.
.
అగ్రే రాహు రధౌ కేతు: మధ్యే షడ్గ్రహౌ తధా
యది కాలసర్పాఖ్య యోగాయా నృప రాష్ట్ర వినాశనం
అగ్రే కేతు రధౌ రాహు: గర్భస్తే సప్తకే తధా
యది అపసవ్య కాల సర్పాఖ్య దోషయం నృపానం సమరం భవేత్.
జాతక చక్రం లో అన్ని గ్రహాలు అంటే మిగిలిన 7 గ్రహాలు రాహు- కేతు మధ్య ఉంటే అది కాలసర్పదోషం అవుతుంది. ప్రధానంగా ఇది 2 రకాలుగా ఉంటుంది. 7 గ్రహాలు రాహు-కేతు మధ్య ఉంటే అది సవ్య కాలసర్పదోషం అవుతుంది. ఇలా కాకుండా గ్రహాలన్నీ కేతు రాహు మధ్య ఉంటే దానిని అపసవ్య కాలసర్పదోషం అంటారు. సవ్య కాలసర్పదోషం అనేక కష్టాలను నష్టాలను ఇస్తుంది. అపసవ్య దోషం సవ్యం అంత కాకపోయినా ఇది కూడా నష్టాలను కలిగిస్తుంది.
కాలసర్పదోషం లగ్నం నుండి 7 వ స్థానం మధ్యన ఉంటే జీవిత ప్రధమ భాగం దెబ్బతిని అనేకవిధాలుగా నష్టాలను ప్రసాదిస్తుంది. ఈ దోషం 7 వ స్థానం తో మొదలయ్యి 12 వ స్థానం వరకు పడితే జీవితం లో 2 వ భాగం దెబ్బతింటుంది.
కాలసర్పదోషం ఉన్న జాతకుడు స్థిరపడుటలో తీవ్ర జాప్యం ఉంటుంది. సరియైన ఉద్యోగం ఉండదు, వృత్తి ఉండదు, ఇంకా వివాహం లో తీవ్ర జాప్యం ఉంటుంది. విద్యా నష్టం జరగ వచ్చు. మిగిలిన మంచి యోగాలు లేకపోతే వ్యసనాలు అలవాటు అయ్యే ప్రమాదం ఉంది. సంతానం పొందటంలో సమస్యలు జాప్యం ఉంటుంది. మిగిలిన గ్రహస్థితి సరిగా లేకపోతే వివాహం కావడం చాలా కష్టం. అయితే సుమారు 34, లేదా 36 సం||రాల నుండి దీని ప్రభావం తగ్గే వీలుంది.
సర్పదోషం కాలసర్పదోషం కంటే తక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది. జాతకం లో రవి రాహువు నుండి 8 వ స్థానం లో ఉన్నా, చంద్రుని నుండి 8 వ స్థానం లో రాహువు గాని కేతువు కానీ ఉన్న, లగ్న త్రికోణాలలో. రాహువు కేతువు ఉన్న గాని లేదా లగ్నం నుండి 6, 7, 8, స్థానాలలో రాహు ఉంటే సర్పదోషం అవుతుంది. ఇది కూడా అనేక చేదుఫలితాలను ఇస్తుంది. మనిషికి జీవితంలో సరిగా. స్థిరత్వాన్ని అందించదు.
అయితే ఈ కాలసర్ప దోషం మనుష్యలకు వర్తించదు, దేశానికి వర్తిస్తుందని చాలామంది అభిప్రాయం. అయితే ప్రస్తుత తరుణంలో జాతకంలో ఈ గ్రహ సమస్యలు ఉన్నవారు అనేక సమస్యలలో ఉండటం కనిపిస్తుంది. కనుక తప్పని సరిగా పరిహారం జరిపించాలి.
పరిహారాలు:
శ్రీకాళహస్తి లో రాహు-కేతు పూజ జరిపించాలి.
నాసిక్ త్రయంబకేశ్వర్ లో కాలసర్పదోష పూజ జరిపించాలి.
కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్య ఆలయం లో కాలసర్పదోష పూజ జరిపించాలి.
సుబ్రహ్మణ్య స్వామి మరియు మానస దేవి లకు ప్రతి రోజు యధా శక్తి పూజ చేయాలి.
దోషం బలంగా ఉంటే నాగ ప్రతిష్ట చేయాలి.
41 రోజుల పాటు సర్ప సూక్తంతో శివాలయం లో అభిషేకం చేయించాలి.
కర్ణాటక లోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో సర్పసంస్కార పూజ జరిపించాలి.
7 సం|రాల పాటు సం|రానికి 6 మంగళ వారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపించాలి.
గోమేధికం, వైఢూర్యం లను కలిపి వెండి లో ఉంగరం చేయించి మధ్య వ్రేలికి ధరించాలి.
ఈ విధంగా పై పరిహారాలను ఎవరికి వీలైనవి వారు చేయించాలి,
గృహం లో నిత్య దీపారాధన, సంధ్యావందనం అనేక దోషాలను తొలగిస్తాయి. కనుక నిత్యం గృహం లో ఇష్ట దేవతను పూజించుట మంచిది.
venusuryadevara@gmail.com
సూర్యదేవర వేణుగోపాల్ M.A ( జ్యోతిష్యం)
H. NO.1-879
సుందరయ్య నగర్ మధిర ఖమ్మం జిల్లా
తెలంగాణా 507203

No comments:
Post a Comment