Friday 30 June 2017

Suryadevara Venugopal: ఏ దేవతని ఏయే పుష్పాలతో పూజించాలి......

Suryadevara Venugopal: ఏ దేవతని ఏయే పుష్పాలతో పూజించాలి......: సూర్యుని, గణపతిని తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే వారి అనుగ్రహం సత్వరమే లభిస్తుంది. శ్రీ హరిని తులసి దళాలతో పూజిస్తే ఇష్ట కామ్య సిద్ది ల...

Suryadevara Venugopal: ఏ దేవతని ఏయే పుష్పాలతో పూజించాలి......

Suryadevara Venugopal: ఏ దేవతని ఏయే పుష్పాలతో పూజించాలి......: సూర్యుని, గణపతిని తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే వారి అనుగ్రహం సత్వరమే లభిస్తుంది. శ్రీ హరిని తులసి దళాలతో పూజిస్తే ఇష్ట కామ్య సిద్ది ల...

ఏ దేవతని ఏయే పుష్పాలతో పూజించాలి......

సూర్యుని, గణపతిని తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే వారి అనుగ్రహం సత్వరమే లభిస్తుంది.
శ్రీ హరిని తులసి దళాలతో పూజిస్తే ఇష్ట కామ్య సిద్ది లభిస్తుంది. ధన ప్రాప్తి కోసం మహాలక్ష్మి ని తామర పూలతో పూజించాలి.

గాయత్రి దేవిని మందార, కొండమల్లే, దర్భపూలగుత్తులు, జిల్లేడు, కదంబ, పున్నాగ, చంపక, గరిక పుష్పాలతో పూజిస్తే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. 

సకల మనోభీష్ట సాధన కోసం  శ్రీచక్రమును తామర పూలు, తులసి దళాలు, కలువలు,  జాజి, మల్లె, గన్నేరు, ఎర్ర కలువలు , పుష్పాలతో పూజించాలి.

శివ పరమాత్మ అనుగ్రహం కోసం లేత బిల్వ దళాలతో అర్చించాలి. 

నిత్య పూజకు, నిత్య మల్లె, గరుడవర్ధనం, ఎర్ర గన్నేరు, మంకెనపూలు, పద్మాలు, పారిజాతం, మాలతి, కనకాంబరాలు, నీలాంబరాలు, మందారం, నందివర్ధనం, చేమంతి, జాజి, కలువ పూలు మంచివి......వీటిని ఏ దేవతకైనా సమర్పించవచ్చును........


చేయకూడనివి....

శ్రీమహావిష్ణువును అక్షితలతో పూజించరాదు. దుర్గా దేవికి గరిక ను సమర్పించరాదు. మారేడు తో సూర్య భగవానుని పూజించరాదు.   సరస్వతి ని తమాల పూలతో పూజించరాదు. జిల్లేడు మరియు గన్నేరు పుష్పాలను లక్ష్మి దేవికి సమర్పించకూడదు. మొగలి పూలతో శివభగవానుని 
పూజించరాదు..........


సూర్యదేవర వేణుగోపాల్  M. A   జ్యోతిష్యం.

H. NO-  1-879

సుందరయ్య నగర్      మధిర      ఖమ్మం జిల్లా 

venusuryadevara@gmail.com

Tuesday 20 June 2017

Suryadevara Venugopal: ధర్మసందేహాలు- సమాధానాలు 3

Suryadevara Venugopal: ధర్మసందేహాలు- సమాధానాలు 3: 21. గర్భవతులు  ఎప్పటివరకు వైదిక కార్యక్రమాలు చేయకూడదు? 5 వ మాసం నిండినప్పటి నుండి వైదిక కార్యక్రమాలు చేయకూడదు. గృహ శంఖుస్థాపన, వంటి క్రతు...

ధర్మసందేహాలు- సమాధానాలు 3

21. గర్భవతులు  ఎప్పటివరకు వైదిక కార్యక్రమాలు చేయకూడదు?

5 వ మాసం నిండినప్పటి నుండి వైదిక కార్యక్రమాలు చేయకూడదు. గృహ శంఖుస్థాపన, వంటి క్రతువులు చేయరాదు.  అయితే దైవానికి సంబంధించిన స్తోత్రాలు చదవవచ్చు.


22. గతించిన పెద్దలకు శ్రాద్ద కర్మలు చేయాలా?

తప్పనిసరిగా చేయాలి. పిండ ప్రదానం చేస్తే మంచిది. అలా చేయలేని వారు పితృ తిథి రోజు బ్రాహ్మణునకు స్వయం పాకం ఇవ్వాలి. అసలు చేయకుండా ఉండకూడదు.


23. పితృ దేవత శ్రాద్ద కర్మలు ప్రతి సం|రం వారు మరణించిన తేదీ రోజు చేయవచ్చా?

అలా చేయకూడదు. వారు మరణించిన తిథి రోజు చేయాలి. చాంద్రమానంను పాటించాలి.


24. మా మనవడు అక్షరాభ్యాసం మొన్న చేశాము. అయ్యగారు మొదటగా ఓం నమ శివాయా అనే పదముతో అక్షరాభ్యాసం  చేశారు. సరస్వతి దేవి పేరు తర్వాత రాశారు. ఈ విధంగా చేయవచ్చా?


సకల విద్యలకు మూలమై వెలుగొందువారు శివ పరమాత్మ, ఆయన లేనిది ఈ జగమే లేదు. మీ అయ్యగారు సరిగానే అక్షరాభ్యాసం చేశారు. ఆందోళన పడవద్దు.


25. పెళ్లి సమయంలో ఉపనయనం  మంచిదేనా?

ఉపనయనం చిన్నప్పుడే చేయాలి.  ఇప్పుడు వివాహ సమయంలో నామ మాత్రంగా చేస్తున్నారు. ఇది మంచిది కాదు.  చిన్నప్పుడే చేయడం మంచిది.


26. గృహం లో ఇంకుడు గుంతలు ఎటువైపు ఉంచాలి?


ఇంకుడు గుంతలు ఈశాన్యంలో గాని ఉత్తరం లో గాని తూర్పు న గాని ఉంచుకోవచ్చు...


27. మా ఇంటికి సింహా ద్వారం ఈశాన్యం లో లేదు. తూర్పు మధ్యలో ఉంది. ఈ విధంగా ఉంచవచ్చా?


ఉంచుకోవచ్చు. అయితే గృహ మధ్యభాగంలో సింహా ద్వారం ఉంటే దర్వాజాకు రెండు వైపులా కిటికీలు ఉంచాలి....


28. మహా భారతంలో ద్రౌపది కర్ణుని 6 వ భర్తగా కోరుకుందని చాలామంది అభిప్రాయం. ఇంకా సినిమాలలో కూడా చూపించారు.... నిజంగా ద్రౌపది కర్ణుని 6 భర్తగా పొందాలని కోరుకుందా?


నిజంగా ఈ అభిప్రాయం చాలా తప్పు.  వ్యాస భారతంలో అసలు ఈ ప్రస్తావన లేదు. అసలు ఈ విషయాన్ని ఎవరు ప్రచారం చేశారో తెలియదు.... వ్యాసభారతం ప్రకారం ద్రౌపది కర్ణుని 6 వ భర్తగా పొందాలని  ఆలోచించలేదు.. 


29. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణంను కౌరవులలో వ్యతిరేకించింది ఎవరు?

వికర్ణుడు. దుర్యోధనుని సోదరుడు. కౌరవుల 100 మంది సోదరులలో వికర్ణుడు ఒకడు. ద్రౌపది ని అవమానించడానికి కౌరవులకు అధికారం లేదని వాదించాడు.....


30. వేదాలు నాలుగు అంటారు మరి పంచమవేదం అంటే ఏమిటి.?

వేదాలు నాలుగే... మహాభారతాన్ని పంచమవేదం అని అంటారు.  మానవులు భారతం నుండి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అందుకే పంచమవేదం  అయింది.








సూర్యదేవర వేణుగోపాల్  M. A  (జ్యోతిష్యం)

H. NO    1-879   సుందరయ్య నగర్ 

మధిర   ఖమ్మం జిల్లా  తెలంగాణా

venusuryadevara@gmail.com

Saturday 3 June 2017

ధర్మ సందేహాలు- సమాధానాలు 2








11. నేను వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. ప్రస్తుతం అనేక ఆర్ధిక ఆరోగ్య సమస్యలతో కొన్ని ఏళ్ళు గా బాధపడుతున్నాను. ఎవరో చెపితే ప్రతిరోజూ శ్రీలలిత సహస్రనామ స్తోత్రం చదువుతున్నాను. ఫలితం లేదు. యజుర్వేద సంధ్యావందనం  కొంతకాలం చేసి మానివేశాను ఇప్పుడు బాబాగారికి పూజా చేస్తున్నాను. పరిష్కారం చూపగలరు.

సంధ్యావందనం మానివేయడం ఘోరమైన తప్పు. మీరు సంధ్యావందనం జీవితాంతం తప్పనిసరిగా చేయాలి. సంధ్యావందనం చాలా పవిత్రమైన క్రియ. చతుర్విధ పురుషార్ధాలను  ప్రసాదిస్తుంది. సంధ్యావందనం మానివేయడం పాపం. సంధ్యావందనం చేయకుండా మీరు యే పూజ చేసినప్పటికీ ఫలితం శూన్యం. సంధ్యావందనం చేసిన తరువాత మీరు యే పూజ చేసినప్పటికీ మంచిఫలితాలు వస్తాయి. సంధ్యావందనం చేస్తే మీకు సమాజానికి తప్పనిసరిగా మంచి జరుగుతుంది. మీరు సంధ్యావందనం చేసిన తరువాత  మీ గురువుగారు చెప్పిన పూజలను చేయండి తప్పని సరిగా సమస్యల నుండి బయట పడతారు


12. కురుక్షేత్ర యుద్దానికి కారణమైన శకుని ఎవరి కుమారుడు? శకుని వివరాలు తెలపండి.

శకుని గాంధారి సోదరుడు.  గాంధార రాజు యైన సుబలుని  కుమారుడు. శకుని పుత్రుడు ఉలూకుడు. ధుర్యోధనునికి  మేనమామ.

13. తల ఎటువైపు పెట్టి నిద్రించాలి?

తల దక్షిణం మరియు తూర్పు వైపు ఉంచి నిద్రించాలి.  పరాయి గృహంలో పడమర వైపు తల ఉంచి నిద్రించాలి. ఉత్తరం వైపు అసలు తల పెట్టి నిద్రించ కూడదు

14. జీవులకు ఉన్న ప్రాణాలను పంచ ప్రాణాలంటారు కదా వాటి పేర్లు చెప్పండి.

ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన  ప్రాణాలే జీవులకు గల పంచ ప్రాణాలు.

15. గృహం లో తులసి మొక్కను ఏ వైపు ఉంచాలి.?

గృహంలో తులసి మొక్కను ఎటువైపు అయిన ఉంచవచ్చు. అయితే దర్వాజకు ఎదురుగా ఉంచాలి. ఇంటి గర్భంలో తులసి వీక్షణ ఉండేలాగా ఉంచితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

16. గృహం కట్టేటప్పుడు అన్నీ సరి సంఖ్య లో ఉండాలని చెప్తారు కదా. పిల్లర్స్ కూడా సరి సంఖ్య లో నే ఉండాలా?

దర్వాజాలు, కిటికీలు మాత్రమే సరిసంఖ్య చూడాలి. పిల్లర్స్ కు ఆ నియమం లేదు. అవసరాన్ని బట్టి పిల్లర్స్ వేసుకోవాలి. పిల్లర్స్ సరిసంఖ్యలో ఉండాల్సిన అవసరం లేదు.

17. నాగ దోషానికి కొంతమంది మానసా దేవి పూజ మంచిదని మరికొంత మంది సుబ్రహ్మణ్య పూజ మంచిదని చెప్తారు. ఏది మంచిది.

2 పూజలు మంచివే. అయితే కాలసర్పదోషం ఉన్నప్పుడూ ఈ 2 పూజలు చేసినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. ఏదైనా పూర్ణ విశ్వాసం తో చేస్తే మంచి ఫలాలు వస్తాయి.

18.  జాతక దోషాలకు జపాలు చేయించడం మంచిదా లేక పూజ మంచిదా.

అన్ని దోషాలకు జపాలు అవసరం లేదు. తీవ్ర దోషాలకు అవసరం. అయితే ఎవరికి వారు వారి 
జాతకానికి అనుకూలమైన దైవానికి పూజ చేసుకోవడం మంచిది.

19 అన్ని పేర్లు న్యూమరాలజీ ప్రకారం సవరించుకోవాలా? 

నేమ్ కరక్షన్ అన్ని పేర్లకు అవసరం లేదు. అనవసరంగా Name కరక్షన్ చేస్తే మంచి జరగక పోగా నష్టం జరిగే అవకాశం ఉంది.

20. నక్షత్రాల ప్రకారం పేర్లు పెట్టుకోవడం మంచిదేనా?

నక్షత్రాల ప్రకారం పేర్లు పెట్టుకోవడం మంచిది.


సూర్యదేవర వేణుగోపాల్ M.A  (జ్యోతిష్యం)

H.NO  1-879
సుందరయ్య నగర్   మధిర    ఖమ్మం జిల్లా 
venusuryadevara@gmail.com