Thursday 19 July 2018

Suryadevara Venugopal: ది.27-07-2108. సంపూర్ణ చంద్ర గ్రహణం

Suryadevara Venugopal: ది.27-07-2108. సంపూర్ణ చంద్ర గ్రహణం: ఆషాఢ శుద్ధ పూర్ణిమ ది. 27-07-2018  శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం 4 వ పాదం మకరరాశి లో కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉంటుంది......ఇది భారత ద...

ది.27-07-2108. సంపూర్ణ చంద్ర గ్రహణం







ఆషాఢ శుద్ధ పూర్ణిమ ది. 27-07-2018  శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం 4 వ పాదం మకరరాశి లో కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉంటుంది......ఇది భారత దేశం అంతటా గోచరిస్తుంది. అన్ని నియమాలు యధావిధిగా పాటించాలి.

గ్రహణ స్పర్శ కాలం. రాత్రి.గం|| 11: 55 ని|లకు

గ్రహణ మధ్య కాలం . రాత్రి. గం|| 01:54 ని|లకు

గ్రహణ  మోక్ష కాలం.  తె||ఝా| గం|| 03:50ని|లకు

గ్రహణ ఆద్యంత పుణ్యకాలం. గం||03:50 ని|లు.


ఈ గ్రహణం రాత్రి సమయం లో సంభవించుట వలన శుక్రవారం పగలు ఎటువంటి నియమాలు ఉండవు. అన్ని కార్య క్రమములు యధావిధిగా చేసుకోవచ్చును.

ఆలయములు ఉదయ పూజాదికాలు అనంతరం మూసివేయవచ్చు.

గ్రహణానంతరం
ది. 28-07-2018 శనివారం రోజు... ఉదయ సమయంలో స్నానం చేసి పూజాదికాలు, శాంతి పూజలు చేసుకోవచ్చు.

గర్భిణీ స్త్రీలు గ్రహణం వీక్షించ రాదు.

మకర రాశి వారు, ముఖ్యంగా ఊత్తరాషాఢ, శ్రవణ నక్షత్ర జాతకులు ఈ గ్రహణం చూడ రాదు. యధావిధిగా శాంతులు చేయించుకోవాలి.

సూర్యదేవర వేణుగోపాల్. M. A. జ్యోతిష్యం

సుందరయ్య నగర్. మధిర   ఖమ్మం జిల్లా
తెలంగాణ

Wednesday 9 May 2018

Suryadevara Venugopal: పూజా గది - వాస్తు నియమాలు

Suryadevara Venugopal: పూజా గది - వాస్తు నియమాలు: వాస్తు ప్రకారం పూజ ను ఈశాన్యం లో చేయడం ఉత్తమం. తూర్పు ఈశాన్యం లో గాని ఉత్తర ఈశాన్యం లోగాని పూజ చేయడం శ్రేష్టం. అయితే కొన్ని సందర్భాలలో ...

పూజా గది - వాస్తు నియమాలు

వాస్తు ప్రకారం పూజ ను ఈశాన్యం లో చేయడం ఉత్తమం. తూర్పు ఈశాన్యం లో గాని ఉత్తర ఈశాన్యం లోగాని పూజ చేయడం శ్రేష్టం.

అయితే కొన్ని సందర్భాలలో ఈశాన్యం నందు పూజ మేలు చేయక పోగా నష్టాలను కలిగించే వీలుంది. ఎలాగంటే చాలామంది ఈశాన్యం లో పూజా చేయాలని ఈశాన్యం ను పూర్తిగా మూసివేసి గదులను నిర్మిస్తున్నారు. దీనివలన ఈశాన్యం లో బరువు పెరుగుతుంది. నేడు చాలా గృహాలలో తూర్పు ఉత్తర దిక్కులందు పెద్దగా హాల్స్ నిర్మించి ఈశాన్యం లో పూజా గదిని నిర్మిస్తున్నారు. దీనివలన ఈశాన్యం మూసిన దోషం కలుగుతుంది. ఇటువంటి అమరిక వలన సింహద్వారం లేదా సాధారణమైన ద్వారం అయినా ఈశాన్యం లో అమర్చడానికి వీలు ఏర్పడదు. ఇటువంటి సందర్భాలలో పూర్తి ఈశాన్యం లో కాకుండా తూర్పు మధ్యకు లేదా ఉత్తరం మధ్యకు వచ్చే విధంగా పూజను ఏర్పాటు చేయాలి

ఈశాన్యం లో బరువు కానంత వరకు పూజ ను అక్కడ చేయడం మంచిదే. అయితే ఈశాన్యం లో బరువు అయితే తూర్పు లేదా ఉత్తరం దిక్కులలో ఏర్పాటు చేయాలి.

పూజ ను ఎల్లప్పుడు తూర్పు ముఖంగా తిరిగి చేస్తే మంచిది. ఉత్తర ముఖంగా కూడా చేయవచ్చు.

పడమర ముఖంగా చేయడం మధ్యమం  దక్షిణ ముఖం గా చేయడం అధమం.

వంట గది కి  ఈశాన్యం వైపు చేయవచ్చు.

దేవుని ఫోటోలు ఏ దిక్కునైనా చూస్తూ ఉండవచ్చు

పూజించేవారు తూర్పు ముఖంగా గాని ఉత్తర ముఖంగా గాని ఉండాలి.

విశేష పూజలు వ్రతాలు హాల్స్ నందు తూర్పు ముఖంగా చేయాలి.

సంధ్యావందన క్రియను ఆచరించేవారు  ఉదయం తూర్పు ముఖంగా  సాయంత్రం పడమర ముఖంగా కూర్చుని ఆచరించాలి.


సూర్యదేవర వేణుగోపాల్  M.A. జ్యోతిష్యం
1-879  సుందరయ్య నగర్
మధిర  ఖమ్మం జిల్లా
తెలంగాణ   507203

Saturday 3 March 2018

Suryadevara Venugopal: సర్వాపన్నివారణకు సుందర కాండ.

Suryadevara Venugopal: సర్వాపన్నివారణకు సుందర కాండ.: నవగ్రహ దోష నివారణకు వాల్మీకి రామాయణం లోని సుందరకాండ కల్పతరువు గా చెప్పబడింది. మానవ జీవితం లోని వివిధ సమస్యల నివారణకు శ్రీ సుందరకాండ పారాయణం...

సర్వాపన్నివారణకు సుందర కాండ.

నవగ్రహ దోష నివారణకు వాల్మీకి రామాయణం లోని సుందరకాండ కల్పతరువు గా చెప్పబడింది. మానవ జీవితం లోని వివిధ సమస్యల నివారణకు శ్రీ సుందరకాండ పారాయణం గొప్ప నివారణ గా మన పూర్వీకులు సూచించారు. ఇప్పటికీ మన హిందూ సంస్కృతి లో సుందరకాండకు విశేష మైన ప్రాముఖ్యత ఉంది. అనేక ఆపద నివారణకు సుందరకాండ పారాయణం దివ్యఔషధం గా అనేక పూర్వ గ్రంధాలు, మహర్షులు చెప్పడం జరిగింది. ఇప్పటికీ అనేకులు ఈ దివ్య మైన సుందర కాండ ను ఒక నిర్దుష్టమైన పద్దతిలో పారాయణం చేసి అనేక సమస్యల నుండి విముక్తిని పొందుతున్నారు.

సుందర కాండను ఏ విధంగా పారాయణం చేయాలి, ఏ సమస్యకు ఏ సర్గను పారాయణం చేయాలి  అనే విషయాలను తెలుసుకొని పారాయణం చేస్తే అనేక మంచి ప్రయోజనాలు కలుగుతాయి.  ఏ సమస్యకు ఏ సర్గ పారాయణం చేయాలో  తెలుసుకుందాం.....


భూత ప్రేత భయ నివారణకు అనేక మానసిక ఆరోగ్య సమస్యలకు సుందరకాండ లోని 3 వ సర్గ "లంక విజయం" ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.


సంపద వృద్దికి అనేక ఆర్ధిక సమస్యల నివారణకు 15 వ సర్గ  "లంకలో సీతాదేవి దర్శనం" ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.

పీడకలలు అనేక భయ నివారణకు  27 వ సర్గ " త్రిజట స్వప్నం" ను 21 రోజుల పాటు పారాయణం చేయాలి.

కోప నివారణకు సాత్విక గుణ వృద్దికి 21 వ సర్గ  " సీతా రావణ సంవాదం" ను 11 రోజుల పాటు పారాయణం చేయాలి.

ఎడబాసిన బంధు సమాగమానికి  33 వ సర్గ నుండి 44 వ సర్గ వరకు  "సీతా హనుమత్ సంవాదం ను " కనీసం 2 మండలాల పాటు పారాయణం చేయాలి.

సర్వాపన్నివారణకు  36 వ సర్గ  " అంగళీయక ఘట్టం " ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.

శత్రువు ల పై  జయానికి 42 వ సర్గ నుండి 47 వ సర్గ " హనుమంతులవారు వివిధ రాక్షస సంహారం" ఘట్టాలను 21 రోజుల పాటు పారాయణం చేయాలి.

గృహ వృద్దికి అనేక స్థిరాస్థి వృద్దికి 54 వ సర్గ "లంక దహన ఘట్టం" ను 3 మండలాలు పాటు పారాయణం చేయాలి.

సకల అభీష్ట సిద్దికి 41 వ సర్గ  "అశోక వన ధ్వంసం" ఘట్టం ను 40 రోజుల పాటు పారాయణం చేయాలి.

పుత్ర సంతానం కోసం సప్త సర్గ పారాయణం 68 రోజులందు పారాయణం చేయాలి.

వివాహ సిద్దికి 9 రోజులలో సుందరకాండ మొత్తము ను పారాయణం చేయాలి.

విద్యా సమస్యలకు మొత్తం  సుందర కాండ ను 7 రోజులందు పారాయణం చేయాలి.

శీఘ్ర ఉద్యోగ ప్రాప్తికి  మొత్తం సుందర కాండ ను 9 లేదా 11 రోజులలో పారాయణం చేయాలి.



అనేక సమస్యలకు, ఆపదలకు ,వేదనలకు మొత్తం సుందర కాండ ను ఒకే రోజు లో పారాయణం చేయాలి.

నైవేద్యం గా పాయసం, పులిహోర, అప్పాలు, చక్కెర పొంగలి  లేదా యధా శక్తి గా నివేదించాలి.

ఆవుపాలు, అరటిపండ్లు తప్పనిసరి.

పారాయణానికి  ముందు  గాని  తరువాత గాని,శ్రీ రామరక్ష స్తోత్రం తప్పనిసరిగా పాటించాలి. ప్రతిరోజూ పారాయణం అనంతరం హనుమత్ పూజ ను చేయాలి.

పూర్తి పారాయణం ముగిసిన పిదప యధాశక్తి అన్నదానం చేసిన మంచి ప్రయోజనం కలుగుతుంది.


venusuryadevara@gmail. com

సూర్యదేవర వేణుగోపాల్ M. A (జ్యోతిష్యం)

H. NO.  1-879

సుందరయ్య నగర్   మధిర

ఖమ్మం జిల్లా  తెలంగాణా
507203

Sunday 21 January 2018

Suryadevara Venugopal: 31-01-2018 సంపూర్ణ చంద్రగ్రహణం

Suryadevara Venugopal: 31-01-2018 సంపూర్ణ చంద్రగ్రహణం: మాఘ శుద్ధ పౌర్ణిమ బుధవారం, ది. 31-01-2018 పుష్యమి నక్షత్ర కర్కాటక రాశి యందు రాహు గ్రస్త  సంపూర్ణ చంద్ర గ్రహణం .......... గ్రహణ స్పర్...

31-01-2018 సంపూర్ణ చంద్రగ్రహణం


మాఘ శుద్ధ పౌర్ణిమ బుధవారం, ది. 31-01-2018 పుష్యమి నక్షత్ర కర్కాటక రాశి యందు
రాహు గ్రస్త  సంపూర్ణ చంద్ర గ్రహణం ..........


గ్రహణ స్పర్శ కాలం  సాయంత్రం   గం|| 05:17 ని|లకు....

గ్రహణ మధ్యకాలం    రాత్రి               గం|| 06:58 ని|లకు....

గ్రహణ మోక్ష కాలం    రాత్రి               గం|| 08:41 ని|లకు

గ్రహణ ఆద్యంత పుణ్యకాలం....         గం|| 03:24 ని||లు


ఈ గ్రహణం భారత దేశం అంతా గోచరించును. ఇది కర్కాటక రాశియందు పట్టుట వలన పుష్యమి, ఆశ్లేష రాశి వారు చూడకూడదు.

అన్ని నియమాలు ఆచరించాలి.

గ్రహణానంతరం స్నానం చేసి భోజనాదికాలు చేయాలి.

మంత్రానుష్టానం కలవారు ఈ పుణ్యకాలం నందు మంత్రానుష్టానం చేయుట మంచిది.

శ్రీకాళహస్తి లో కాలసర్పదోషం కలవారు రాహు-కేతు పూజ జరిపించిన విశేష ఫలం లభిస్తుంది...


venusuryadevara@gmail.com

సూర్యదేవర వేణుగోపాల్   M.A. (జ్యోతిష్యం)
సుందరయ్య నగర్ మధిర  ఖమ్మం జిల్లా తెలంగాణా.
507203

Sunday 14 January 2018

Suryadevara Venugopal: కాలసర్పదోషం- పరిహారాలు.

Suryadevara Venugopal: కాలసర్పదోషం- పరిహారాలు.: . . అగ్రే రాహు రధౌ కేతు: మధ్యే షడ్గ్రహౌ తధా యది కాలసర్పాఖ్య యోగాయా నృప రాష్ట్ర వినాశనం అగ్రే కేతు రధౌ  రాహు: గర్భస్తే సప్తకే తధా ...

కాలసర్పదోషం- పరిహారాలు.

.

.

అగ్రే రాహు రధౌ కేతు: మధ్యే షడ్గ్రహౌ తధా

యది కాలసర్పాఖ్య యోగాయా నృప రాష్ట్ర వినాశనం

అగ్రే కేతు రధౌ  రాహు: గర్భస్తే సప్తకే తధా

యది అపసవ్య కాల సర్పాఖ్య దోషయం నృపానం సమరం భవేత్.


జాతక చక్రం లో అన్ని గ్రహాలు అంటే మిగిలిన 7 గ్రహాలు రాహు- కేతు మధ్య ఉంటే అది కాలసర్పదోషం అవుతుంది. ప్రధానంగా ఇది 2 రకాలుగా ఉంటుంది. 7 గ్రహాలు రాహు-కేతు మధ్య ఉంటే అది  సవ్య కాలసర్పదోషం అవుతుంది. ఇలా కాకుండా గ్రహాలన్నీ కేతు రాహు మధ్య ఉంటే దానిని అపసవ్య కాలసర్పదోషం అంటారు. సవ్య కాలసర్పదోషం అనేక కష్టాలను నష్టాలను ఇస్తుంది. అపసవ్య దోషం సవ్యం అంత కాకపోయినా ఇది కూడా నష్టాలను కలిగిస్తుంది. 

కాలసర్పదోషం లగ్నం నుండి 7 వ స్థానం మధ్యన ఉంటే జీవిత ప్రధమ భాగం దెబ్బతిని అనేకవిధాలుగా నష్టాలను ప్రసాదిస్తుంది. ఈ దోషం 7 వ స్థానం తో మొదలయ్యి 12 వ స్థానం వరకు పడితే జీవితం లో 2 వ భాగం దెబ్బతింటుంది.

కాలసర్పదోషం ఉన్న జాతకుడు స్థిరపడుటలో తీవ్ర జాప్యం ఉంటుంది. సరియైన ఉద్యోగం ఉండదు, వృత్తి ఉండదు, ఇంకా వివాహం లో తీవ్ర జాప్యం ఉంటుంది. విద్యా నష్టం జరగ వచ్చు. మిగిలిన మంచి యోగాలు లేకపోతే వ్యసనాలు అలవాటు అయ్యే ప్రమాదం ఉంది. సంతానం పొందటంలో సమస్యలు జాప్యం ఉంటుంది. మిగిలిన గ్రహస్థితి సరిగా లేకపోతే వివాహం కావడం చాలా కష్టం. అయితే సుమారు 34, లేదా 36 సం||రాల నుండి దీని ప్రభావం తగ్గే వీలుంది.

సర్పదోషం కాలసర్పదోషం కంటే తక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది. జాతకం లో రవి  రాహువు నుండి 8 వ స్థానం లో ఉన్నా, చంద్రుని నుండి 8 వ స్థానం లో రాహువు గాని కేతువు కానీ ఉన్న, లగ్న త్రికోణాలలో. రాహువు కేతువు ఉన్న  గాని  లేదా లగ్నం నుండి  6, 7, 8, స్థానాలలో రాహు ఉంటే సర్పదోషం అవుతుంది. ఇది కూడా అనేక చేదుఫలితాలను ఇస్తుంది. మనిషికి  జీవితంలో సరిగా. స్థిరత్వాన్ని అందించదు.

అయితే ఈ కాలసర్ప దోషం మనుష్యలకు వర్తించదు, దేశానికి వర్తిస్తుందని చాలామంది అభిప్రాయం. అయితే ప్రస్తుత తరుణంలో జాతకంలో ఈ గ్రహ సమస్యలు ఉన్నవారు అనేక సమస్యలలో ఉండటం కనిపిస్తుంది. కనుక తప్పని సరిగా పరిహారం జరిపించాలి.




పరిహారాలు:

శ్రీకాళహస్తి లో రాహు-కేతు పూజ జరిపించాలి.

నాసిక్ త్రయంబకేశ్వర్ లో కాలసర్పదోష పూజ జరిపించాలి.

కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్య ఆలయం లో కాలసర్పదోష పూజ జరిపించాలి.

సుబ్రహ్మణ్య స్వామి మరియు మానస దేవి లకు ప్రతి రోజు యధా శక్తి పూజ చేయాలి.

దోషం బలంగా ఉంటే నాగ ప్రతిష్ట చేయాలి.

41 రోజుల పాటు సర్ప సూక్తంతో శివాలయం లో అభిషేకం చేయించాలి.

కర్ణాటక లోని కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో సర్పసంస్కార పూజ జరిపించాలి.

7 సం|రాల పాటు సం|రానికి 6  మంగళ వారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపించాలి.

గోమేధికం, వైఢూర్యం లను కలిపి వెండి లో ఉంగరం చేయించి మధ్య వ్రేలికి ధరించాలి.


ఈ విధంగా పై పరిహారాలను ఎవరికి వీలైనవి వారు చేయించాలి,
గృహం లో నిత్య దీపారాధన, సంధ్యావందనం అనేక దోషాలను తొలగిస్తాయి. కనుక నిత్యం గృహం లో ఇష్ట దేవతను పూజించుట మంచిది.



venusuryadevara@gmail.com

సూర్యదేవర వేణుగోపాల్ M.A ( జ్యోతిష్యం)

H. NO.1-879

సుందరయ్య నగర్  మధిర    ఖమ్మం జిల్లా

తెలంగాణా  507203

Tuesday 9 January 2018

Suryadevara Venugopal: 15 తేదీనే మకర సంక్రాంతి

Suryadevara Venugopal: 15 తేదీనే మకర సంక్రాంతి: ప్రాచీన సూర్య సిద్దాంతం ప్రకారం సూర్యుడు మకర రాశి యందు  ది. 14- 01- 2018  రాత్రి గం| 07:01 ని|లకు ప్రవేశించుట జరుగుతుంది. కనుక 15 జనవరి ...

15 తేదీనే మకర సంక్రాంతి

ప్రాచీన సూర్య సిద్దాంతం ప్రకారం సూర్యుడు మకర రాశి యందు
 ది. 14- 01- 2018  రాత్రి గం| 07:01 ని|లకు ప్రవేశించుట జరుగుతుంది.

కనుక 15 జనవరి రోజుననే మకర సంక్రాంతి పర్వదినమును జరుపుకోవాలి.
జనవరి 14 వ తేదీ భోగి కాగలదు.

సూర్యాస్తమయానికి ముందుగానే రవి మకర రాశి ప్రవేశం చేస్తే ఆ రోజునే
మకర సంక్రాంతి అవుతుంది.

అదే సూర్యాస్తమయానికి తరువాత రవి మకర రాశి ప్రవేశం చేస్తే మరుసటి  రోజున
మకర సంక్రాంతి అవుతుందని ప్రాచీన  సూర్యసిద్దాంతం తెలుపుతుంది.

2018 న సూర్యుడు 14 జనవరి రాత్రి గం|07:01 ని||లకు మకర రాశి నందు
ప్రవేశించుట జరుగుతుంది. ఇది సూర్యాస్తమయం అనంతరం జరిగే
సంక్రమణం. కనుక 15 వ తేదీ నే మకర సంక్రాంతి జరుపుకోవాలి.

కనుక 15 వ తేదీనే మకర సంక్రాంతి పర్వదినమును చేయుట ఉత్తమము.