
శ్రీకాళహస్తి లో కాలసర్పదోషం కలవారు రాహు-కేతు పూజ జరిపించిన విశేష ఫలం లభిస్తుంది...
venusuryadevara@gmail.com
సూర్యదేవర వేణుగోపాల్ M.A. (జ్యోతిష్యం)
సుందరయ్య నగర్ మధిర ఖమ్మం జిల్లా తెలంగాణా.
507203
Sunday, 14 January 2018
Suryadevara Venugopal: కాలసర్పదోషం- పరిహారాలు.
Suryadevara Venugopal: కాలసర్పదోషం- పరిహారాలు.: . . అగ్రే రాహు రధౌ కేతు: మధ్యే షడ్గ్రహౌ తధా యది కాలసర్పాఖ్య యోగాయా నృప రాష్ట్ర వినాశనం అగ్రే కేతు రధౌ రాహు: గర్భస్తే సప్తకే తధా ...
కాలసర్పదోషం- పరిహారాలు.
.
.
అగ్రే రాహు రధౌ కేతు: మధ్యే షడ్గ్రహౌ తధా
యది కాలసర్పాఖ్య యోగాయా నృప రాష్ట్ర వినాశనం
అగ్రే కేతు రధౌ రాహు: గర్భస్తే సప్తకే తధా
యది అపసవ్య కాల సర్పాఖ్య దోషయం నృపానం సమరం భవేత్.
జాతక చక్రం లో అన్ని గ్రహాలు అంటే మిగిలిన 7 గ్రహాలు రాహు- కేతు మధ్య ఉంటే అది కాలసర్పదోషం అవుతుంది. ప్రధానంగా ఇది 2 రకాలుగా ఉంటుంది. 7 గ్రహాలు రాహు-కేతు మధ్య ఉంటే అది సవ్య కాలసర్పదోషం అవుతుంది. ఇలా కాకుండా గ్రహాలన్నీ కేతు రాహు మధ్య ఉంటే దానిని అపసవ్య కాలసర్పదోషం అంటారు. సవ్య కాలసర్పదోషం అనేక కష్టాలను నష్టాలను ఇస్తుంది. అపసవ్య దోషం సవ్యం అంత కాకపోయినా ఇది కూడా నష్టాలను కలిగిస్తుంది.
కాలసర్పదోషం లగ్నం నుండి 7 వ స్థానం మధ్యన ఉంటే జీవిత ప్రధమ భాగం దెబ్బతిని అనేకవిధాలుగా నష్టాలను ప్రసాదిస్తుంది. ఈ దోషం 7 వ స్థానం తో మొదలయ్యి 12 వ స్థానం వరకు పడితే జీవితం లో 2 వ భాగం దెబ్బతింటుంది.
కాలసర్పదోషం ఉన్న జాతకుడు స్థిరపడుటలో తీవ్ర జాప్యం ఉంటుంది. సరియైన ఉద్యోగం ఉండదు, వృత్తి ఉండదు, ఇంకా వివాహం లో తీవ్ర జాప్యం ఉంటుంది. విద్యా నష్టం జరగ వచ్చు. మిగిలిన మంచి యోగాలు లేకపోతే వ్యసనాలు అలవాటు అయ్యే ప్రమాదం ఉంది. సంతానం పొందటంలో సమస్యలు జాప్యం ఉంటుంది. మిగిలిన గ్రహస్థితి సరిగా లేకపోతే వివాహం కావడం చాలా కష్టం. అయితే సుమారు 34, లేదా 36 సం||రాల నుండి దీని ప్రభావం తగ్గే వీలుంది.
సర్పదోషం కాలసర్పదోషం కంటే తక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది. జాతకం లో రవి రాహువు నుండి 8 వ స్థానం లో ఉన్నా, చంద్రుని నుండి 8 వ స్థానం లో రాహువు గాని కేతువు కానీ ఉన్న, లగ్న త్రికోణాలలో. రాహువు కేతువు ఉన్న గాని లేదా లగ్నం నుండి 6, 7, 8, స్థానాలలో రాహు ఉంటే సర్పదోషం అవుతుంది. ఇది కూడా అనేక చేదుఫలితాలను ఇస్తుంది. మనిషికి జీవితంలో సరిగా. స్థిరత్వాన్ని అందించదు.
అయితే ఈ కాలసర్ప దోషం మనుష్యలకు వర్తించదు, దేశానికి వర్తిస్తుందని చాలామంది అభిప్రాయం. అయితే ప్రస్తుత తరుణంలో జాతకంలో ఈ గ్రహ సమస్యలు ఉన్నవారు అనేక సమస్యలలో ఉండటం కనిపిస్తుంది. కనుక తప్పని సరిగా పరిహారం జరిపించాలి.
పరిహారాలు:
శ్రీకాళహస్తి లో రాహు-కేతు పూజ జరిపించాలి.
నాసిక్ త్రయంబకేశ్వర్ లో కాలసర్పదోష పూజ జరిపించాలి.
కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్య ఆలయం లో కాలసర్పదోష పూజ జరిపించాలి.
సుబ్రహ్మణ్య స్వామి మరియు మానస దేవి లకు ప్రతి రోజు యధా శక్తి పూజ చేయాలి.
దోషం బలంగా ఉంటే నాగ ప్రతిష్ట చేయాలి.
41 రోజుల పాటు సర్ప సూక్తంతో శివాలయం లో అభిషేకం చేయించాలి.
కర్ణాటక లోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో సర్పసంస్కార పూజ జరిపించాలి.
7 సం|రాల పాటు సం|రానికి 6 మంగళ వారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపించాలి.
గోమేధికం, వైఢూర్యం లను కలిపి వెండి లో ఉంగరం చేయించి మధ్య వ్రేలికి ధరించాలి.
ఈ విధంగా పై పరిహారాలను ఎవరికి వీలైనవి వారు చేయించాలి,
గృహం లో నిత్య దీపారాధన, సంధ్యావందనం అనేక దోషాలను తొలగిస్తాయి. కనుక నిత్యం గృహం లో ఇష్ట దేవతను పూజించుట మంచిది.
venusuryadevara@gmail.com
సూర్యదేవర వేణుగోపాల్ M.A ( జ్యోతిష్యం)
H. NO.1-879
సుందరయ్య నగర్ మధిర ఖమ్మం జిల్లా
తెలంగాణా 507203

Tuesday, 9 January 2018
Suryadevara Venugopal: 15 తేదీనే మకర సంక్రాంతి
Suryadevara Venugopal: 15 తేదీనే మకర సంక్రాంతి: ప్రాచీన సూర్య సిద్దాంతం ప్రకారం సూర్యుడు మకర రాశి యందు ది. 14- 01- 2018 రాత్రి గం| 07:01 ని|లకు ప్రవేశించుట జరుగుతుంది. కనుక 15 జనవరి ...
15 తేదీనే మకర సంక్రాంతి
ప్రాచీన సూర్య సిద్దాంతం ప్రకారం సూర్యుడు మకర రాశి యందు
ది. 14- 01- 2018 రాత్రి గం| 07:01 ని|లకు ప్రవేశించుట జరుగుతుంది.
కనుక 15 జనవరి రోజుననే మకర సంక్రాంతి పర్వదినమును జరుపుకోవాలి.
జనవరి 14 వ తేదీ భోగి కాగలదు.
సూర్యాస్తమయానికి ముందుగానే రవి మకర రాశి ప్రవేశం చేస్తే ఆ రోజునే
మకర సంక్రాంతి అవుతుంది.
అదే సూర్యాస్తమయానికి తరువాత రవి మకర రాశి ప్రవేశం చేస్తే మరుసటి రోజున
మకర సంక్రాంతి అవుతుందని ప్రాచీన సూర్యసిద్దాంతం తెలుపుతుంది.
2018 న సూర్యుడు 14 జనవరి రాత్రి గం|07:01 ని||లకు మకర రాశి నందు
ప్రవేశించుట జరుగుతుంది. ఇది సూర్యాస్తమయం అనంతరం జరిగే
సంక్రమణం. కనుక 15 వ తేదీ నే మకర సంక్రాంతి జరుపుకోవాలి.
కనుక 15 వ తేదీనే మకర సంక్రాంతి పర్వదినమును చేయుట ఉత్తమము.

Sunday, 26 November 2017
వాస్తు సందేహాలు- సమాధానాలు
1. నైరుతి లోనే బెడ్ రూమ్ ఉండాలా? ఎక్కడైనా ఉండవచ్చా?
జ. బెడ్రూం కు దక్షిణ, పడమర, ఇంకా నైరుతి దిశలు మంచివి. ఈశాన్యం లో కూడా బెడ్ రూమ్ ఉంచవచ్చు. చిన్నపిల్లలకు ఈశాన్యం బెడ్రూం ఉంచవచ్చు. వాయవ్య దిశ నందు కూడా బెడ్రూం ఉంచవచ్చు. ఇది కూడా మంచి దిక్కే. అయితే నైరుతి నందు బెడ్రూం కంటే స్టోర్ రూమ్ మంచిది. ఈ దిశలో స్టోర్ రూమ్ ఉంటే దక్షిణ పడమరలందు బెడ్రూం ఉంచవచ్చు. ఆగ్నేయం నందు బెడ్ రూమ్ మంచిది కాదు.
2. దక్షిణ ముఖంగా గృహాన్ని కట్టవచ్చా? చాలామంది మంచిది కాదు అని అంటారు కదా,,,,
జ. దిక్కులన్నీ మంచివే. ఒక్కొక్క దిశకు ఒక్కొక్క గుణం ఉంది. దానిని తెలుసుకొని వాస్తును పాటించాలి. దక్షిణ ముఖంగా చక్కగా గృహాన్ని నిర్మించుకోవచ్చు. భయం అక్కరలేదు.
3. పశువుల శాలలకు ఏ దిశ మంచిది?.
జ. వాయవ్యం దిశ పశువుల కొష్టాలకు శ్రేష్టం.
4. గృహాలకు, పరిశ్రమలకు, ఇంకా దేవాలయాలకు వాస్తు పద్దతులలో భేదం ఉందా?
జ. అన్నిటికి ఒకే విధమైన వాస్తు పనిచేయదు. కట్టడంలో చేసే కార్యాన్ని అనుసరించి వాస్తుని అమలు చేయాలి. అప్పుడే మంచి ప్రయోజనాలు ఉంటాయి. గృహవాస్తుకు పరిశ్రమల వాస్తుకు భేదం ఉంది. ఆలయాలకు గృహ వాస్తును పాటించకూడదు. ఆలయాలను తప్పనిసరిగా ఆగమ శాస్త్రం అనుసరించి నిర్మించాలి. గృహవాస్తుకు ఆలయ వాస్తు కు చాలా భేదం ఉంది.
5. వర్గు నియమం మంచిదేనా?
జ. మంచి సమన్వయంతో వర్గు ను పాటిస్తే అద్భుత ఫలితాలుంటాయి
6. ఆయమ్ పాటించి గృహాన్ని నిర్మించాలా?
జ. సరైన పద్దతిని పాటించి మంచి ఆయాది గణితంతో గృహాన్ని నిర్మించాలి. అప్పుడే వాస్తు ఫలితాలు ఉంటాయి.
7. నైరుతి కట్ అయిన స్థలం మంచిదేనా?
జ. అన్నీ దిశలు ఉన్నప్పుడే మంచి ప్రయోజనాలుంటాయి. నైరుతి దిశ కట్ అయిన స్థలం మంచిది కాదు.
8. నీటి వాడ కానికి ఏ దిశ మంచిది?
జ. వాయవ్య దిశ చాలా మంచిది.
9. కార్ పార్కింగ్ షెడ్ ఎక్కడ వేయవచ్చు?
జ. ఈశాన్యం మినహా ఎక్కడైనా వేయవచ్చు. అయితే సరైన పారులను గమనించాలి.
10. ఏ దిశ ముఖంగా కూర్చుని విద్యనభ్యసించాలి?
జ. తూర్పు, ఉత్తర దిశల అభిముఖంగా కూర్చుని విద్యనభ్యసించాలి.
venusuryadevara@gmail.com
సూర్యదేవర వేణుగోపాల్. M.A (జ్యోతిష్యం)
H. NO. 1-879
సుందరయ్య నగర్ మధిర
ఖమ్మం జిల్లా 507203
ఖమ్మంజిల్లా.
Thursday, 16 November 2017
Monday, 13 November 2017
దక్షిణం అంటే భయమెందుకు?
దక్షిణం అంటే భయం ఎందుకు?
ఈ రోజుల్లో దక్షిణం దిశ మీద చాలా అపోహలు ప్రజలలో ఉన్నాయి. ఇప్పటి వాస్తు పండితులు కూడా దక్షిణ దిశ పై లేనిపోని భయాలను, అపోహలను పెంచుతున్నారు. వాస్తవం ఏమిటంటే వాస్తు లో అన్ని దిశలకు దేనికుండే లాభ నష్టాలు వాటికున్నాయి.. అయితే పరిస్థితులకు అనుగుణంగా దిశలను సరిచేసి కట్టడాలను నిర్మించాలి. దిక్కుల యొక్క లక్షణాలు వాటి పరిమితులను తెలుసుకొని వాస్తు సూత్రాలను పాటించాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. అంతే కాని ఒక దిశ మంచిదని ఇంకొక దిశ మంచిది కాదని వర్గీకరించకూడదు.
దక్షిణ దిక్కు చాలా బలమైన దిక్కు. దీని అధిపతి యముడు. నవగ్రహాలలో కుజ గ్రహం ఈ దిక్కునకు ఆధిపత్యం కలిగి ఉంటాడు. మన కర్మల ఫలాలను ఈ దిశ మనకు అందిస్తుంది. ఈ దిక్కును సరియైన రీతిలో వినియోగించుకుంటే సత్వర అభివృద్ది తధ్యం. ఈ దిక్కును వినియోగించుకోవడంలో పొరపాట్లు జరిగితే అనేక నష్టాలు కలిగే ప్రమాదం ఉంది. సరియైన రీతిలో దక్షిణ దిక్కును ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం.
దక్షిణం ను సరిగ్గా ఉంచితే చాలా మంచి ఫలితాలు త్వరగా కలుగుతాయి. ముందుగా గృహ ప్రాంగణంలో దక్షిణ దిక్కును మెరకలో ఉంచాలి. ఉత్తరం కన్నా దక్షిణం మెరకగా ఉంటే ధనలాభం ఆరోగ్యం తప్పక కలుగుతాయి. దక్షిణ దిక్కును ఎప్పుడు పల్లంగా ఉంచరాదు. ఈ శ్లోకాన్ని గమనించండి......
నశ్యన్తి పురుషా స్తత్ర దేవతాచ ప్రణశ్యతి
ధన హానింకరో తధా నిత్యం రోగ కృ దక్షిణ ప్లవ
అపరాజిత పృచ్చ
దక్షిణ దిశ పల్లంగా ఉంటే ధన నష్టం రోగాలు కలుగుతాయి అని దీనర్థం. దేవతలు కూడా ఇటువంటి స్థలాలలో ఉంటే నశిస్తారు అని అపరాజిత పృచ్చ అనే ప్రాచీన వాస్తుగ్రంధం తెలుపుతుంది. కనుక దక్షిణ దిక్కును ఎత్తులో ఉంచితే ఆరోగ్యం, ధనం సులభంగా ప్రాప్తిస్తాయి. కనుక దక్షిణ దిక్కును ఫ్లోరింగ్ లోనూ, నిర్మాణం లోనూ ఎత్తులో ఉంచితే అనేక లాభాలు కలుగుతాయి. కాబట్టి ఈ దిక్కును ఎత్తులో ఉంచినంత వరకు దక్షిణ దిక్కు ను గురించి భయపడనక్కర లేదు.
య, ర, ల, వ అనే అక్షరాలతో పేరు ప్రారంభం అయ్యే వారికి దక్షిణ ఫెసింగ్ చాలా బాగా కలిసి వస్తుంది. ఈ అక్షరాల తో ప్రారంభం అయ్యేపేరు గల వ్యాపారాలు కూడా దక్షిణ ఫెసింగ్ లో ఉంటే బాగా సాగుతాయి. అయితే దక్షిణం లో వేరే దోషాలు లేకపోతే ఈ అక్షరాల వారికి అద్భుతుంగా కలిసి వస్తుంది. దక్షిణ ఫెసింగ్ లో ఉండటం అంటే ఉత్తరం లో నివసించినట్లే. అంటే రోడ్ దక్షిణం ఉంటుంది . వ్యాపార సంస్థలు రోడ్ కు ఉత్తరం లో ఉంటాయి. అంటే కుబేర స్థానంలో వ్యాపారాలు ఉంటాయి కాబట్టి అవి బాగా సాగి మంచి లాభాలు వస్తాయి. కిరాణా దుకాణాలు, హోటల్స్ ఇంకా నిత్యవసర వస్తు దుకాణాలు బాగా సాగుతాయి. ఈ సూత్రం య,ర, ల, వ అక్షరాల వారికి వర్తిస్తుంది. ఈ రహస్యం తెలియక చాలామంది దక్షిణ ముఖంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ఇష్టపడరు. భయపడతారు. దక్షిణంలో ఇతర దోషాలు లేనంతవరకు ఈ ముఖంగా వ్యాపారాలు ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయి. ఇది అనుభవ పూర్వకం గా తెలుసు కున్న సత్యం.
గృహంలో దక్షిణ దిక్కులో ఏ గది ఉంచాలో మన ప్రాచీన వాస్తు గ్రంధాలు తెలియజేశాయి.
దక్షిణేచైవ శయనం .......... సనత్ కుమార సంహిత
అంటే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న బెడ్రూం దక్షిణంలో ఉండాలని సనాత్కుమార సంహిత తో పాటు అనేక ప్రాచీన వాస్తు గ్రంధాలు తెలియజేశాయి. అయితే ఇప్పుడు మనం బెడ్రూం లను నైరుతిలో ఉంచుతున్నాము. ఇది తప్పు లేదుకాని, వీటిని దక్షిణంలో ఉంచితే ఇంకా మరిన్ని ప్రయోజనాలు తప్పక కలుగుతాయి. బెడ్ రూమ్ లను నైరుతి లో కన్నా దక్షిణ దిశలో ఉంచితే తప్పనిసరిగా మంచి ఆరోగ్యం కలుగుతుంది. సందేహం లేదు. అయితే దక్షిణంలో తప్పనిసరిగా కిటికీ ఉంచాలి. అప్పుడు మాత్రమే అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది.
బరువులను మోసే దిశ దక్షిణం కనుక ఈ దిశలో ఎక్కువ బరువైన వస్తువులను ఉంచాలి. దక్షిణ నైరుతిలో స్టోర్ రూమ్ వేసి ఎక్కువ బరువులను ఉంచితే అద్భుతమైన ఫలితాలు తప్పక కలుగుతాయి.
దక్షిణం పల్లంగా ఉండకూడదు కాబట్టి బావులు కానీ గుంటలు కానీ ఉంచరాదు. ఈ దిశలో బొర్స్ కానీ బావులు కానీ ఉంటే ఆకస్మిక ప్రమాదాలు,ఆరోగ్య ఆర్ధిక సమస్యలు వస్తాయి. ఇంకా ప్రమాదాలలో అంగవైకల్యం కలిగే వీలుంది.
స్త్రీకలహా స్త్రీ దౌష్ట్యం .......... బృహత్ సంహిత...
దక్షిణంలో బావులుంటే స్త్రీ నాశనం, స్త్రీలకు సమస్య అని బృహత్ సంహిత తెలియ జేస్తుంది..
గృహంలో దక్షిణ దిక్కును ఎత్తులో ఉంచాలని చాలామంది ఇంటి లోపలి భాగం కన్నా బయట ఫ్లోరింగ్ ( అంటే ప్రహరికి, ఇంటికి మధ్య వదలిన ఖాళీస్థలం) ఎత్తులో ఉంచుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ విధమైన అమరిక వలన ధనం బాగా ఖర్చు అవుతుంది. కనుక దక్షిణం ను గృహంలో కన్నా కొంచెం పల్లంలో ఉంచి ఉత్తరం కన్నా ఎత్తులో ఉంచాలి. అప్పుడు మాత్రమే ఈ దిశ నుండి మంచి ఫలాలు లభిస్తాయి.
గృహం లో కానీ ఇంకా ఏ నిర్మాణం లో నైనా దక్షిణ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం వదలి నిర్మాణం చేపట్టాలి. దక్షిణం కన్నా ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ ఉంచి నిర్మాణం చేయాలి.
దక్షిణం వైపు అసలు ఖాళీ స్థలం వదలకుండా నిర్మాణాలు చేయకూడదు. నిర్మాణాలకు 4 ప్రక్కల ఖాళీ తప్పనిసరిగా ఉంచాలి. దక్షిణం వైపు ఇంటిని ఖాయం చేసి అంటే ఖాళీ స్థలం వదలకుండా నిర్మిస్తే గృహస్తుకు అనేక సమస్యలు వస్తాయి. చాలామంది దక్షిణం వైపు ద్వారాలను ఉంచడానికి భయపడతారు. ఇది అర్ధం లేని భయం మాత్రమే. నిరభ్యంతరంగా దక్షిణం వైపు ద్వారాన్ని అమర్చవచ్చు. అదే విధంగా దక్షిణ దిశలో కిటికీ తప్పనిసరిగా ఉండాలి. దక్షిణంలో కిటికీ లేని గృహం రోగ గృహం.
కన్య, మకర, మిథున రాశులవారికి దక్షిణం సింహద్వారం శ్రేష్టం. ఇది గమనించండి...
కన్యా మకర యుగ్మానామ్ దక్షిణ ద్వారా మిష్టదమ్........... జ్యోతిర్నిబంధం
జ్యోతిర్నిబంధం అనే ప్రాచీన గ్రంధం కన్య, మకర మరియు మిధున రాశులవారికి దక్షిణ సింహద్వారం మంచిదని సూచిస్తుంది. కనుక భయం లేకుండా దక్షిణ ద్వారం అమర్చవచ్చు.
ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమంటే, దక్షిణ దిశ చాలా బలమైనది. ఫలితాలను వెంటనే చూపిస్తుంది. ఈ దిశను వాస్తు ప్రకారం కరెక్ట్ గా ఉంచినట్లైతే భయపడనవసరం లేదు. ఈ దిశను మెరకగా ఉంచి, బావులు, సంప్స్ లేకుండా, ఇంకా తక్కువ స్థలం వదిలి నిర్మాణాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అంతే కానీ అసలు ఈ దిక్కు మంచిది కాదని నిర్ణయించి నిర్మాణాలు చేస్తే ప్రగతి లోపిస్తుంది. అన్ని దిక్కులను సమన్వయం చేసి ఉపయోగించుకుంటేనే మంచి అభివృద్ది సాధ్యం. అందుచేత సరియైన వాస్తు సూత్రాలను పాటించి దక్షిణంను సరియైన రీతి లో ఉపయోగించుకోవాలి అప్పుడు మాత్రమే మంచి ఆరోగ్యం, మంచి సంపద లభిస్తాయి.
సూర్యదేవర వేణుగోపాల్. M.A. (జ్యోతిష్యం)
మధిర ఖమ్మం జిల్లా.
venusuryadevara@gmail.
సూర్యదేవర వేణుగోపాల్
ఇంటి నెం 1-879
సుందరయ్య నగర్ మధిర
ఖమ్మం జిల్లా

Monday, 30 October 2017
కార్తీక పౌర్ణిమ 03-11-2017
హెవలంబి నామ సం|ర లో కార్తీక పౌర్ణిమ
ది 03 నవంబరు 2017 రోజున చేయాలి.
పౌర్ణిమ 03 వ తేదీ మ. 12:50 ని.లకు ప్రవేశిస్తుంది.
04 నవంబరు ఉ.11;19 వరకు ఉంటుంది.
రాత్రి సమయం, లో పౌర్ణిమ 3 వ తేదీ లో ఉన్నది కాబట్టి
03 వ తేదీ సాయంత్రం వత్తులు వెలిగించాలి. కార్తీక పౌర్ణిమను ఆచరించాలి.
జ్వాలాతోరణం, 365 వత్తులు, 33 పున్నముల నోము లను 03 వ తేదీ సాయంత్రం నుండి ఆచరించాలి.
కేదారేశ్వర నోములను 04 వ తేదీ నందు ఆచరించాలి.
సద్గురు గురునానక్ జయంతిని 04 వ తేదీ న ఆచరించాలి..
సూర్యదేవర వేణుగోపాల్. M. A. జ్యోతిష్యం
సుందరయ్య నగర్. మధిర ఖమ్మం జిల్లా తెలంగాణా.
Saturday, 9 September 2017
Suryadevara Venugopal: 27-09-2017 సరస్వతి పూజ
Suryadevara Venugopal: 27-09-2019 సరస్వతి పూజ: శ్రీ హేవళంబి నామ సం|రం లో సరస్వతి పూజను ది.27-09-2017 శ్రీ ఆశ్వియుజ శుద్ద సప్తమి బుధవారం రోజున చేయాలి. ఉదయం గం| 09:20 ని| ల తరువాత సరస్వతి ...
Subscribe to:
Posts (Atom)