Saturday 17 December 2016

Suryadevara Venugopal: తల స్నానం ఏ వారం చేయాలి.

Suryadevara Venugopal: తల స్నానం ఏ వారం చేయాలి.: తలస్నానం, అభ్యంగన స్నానం ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు చేయకూడదు. మన హిందూ జ్యోతీష్య గ్రంధాలు ఈ స్నానం విషయంలో అనేక సూచనలు చేశాయి.  మానవ ప్రయోజనార్...

తల స్నానం ఏ వారం చేయాలి.

తలస్నానం, అభ్యంగన స్నానం ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు చేయకూడదు. మన హిందూ జ్యోతీష్య గ్రంధాలు ఈ స్నానం విషయంలో అనేక సూచనలు చేశాయి.  మానవ ప్రయోజనార్ధం, ప్రకృతి నియమాలను దృష్టిలో ఉంచుకొని ఈ సలహాలను సూచించుట జరిగింది. ప్రస్తుత సమాజం ఈ నియమాలను అంతగా పట్టించుకోవడం లేదు. కానీ ఈ నియమాలను పాటిస్తే మంచి తప్పక జరుగుతుంది.

 తలస్నానం ఏ వారం చేయాలో, ఏ వారం చేయకూడదో, ఈ క్రింది పట్టికను గమనిస్తే తెలుస్తుంది.. 

ఆదివారం   తలస్నానం  చేస్తే  మనిషి తేజస్సు, అందం తగ్గుతుంది. మనస్తాపం కలుగుతుంది. చెడు వార్తలు వినవలసి వస్తుంది.

సోమవారం తలస్నానం వలన ముఖ కాంతి తగ్గుతుంది. అనవసర భయాలు ఆవరిస్తాయి. 

మంగళవారం తలస్నానం వలన అపాయం, ఆయుక్షీణమ్ కలుగుతుంది.. వివాహిత స్త్రీలు మంగళ వారం తలస్నానం చేస్తే భర్తకు కలసిరాదు.

బుధవారం తలస్నానం వలన కీర్తి, ధన, విద్యా లాభం కలుగుతుంది. అన్నింటా శుభం.

గురువారం తలస్నానం వలన విద్యలో ఆటంకాలు, అధిక ఖర్చు,  ఆందోళన, అందరితో విభేదాలు కలుగుతాయి.

శుక్రవారం తలస్నానం వలన అనారోగ్యం, ధన వస్తు నష్టం ఉంటాయి.

శనివారం తలస్నానం ఆయుర్దాయం పెంచుతుంది. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. అన్ని పనులు విజయవంతం అవుతాయి. సకల భోగాలు కలుగుతాయి.


పై విషయాలను మనం గమనిస్తే తలస్నానం బుధవారం, శనివారం చేస్తే మంచిదని తెలుస్తుంది.

మిగిలిన రోజులందు అత్యవసరంగా చేయవలసివస్తే తలకు కొంచెం నువ్వుల నూనె రాసుకొని, నీటిలో కొంచెం పూలు, గరిక వేసి తలస్నానం చేయవచ్చు. అయితే సోమవారం రోజు తలస్నానం పూర్తి నిషిద్దం. 

అభ్యంగన స్నానం  విషయంలో మంగళ, గురు వారములందు పూర్తి నిషిద్దం మిగిలిన వారాలలో చేయవచ్చు. ధన ప్రాప్తి కోసం శనివారం ఉదయం, లేదా శుక్రవారం సాయంత్రం అభ్యంగన స్నానం చేయాలి.

ఈ నియమాలన్నీ సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడే వర్తిస్తాయి. 

venusuryadevara@gmail.com

సూర్యదేవర వేణుగోపాల్  M. A. జ్యోతిష్యం

H. NO 1-879, సుందరయ్య నగర్ 

మధిర, ఖమ్మం జిల్లా   తెలంగాణా 507203


Saturday 3 December 2016

Suryadevara Venugopal: ఇంట్లో ఏ దేవుని ఫోటో ఉంచాలి- శని యంత్రం ఉంచుకోవచ్...

Suryadevara Venugopal: ఇంట్లో ఏ దేవుని ఫోటో ఉంచాలి- శని యంత్రం ఉంచుకోవచ్...: నిలబడి ఉన్న లక్ష్మి దేవి చిత్రాన్ని గృహంలో ఉంచరాదు.కూర్చుని ఉన్న ఫోటో ని మాత్రమే ఇంట్లో ఉంచాలి. లక్ష్మి దేవి బొమ్మను కాని ఫోటో ని గాని ద...

Vastu Velugu @ Suryadevara Venugopaal: ఇంట్లో ఏ దేవుని ఫోటో ఉంచాలి- శని యంత్రం ఉంచుకోవచ్...

Vastu Velugu @ Suryadevara Venugopaal: ఇంట్లో ఏ దేవుని ఫోటో ఉంచాలి- శని యంత్రం ఉంచుకోవచ్...: నిలబడి ఉన్న లక్ష్మి దేవి చిత్రాన్ని గృహంలో ఉంచరాదు.కూర్చుని ఉన్న ఫోటో ని మాత్రమే ఇంట్లో ఉంచాలి. లక్ష్మి దేవి బొమ్మను కాని ఫోటో ని గాని ద...

Vastu Velugu @ Suryadevara Venugopaal: Vastu Velugu @ Suryadevara Venugopaal: శంఖువు- కొల...

Vastu Velugu @ Suryadevara Venugopaal: Vastu Velugu @ Suryadevara Venugopaal: శంఖువు- కొల...: Vastu Velugu @ Suryadevara Venugopaal: శంఖువు- కొలతలు- నమూనా- లక్షణాలు : గృహం నిర్మించడానికి ప్రధమం గా చేసే పని శంఖుస్థాపన. అంటే దారువుతో చ...

ఇంట్లో ఏ దేవుని ఫోటో ఉంచాలి- శని యంత్రం ఉంచుకోవచ్చా?

నిలబడి ఉన్న లక్ష్మి దేవి చిత్రాన్ని గృహంలో ఉంచరాదు.కూర్చుని ఉన్న ఫోటో ని మాత్రమే ఇంట్లో ఉంచాలి. లక్ష్మి దేవి బొమ్మను కాని ఫోటో ని గాని దర్వాజాలకు దగ్గరగా ఉంచరాదు. గృహం వెలుపల ఉంచరాదు. లక్ష్మి మాత ఫోటో ను పూజ మందిరం లో ఉంచుట మంచిది.
వ్యాపారస్తులు చాలామంది వారి వారి వ్యాపారాలకు లక్ష్మి దేవి పేరు ను పెడతారు. ఈ సందర్భంలో చాలామంది తమ వ్యాపారాల బోర్డ్ ల పై లక్ష్మి మాత బొమ్మను ఉంచుతారు. ఇది మంచిది కాదు. ఈ విధంగా చేస్తే ఆ వ్యాపారాలు తీవ్ర నష్టాలకు లోనై వ్యాపారం అమ్మివేయడం జరుగుతుంది..తీవ్ర నరఘోష తో బాధపడేవారు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఫోటోను గృహం లో ఉంచి ప్రతి రోజు అర్చించాలి. శుక్రవారం రోజు విశేష పూజా చేస్తే  మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లో ప్రశాంతతను కోరెవారు శ్రీరామపట్టాభిషేకం ఫోటో ను గృహం లో ఉంచాలి. ఇంటి ఎలివేషన్ పై కూడా ఈ ఫోటో ను ఉంచాలి.అనేక భయాలతో బాధపడేవారు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిత్రాన్ని ఉంచుకోవాలి. శని, మంగళ వారాలలో విశేష పూజ చేయాలి. నెలకు 1 మంగళవారం అయిన హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం చేయాలి.
సుఖప్రదమైన వివాహ జీవితానికి ఉమామహేశ్వరుల ఫోటోను గృహంలో ఉంచాలి. ఉమా మహేశ్వరుల ఫోటో ను గృహం లో ఉంచి సోమ, శుక్ర వారాలలో విశేషపూజ చేయాలి.

మంచి ఆరోగ్యం కోసం లక్ష్మీనారాయణుల ఫోటో ను ఉంచాలి. అదే విధంగా అన్నిటా జయం, సర్వత్ర అభివృద్ది కొరకు శ్రీ లలిత దేవి ఫోటో ను ఉంచి పూజించాలి. ప్రతిరోజూ శ్రీ లలిత దివ్య సహస్రనామ స్తోత్రం గృహం లో పారాయణ చేస్తే సకల మంగళ ప్రదంగా ఉండి, సుఖశాంతుల లభిస్తాయి.

దేవును విగ్రహాలను గృహంలో ఉంచితే నిత్య పూజ తప్పనిసరి. అడుగు లోపు ఉండే విగ్రహాలు పెట్టుకోవచ్చు. చిన్న చిన్న దేవుని విగ్రహాలు ఇంట్లో ఉండవచ్చు. అయితే పెద్ద విగ్రహాలను ఇంట్లో ఉంచరాదు. శని సింగన పూర్ నుండి తెచ్చిన శని యంత్రాలు ఇంట్లో ఉంచరాదు. నాడా, నల్లని విగ్రహం . ఇంట్లో ఉంచరాదు.

ఈ విధంగా ఆలోచించి విజ్ఞుని సలహా మేరకు గృహంలో దేవుని ఫోటోలు, విగ్రహాలు పెట్టుకొంటే మంచి అభివృద్ది ఉంటుంది.

venusuryadevara@gmail.com

సూర్యదేవర వేణుగోపాల్ M. A జ్యోతిష్యం.
సుందరయ్య నగర్    మధిర     ఖమ్మం జిల్లా తెలంగాణా.
507203



Image may contain: 1 person