Saturday, 4 April 2020

శని దోషం - పరిహారాలు||ధనుస్సు,మకర,కుంభ,మిథున తుల రాశి వారికి






శని దోషం- పరిహారాలు

సూర్యదేవర వేణుగోపాల్ M. A. (జ్యోతిష్యం)
ప్రస్తుతం ధనుస్సు, మకర, కుంభ  రాశుల వారికి ఎల్నాటి శని నడుస్తుంది. మిధున రాశి వారికి అష్టమ శని దోషం నడుస్తుంది. ఇంకా తులా వారికి అర్ధాష్టమ శని దోషం నడుస్తుంది. చేసే ప్రతి పనిలోనూ ఆటంకం, ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు, వివాదాలు, కొన్ని విషయాలలో అవమానాలు ఈ రాశుల వాళ్ళకి   ఉండే  అవకాశం ఉంటుంది. ఆరోగ్య ఆర్ధిక సమస్యలు వేధించవచ్చు. ఉద్యోగం లో సమస్యలు ఉండవచ్చు. నిరుద్యోగులకు నిరాశ మిగలవచ్చు. ఇవన్నీ సాధారణంగా శని గోచరం వల్ల కలిగే ఫలితాలు. జాతకం లో నడుస్తున్న దశ అంతర్దశ ల ప్రభావం వల్ల ఈ ఫలితాలల్లో మార్పు ఉండవచ్చు. 2023 వ సం|రం జనవరి వరకు మిధున తుల ధనుస్సు రాశుల వారికి , 2027 చివరి వరకు మకర, కుంభ రాశుల వారికి శని దోష ప్రభావం ఉంటుంది. జాతకం లో శని స్వక్షేత్రం లో గాని, ఉచ్చలో లో గాని ఇంకా మిత్ర స్థానాలలో గాని ఉంటే అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు...
పైన ఉదహరించిన రాశుల వారు శని దోష నివృత్తి కై ఈ క్రింది పరిహారాలు పాటించాలి....
*నెలకు 1 శనివారం శని భగవానునకు తైలాభిషేకం చేయాలి.
*ప్రతి మాస శివరాత్రికి శివాలయం లో రుద్రాభిషేకం జరిపించాలి.
*ప్రతి రోజు హనుమాన్ చాలీసా పఠించాలి....వీలుంటే రోజుకి 11 సార్లు చదవడం మంచిది.
*విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం కూడా శని దోషాన్ని హరిస్తుంది. డైలీ చేయండి.
*స్తోత్రాలు చదవలేని వాళ్ళు ప్రతి శనివారం శ్రీ ఆంజనేయ స్వామి వారికి 19 ప్రదక్షిణలు చేయవచ్చు.
*ప్రతి రోజు కాలభైరవ స్తోత్రం, కాళి స్తోత్రం చదవవచ్చు.
*దత్తాత్రేయుని నిత్య పూజ లేదా స్తోత్ర పఠనం శని దోషాన్ని హరిస్తుంది.
*శనివారం రోజు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయిస్తే చాలా మంచిది.
*ప్రతిరోజు శని స్తోత్రం, లేదా శని శ్లోకం తప్పనిసరిగా పఠించాలి.
ఈ పరిహారాలు పాటిస్తే శని భగవానుని ఆశీస్సులతో బాధలు తగ్గుతాయి.

సూర్యదేవర వేణుగోపాల్  M. A (జ్యోతిష్యం)
ఇంటి నెం  1-879సుందరయ్య నగర్
 మధిర  ఖమ్మం జిల్లా  తెలంగాణా  507 203
Venusuryadevara@gmail.com


Wednesday, 1 April 2020





శ్రీ రామ రక్షా స్తోత్రం

బుధ కౌశిక మునిచే విరచితమైన శ్రీ రామ రక్షా స్తోత్రం చాలా మహిమాన్వితమైనది. ఈ స్తోత్ర పారాయణం వల్ల సకల గ్రహ దోషాలు, భయం, ఆందోళన, అనారోగ్యం నశిస్తాయి. ప్రతిరోజూ ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ శ్రీ రామ చంద్ర మూర్తి కి క్షీరాన్నం నివేదన  శుక్రవారం చేస్తూ ఉంటే శ్రీ రామకృప తో పాటు, రుద్రమూర్తి అయిన శ్రీ మారుతి కృప కూడా లభిస్తుంది. భక్తుల పాలిటి కల్పవృక్షం ఈ స్తోత్రం. అన్ని కోరికలు తీర్చే చింతామణి ఇది.

||శ్రీ రామ చంద్ర పరబ్రహ్మణే నమః||

శ్రీ రామ రక్షా స్తోత్రం

ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః
శ్రీ సీతారామ చంద్రోదేవతా
అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః
శ్రీమాన్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః

ధ్యానమ్
ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్

స్తోత్రమ్
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్
జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్

సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్
స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుమ్

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్
శిరో మే రాఘవః పాతుఫాలం దశరథాత్మజః

కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్ర ప్రియః శృతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరత వందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః

సుగ్రీవేశః కటీపాతు సక్థినీ హనుమత్-ప్రభుః
ఊరూ రఘూత్తమః పాతు రక్షకుల వినాశకృత్

జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః
పాదౌవిభీషణ శ్రీదఃపాతు రామోఽఖిలం వపుః

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్

పాతాళ భూతల వ్యోమ చారిణశ్-చద్మ చారిణః
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరన్
నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః

వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయ మంగళమ్

ఆదిష్టవాన్ యథాస్వప్నే రామ రక్షా మిమాం హరః
తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్
అభిరామ స్త్రిలోకానాం రామః శ్రీమాన్సనః ప్రభుః

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణా జినాంబరౌ

ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ

శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్టా సర్వ ధనుష్మతాం
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ

ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ
రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథిసదైవ గచ్ఛతాం

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః

రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః

వేదాంత వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేథాధికం పుణ్యం సంప్రాప్నోతి నసంశయః

రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతావాససం
స్తువంతి నాభిర్-దివ్యైర్-నతే సంసారిణో నరాః

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం

రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందేలోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ

శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే

మాతారామో మత్-పితా రామచంద్రః
స్వామీ రామో మత్-సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ న జానే

దక్షిణేలక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
పురతోమారుతిర్-యస్య తం వందే రఘువందనమ్

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథం
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే

మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదాం
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణం

శ్రీరామ జయరామ జయజయరామ
||శ్రీ రామ చంద్ర పరబ్రహ్మణే నమః||

సూర్యదేవర వేణుగోపాల్  M. A (జ్యోతిష్యం)
ఇంటి నెం  1-879సుందరయ్య నగర్
 మధిర  ఖమ్మం జిల్లా  తెలంగాణా  507 203
Venusuryadevara@gmail.com

Monday, 30 March 2020

ధన్వంతరి స్తోత్రం- సకలరోగ నివారిణి



ధన్వంతరీ స్తోత్రం
దేవ వైద్యులైన ధన్వంతరి స్తోత్రం ఇది. ధన్వంతరిని  God  of Ayurveda అని అంటారు. ధన్వంతరి కృప కలిగితే  సకల జాడ్యాలు నశించి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. సకల పాప కర్మల్ని నశింపజేసి మంచి ఆరోగ్యాన్ని ధన్వంతరి కలిగిస్తారు.
శ్రీ నారాయణ స్వరూపమైన  ధన్వంతరిని ఆరోగ్యం కోసం  పూజించాలి. ప్రస్తుత పరిస్తితి లో కరోన వైరస్ విజృంభిస్తోంది. ఇటువంటి విష రోగాల నివారణకు నారాయణ స్వరూపమైన ధన్వంతరి కృప అందరికీ అవసరం. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి ఈ స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు పఠించండి. అపాయం నుండి తక్షణమే రక్షణ కలుగుతుంది. దేశ రక్షణకు స్వీయ రక్షణకు ఈ స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు పఠించడం అందరికీ అవసరం. ఉదయం, మధ్యాన్నం, సాయంత్రం పఠించండి.
స్తోత్ర చివర ఇవ్వబడిన ధన్వంతరి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించాలి. స్తోత్రం  రోజుకి 3 సార్లు చదువలేని వారు ఈ మంత్రాన్ని 11 సార్లు  ఉదయం,
11 సార్లు మధ్యాన్నం, 11 సార్లు సాయంత్రం జపం చేసుకోవచ్చు.
||ఓం నమో నారాయణాయ||


శ్రీ ధన్వంతరి స్తోత్రం

నమో నమో విశ్వవిభావనాయ
నమో నమో లోకసుఖప్రదాయ ।
నమో నమో విశ్వసృజేశ్వరాయ
నమో నమో నమో ముక్తివరప్రదాయ ॥ ౧॥
నమో నమస్తేఽఖిలలోకపాయ
నమో నమస్తేఽఖిలకామదాయ ।
నమో నమస్తేఽఖిలకారణాయ
నమో నమస్తేఽఖిలరక్షకాయ ॥ ౨॥
నమో నమస్తే సకలార్త్రిహర్త్రే
నమో నమస్తే విరుజః ప్రకర్త్రే ।
నమో నమస్తేఽఖిలవిశ్వధర్త్రే
నమో నమస్తేఽఖిలలోకభర్త్రే ॥ ౩॥

సృష్టం దేవ చరాచరం జగదిదం బ్రహ్మస్వరూపేణ తే
సర్వం తత్పరిపాల్యతే జగదిదం విష్ణుస్వరూపేణ తే ।
విశ్వం సంహ్రియతే తదేవ నిఖిలం రుద్రస్వరూపేణ తే
సంసిచ్యామృతశీకరైర్హర మహారిష్టం చిరం జీవయ ॥ ౪॥
యో ధన్వన్తరిసంజ్ఞయా నిగదితః క్షీరాబ్ధితో నిఃసృతో
హస్తాభ్యాం జనజీవనాయ కలశం పీయూషపూర్ణం దధత్ ।
ఆయుర్వేదమరీరచజ్జనరుజాం నాశాయ స త్వం ముదా
సంసిచ్యామృతశీకరైర్హర మహారిష్టం చిరం జీవయ ॥ ౫॥
స్త్రీరూపం వరభూషణామ్బరధరం త్రైలోక్యసంమోహనం
కృత్వా పాయయతి స్మ యః సురగణాన్పీయూషమత్యుత్తమమ్ ।
చక్రే దైత్యగణాన్ సుధావిరహితాన్ సంమోహ్య స త్వం ముదా
సంసిచ్యామృతశీకరైర్హర మహారిష్టం చిరం జీవయ ॥ ౬॥
చాక్షుషోదధిసమ్ప్లావ భూవేదప ఝషాకృతే ।
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ॥ ౭॥

పృష్ఠమన్దరనిర్ఘూర్ణనిద్రాక్ష కమఠాకృతే ।
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ॥ ౮॥
ధరోద్ధార హిరణ్యాక్షఘాత క్రోడాకృతే ప్రభో ।
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ॥ ౯॥
భక్తత్రాసవినాశాత్తచణ్డత్వ నృహరే విభో ।
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ॥ ౧౦॥
యాఞ్చాచ్ఛలబలిత్రాసముక్తనిర్జర వామన ।
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ॥ ౧౧ ॥
క్షత్రియారణ్యసఞ్ఛేదకుఠారకరరైణుక ।
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ॥ ౧౨॥
రక్షోరాజప్రతాపాబ్ధిశోషణాశుగ రాఘవ ।
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ॥ ౧౩॥
భూభరాసురసన్దోహకాలాగ్నే రుక్మిణీపతే ।
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ॥ ౧౪॥

వేదమార్గరతానర్హవిభ్రాన్త్యై బుద్ధరూపధృక్ ।
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ॥ ౧౫॥
కలివర్ణాశ్రమాస్పష్టధర్మర్ద్ద్యై కల్కిరూపభాక్ ।
సిఞ్చ సిఞ్చామృతకణైః చిరం జీవయ జీవయ ॥ ౧౬॥
అసాధ్యాః కష్టసాధ్యా యే మహారోగా భయఙ్కరాః ।
ఛిన్ధి తానాశు చక్రేణ చిరం జీవయ జీవయ ॥ ౧౭ ॥
అల్పమృత్యుం చాపమృత్యుం మహోత్పాతానుపద్రవాన్ ।
భిన్ధి భిన్ధి గదాఘాతైః చిరం జీవయ జీవయ ॥ ౧౮ ॥
అహం న జానే కిమపి త్వదన్యత్
సమాశ్రయే నాథ పదామ్బుజం తే ।
కురుష్వ తద్యన్మనసీప్సితం తే
సుకర్మణా కేన సమక్షమీయామ్ ॥ ౧౯ ॥
త్వమేవ తాతో జననీ త్వమేవ
త్వమేవ నాథశ్చ త్వమేవ బన్ధుః ।
విద్యాహినాగారకులం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ ॥ ౨౦॥
న మేఽపరాధం ప్రవిలోకయ ప్రభోఽ-
పరాధసిన్ధోశ్చ దయానిధిస్త్వమ్ ।
తాతేన దుష్టోఽపి సుతః సురక్ష్యతే
దయాలుతా తేఽవతు సర్వదాఽస్మాన్ ॥ ౨౧॥
అహహ విస్మర నాథ న మాం సదా
కరుణయా నిజయా పరిపూరితః ।
భువి భవాన్ యది మే న హి రక్షకః
కథమహో మమ జీవనమత్ర వై ॥ ౨౨॥
దహ దహ కృపయా త్వం వ్యాధిజాలం విశాలం
హర హర కరవాలం చాల్పమృత్యోః కరాలమ్ ।
నిజజనపరిపాలం త్వాం భజే భావయాలం
కురు కురు బహుకాలం జీవితం మే సదాఽలమ్ ॥ ౨౩॥
క్లీం శ్రీం క్లీం శ్రీం నమో భగవతే జనార్దనాయ సకలదురితాని నాశయ నాశయ ।క్ష్రౌం ఆరోగ్యం కురు కురు । హ్రీం దీర్ఘమాయుర్దేహి స్వాహా  ॥ ౨౪॥

॥ ఫలశ్రుతిః॥

అస్య ధారణతో జాపాదల్పమృత్యుః ప్రశామ్యతి ।
గర్భరక్షాకరం స్త్రీణాం బాలానాం జీవనం పరమ్ ॥ ౨౫॥
సర్వే రోగాః ప్రశామ్యన్తి సర్వా బాధా ప్రశామ్యతి ।
కుదృష్టిజం భయం నశ్యేత్ తథా ప్రేతాదిజం భయమ్ ॥ ౨౬॥
॥ ఇతి సుదర్శనసంహితోక్తం అమృతసఞ్జీవన ధన్వన్తరి స్తోత్రమ్


సూర్యదేవర వేణుగోపాల్ 
మధిర ఖమ్మం జిల్లా తెలంగాణా





Saturday, 28 March 2020

కరోన వైరస్- చదవాల్సిన స్తోత్రాలు.







కరోన వైరస్- చదవాల్సిన స్తోత్రాలు..



ప్రస్తుతం కరోన వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. హిందూ ధర్మ శాస్త్రాలలో ఇంకా గ్రంధాల్లో ఇటువంటి ఆపత్కర విపత్తులను అరికట్టడానికి ఎన్నో తరుణోపాయాలు సూచించారు. ఇటువంటి రోజుల్లో ఏయే స్తోత్రాలు చదవాలో ఈ క్రింద ఉదహరిస్తున్నాను. ఎవరికి వారు ఇళ్లలోనే ఉండి ఈ స్తోత్రాలను ఉదయం, సాయంత్రం పఠించండి. ఇవి స్వ రక్షణ తో పాటు దేశ రక్షణ కూడా ఉపకరిస్తాయి. పూర్తి నమ్మకం తో పఠించండి... ఈ స్తోత్రాలు అన్ని స్తోత్ర పుస్తకాలలో ఉంటాయి, లేకపోతే నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.


అన్నిటికన్నా ముఖ్యమైనది సంధ్యావందనం. సంధ్యావందన అర్హత ఉన్నవాళ్ళు తప్పనిసరిగా దీనిని ఆచరించాలి. గాయత్రి మంత్రాన్ని విడిగా కాకుండా సంధ్యావందనం లో చేస్తే మంచి లాభం ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు కాబట్టి రోజు సహస్ర గాయత్రి చేస్తే దేశానికి మేలు చేసినవారౌతారు. వీలుంటే  త్రిసంధ్యలు ఆచరించండి. లేకపోతే కనీసం ఉదయ సంధ్య, సాయం సంధ్యలలో ఆచరించండి. గాయత్రి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చేయండి అంటే జపసంఖ్యను పెంచండి. 11,24 కాకుండా 108,508,1008 లు గా చేయండి. మీకూ మంచిది దేశానికి మంచిది. ఈ విపత్తు నుండి త్వరగా విముక్తి వస్తుంది. సంధ్యావందన అర్హత ఉన్నవార్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మిగిలినవారు వేరే స్తోత్రాలు పఠించవచ్చు.


అందరూ విధిగా ప్రతిరోజూ "ఆదిత్య హృదయ "స్తోత్రాన్ని ఉదయం, సాయంత్రం రెండు పూటలా చదవండి. "ఆరోగ్యం భాస్కారాదిచ్చేత్"  అని మన గ్రంధాలు చెప్తున్నాయి. ఆరోగ్యం కోసం సూర్య భగవానుని ఆరాధించాలి. కరోన వైరస్ నుండి ప్రపంచాన్ని రక్షించమని ప్రతిరోజూ రవిని ఆరాధించాలి. అన్ని వర్ణాల వారు ఆదిత్య హృదయమును పఠించవచ్చు.


"శీతలా దేవి"  అన్ని రకాల విపత్తుల నుండి భూమిని కాపాడుతూ ఉంటుంది. ప్రతిరోజూ అందరూ రోజుకు రెండుసార్లు " శ్రీ శీతలా  దేవి స్తోత్రం" ను పారాయణం చేయాలి.  పఠించేవారిని వారి చుట్టూ ఉన్న పరిసరాలను ఈ తల్లి అన్ని ఆనారోగ్య విపత్తుల నుండి రక్షిస్తుంది.


అన్ని విపత్తులకు రక్షణ "శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం" ఇది చాలా మహిమా కలిగినది. శ్రీవిద్యా సాంప్రదాయంలో అగ్రగణ్యమైనది. దీనిని రోజు రెండు సార్లు చదువుతూ ఉంటే స్వీయ రక్షణ సంఘ రక్షణ రెండు జరిగుతాయి. అన్ని సమస్యల నుండి విపత్తుల నుండి తన భక్తులను నిరంతరం కాపాడుతూ ఉంటుంది.  అయితే లలిత సహస్రనామ స్తోత్రాన్ని గురు ముఖంగా నేర్చుకొని పారాయణం చేయాలి.  తప్పులు లేకుండా చదవాలి. ఎందుకంటే అతి నిగూఢమైన శ్రీవిద్యా రహస్యాలు. ఇందులో పొందుపర్చబడినవి.


ఇంకా శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ సుదర్శన మాహా స్తోత్రం, శ్రీ ఆంజనేయ బడబాలన స్తోత్రం, శ్రీ వారాహి స్తోత్రం, శ్రీ లక్ష్మి నృసింహ కరావలంబ స్తోత్రం మొదలగు స్తోత్రాలని ఎవరికి వీలైనవి వారు ఇంట్లో ఉండే చదివితే మంచి ప్రయోజనం ఉంటుంది.

"మహా మృత్యుంజయ మంత్రం, రుద్రం, మన్యు సూక్తం" వంటివి ఈ సమయాలలో చదవడం చాలా మంచిది. నవగ్రహ స్తోత్రం కూడా చాలా మంచిది.


ఈ సమయం లో "చండీ సప్తశతి" చాలా ముఖ్యం.  ఈ సంప్రదాయం లో ఉన్నవారు వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణం చేయడం మంచిది. చండీ దయ ఉంటే ఎటువంటి విపత్తు సంభవించదు. ప్రభుత్వం వారు కూడా దేవాలయాల్లో "చండీ హోమం"  ప్రతి రోజు చేయించడం మంచిది.  ఎక్కువ దేవాలయాలలో రోజు చేయించాలి.


ప్రతి రోజు "శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం" లేదా "దుర్గా స్తోత్రం" "కాళి స్తోత్రం" "కాళి కవచం" ఇంకా "శ్రీ దత్త పంజర స్తోత్రం" లేదా "శ్రీ దత్త సహస్రనామ స్తోత్రం" చదువుతూ ఉంటే అన్నీ విపత్తుల నుండి రక్షణ కలుగుతుంది.

ఇవే కాకుండా కుల దేవత ఆరాధన చేయడం మంచిది. ఇష్ట దేవత ఆరాధన కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.

పైన ఉదహరింపబడినవి ఎవరికి వీలైనవి వారు చదివి కరోన వైరస్ నుండి అందర్నీ రక్షించమని పరమాత్మని వేడుకుందాం.

Thursday, 12 September 2019

వాస్తు విజ్ఞానం- 1

వాస్తు విజ్ఞానం -1
సూర్యదేవర వేణుగోపాల్. M. A (జ్యోతిష్యం)

“వస నివాసే” అనే ధాతువు నుండి “వాస్తు”  అనే పదం జన్మించింది. భూమికి “వాస్తువు” అనే పేరుంది. భూమి పై నిర్మిస్తున్నాం కాబట్టి వాస్తు అయిందని” మయమతం”  చెప్తోంది. నివాస యోగ్యమైన భూమే వాస్తు. వాస్తు శాస్త్రం, గృహాలు, రాజ ప్రాసాదాలు, దేవాలయాలు, తటాకాలు మొదలైన .. వాటి నిర్మాణ నియమాలను, పద్దతులను తెలియజేస్తుంది. ఈ నియమాలన్ని, ప్రకృతిని మనిషి జీవితానికి  సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా మలుచుకోవాలన్న మూల సూత్రం పై రూపొందింపబడింది. గృహాన్ని శాస్త్రబద్దంగా నిర్మించాలని వాస్తుశాస్త్రం నిర్దేశిస్తోంది. అసలు గృహాన్ని శాస్త్రబద్దంగా ఎందుకు నిర్మించాలో  ఈ క్రింది శ్లోకం తెలియజేస్తోంది...


“స్త్రీ పుత్రాధిక భోగసౌఖ్య జననం ధర్మార్ధ కామప్రదం
జంతునామ్ నిలయం సుఖాస్పదమిదమ్ శీతాంబు ఘర్మపహామ్
వాపి దేవ గృహాది పుణ్యమఖిలం గేహత్శ ముత్పద్యతే
గేహాం పూర్వము శనితేన విబుధాః శ్రీ విశ్వకర్మదయహ”
“----వాస్తు రాజ వల్లభం.”

అనగా భార్యబిడ్డలు, భోగసౌఖ్యాలు, చతుర్విధ పురుషార్ధాలు, పసుపాదుల వృద్దిని కలిగించునది, ఎండ, చలి, వర్షం నుండి రక్షించేది, దేవాలయాలు, బావులు నిర్మించుట వంటి పుణ్యకర్మలను చేయించేది, సకల పుణ్యాలకు మూలమైన గృహాన్ని శాస్రోక్తంగా నిర్మించాలి అని పై శ్లోకం అర్ధం... ఇది మహర్షి వాక్కు.
వాస్తుశాస్త్రాన్ని భృగుడు, అత్రి, వశిష్ట, విశ్వకర్మ, మయ , నారద వంటి 18 మంది మహర్షులు మానవ సౌఖ్యం కోసం రచియించారని” సూతుడు” తెలిపారు. వాస్తు శాస్త్రం పురాతనమైనది.  త్రేతాయుగం నాటి వాల్మీకి రామాయణం లోని సుందరకాండ లోని లంకా నగర వర్ణన లో చాలా వాస్తు విషయాలను ప్రస్తావించడం జరిగింది. ద్వాపరయుగం నాటి వ్యాస భారతం లో గల మయసభ  వర్ణనలో వాస్తు ప్రస్తావన ఉంది. సింధులోయ నాగరికత లోని ఇండ్ల,  వీధుల  నిర్మాణం లో వాస్తు ఇమిడిఉందని విజ్ఞుల అభిప్రాయం.
వాస్తు మూఢ నమ్మకం కాదు. మన దేశం లో ఉన్న వాతావరణ పరిస్థితికి ,సంస్కృతికి అనుగుణంగా వాస్తు రూపొందింపబడింది. ఆరోగ్య ప్రదమైన, సుఖప్రదమైన జీవితం కోసం వాస్తు ని ఆశ్రయించాలి.
మనదేశం  భూమండలంపై తూర్పుదేశంగా ఉంది. కనుక ఇక్కడ దక్షిణ, నైరుతి గాలులు  తూర్పు, ఉత్తరం ఇంకా ఈశాన్యం వైపు వీస్తాయి. అంటే గాలి దక్షిణం,నైరుతి నుండి తూర్పు,ఉత్తరం మరియు ఈశాన్యం వైపుకి వీస్తుంది... ఇది అందరికీ అనుభవం లోకి వచ్చే  విషయమే. ఈ సత్యంపై ఆధారపడి వాస్తులో చాలా సూత్రాలు రూపొందింపబడ్డాయి. నీరు ఉండాల్సిన ప్రదేశాలు, ఎత్తుపల్లాలు మొదలైన విషయాలన్నీ ఈ గాలి వీచే పద్దతి కి అనుగుణంగానే తెలుపబడినాయి.
బావులు, నీటిగుంటలు,  నీటివాడకం  ఈశాన్యం, ఉత్తరం లేదా తూర్పు లో ఉండాలని వాస్తు నిర్దేశిస్తోంది. ఈ నియమానికి విరుద్దంగా నైరుతి లోనో లేదా దక్షిణం లోనో బావులు ఉంటే తీవ్ర నష్టం ఉంటుందని వాస్తు చెప్తోంది. నీరు నిలిచి ఉంటే పాచిపట్టి సూక్ష్మ జీవులకు నిలయంగా మారుతుంది.  ఇటువంటి నీటి పై గాలి వీస్తూ పయనిస్తే   విషంగా మారుతుంది.  ఈ గాలి ఇంట్లోకి వస్తే రోగాలు పెరుగుతాయి. అందుకే నీటి వాడకం ఇంటికి దూరం గా ఉంచమని వాస్తు చెప్తుంది. అందువల్లనే తూర్పు ఉత్తర దిక్కులందు పడమర, దక్షిణ దిక్కులకంటే  ఎక్కువ ఖాళీ స్థలం వదలాలని వాస్తు ఆదేశిస్తోంది.  ఎక్కువ ఖాళీ స్థలం తూర్పు ఉత్తరాలలో వదిలి ,తూర్పు, ఈశాన్య ఇంకా ఉత్తర దిశలలో నీటిని ఉంచితే నీటి వాడకం ఇంటికి దూరంగా ఉంటుంది. నీటిపై నుండి గాలి ఇంట్లో కి వెళ్లకుండా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకనే  బావులు మొ|| నవి ఈశాన్య ఉత్తర తూర్పు లలో ఉంచాలని వాస్తు చెప్తోంది. నీరు ఈశాన్యం లో ఉంటే గృహస్తులకు నష్టం ఉండదు ... ఇంటికి దూరంగా నీరు ఉంటుంది...గాలి నీటిపై నుండి గృహం బయటకు వీస్తుంది.
అదేవిధంగా దక్షిణ పశ్చిమ ప్రాంతాల్లో వర్షం నీరు, వాడుక నీరు నిల్వ ఉండకుండా ఈ దిక్కులను మెరకగా ఉంచాలని వాస్తు నిర్దేశిస్తోంది.. తూర్పు ఉత్తర దిక్కులను పల్లంగా ఉంచాలని వాస్తు చెప్తుంది.  ఈ పద్దతిని పాటిస్తే నీరు తూర్పు ఉత్తర దిక్కుల ద్వారా గృహం బయటకు పోగలదు. తూర్పు ఉత్తరాలలో ఎక్కువ ఖాళీ స్థలం వదిలితే నీరు ఇంటికి దూరంగా వెళుతుంది... అందుకనే ఈ దిక్కులను పల్లం గా ఉంచాలి.
సశేషం.....

సూర్యదేవర వేణుగోపాల్. M. A. జ్యోతిష్యం
సుందరయ్య నగర్  మధిర  ఖమ్మంజిల్లా
Venusuryadevara@gmail.com

Sunday, 11 August 2019

నైరుతి వీధి శూల


నైరుతి వీధి శూల

వీధి శూల అంటే వీధి యొక్క చూపు లేక పోటు అని అర్ధం.  సాధారణం గా వీధి శూల మేలు చేయదు. అయితే ఈశాన్య వీధిశూల మేలు చేస్తుంది... పడమర వాయవ్యం, దక్షిణ ఆగ్నేయం వీధి పోటు కూడా మంచివే. నష్టాలను ఇవ్వవు. అన్నిటికన్నా నైరుతి వీధి శూల చాలా ప్రమాదం.
గృహ యజమాని, యజమానురాలు ఇంకా పెద్ద సంతానం పై దీని ప్రభావం అధికం. కుటుంబం మొత్తం కూడా ఈ వీధి శూల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. దక్షిణ నైరుతి వీధి శూల వల్ల గుండె జబ్బులు, ప్రమాదాలు, యాక్సిడెంట్స్ లో మృతి చెందడం... యజమాని ఉద్యోగం లేదా వృత్తిలో తీవ్ర సమస్యలు పొందడం, ఇంకా అనైతిక మైన పనులు చేసి పరువును పోగొట్టుకోవడం వంటివి జరగగలవు...
పడమర నైరుతి వీధిశూల స్త్రీల పై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది.. ప్రవర్తన దోషాలు, గుండె జబ్బులు. వృత్తిలో సమస్యలు, అధిక ఖర్చు, ప్రమాదాలు  జరగగలవు.
మొత్తం మీద గమనిస్తే నైరుతి వీధి శూల ప్రమాదాలను, గుండె జబ్బులను, వృత్తిలో సమస్యలను ఇంకా వివాహం లేట్ అవ్వడం, అబార్షన్స్ అవ్వడం, మగ సంతానం లేకపోవడం వంటి ఫలితాలు ఉంటాయి..ఈ వీధిశూల కుటుంబం మొత్తాన్ని వేధిస్తుంది. ముఖ్యంగా యజమాని, యజమానురాలు ఇంకా పెద్ద సంతానం జాగ్రత్తగా ఉండాలి...
ఈ వీధి శూలను వెంటనే సవరించాలి... నిర్లక్ష్యం చేయరాదు..


సూర్యదేవర వేణుగోపాల్... M. A (జ్యోతిష్యం)
సుందరయ్య నగర్ ... మధిర
ఖమ్మం జిల్లా 507203
Venusuryadevara@gmail.com


Wednesday, 24 July 2019


దక్షిణం అంటే భయం ఎందుకు?

 ఈ రోజుల్లో దక్షిణం దిశ మీద చాలా అపోహలు ప్రజలలో ఉన్నాయి. ఇప్పటి వాస్తు పండితులు కూడా దక్షిణ దిశ పై లేనిపోని భయాలను, అపోహలను పెంచుతున్నారు. వాస్తవం ఏమిటంటే వాస్తు లో అన్ని దిశలకు దేనికుండే లాభ నష్టాలు వాటికున్నాయి.. అయితే  పరిస్థితులకు అనుగుణంగా దిశలను సరిచేసి కట్టడాలను నిర్మించాలి. దిక్కుల యొక్క లక్షణాలు వాటి పరిమితులను తెలుసుకొని వాస్తు సూత్రాలను పాటించాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. అంతే కాని ఒక దిశ మంచిదని ఇంకొక దిశ మంచిది కాదని వర్గీకరించకూడదు.
దక్షిణ దిక్కు చాలా బలమైన దిక్కు. దీని అధిపతి యముడు. నవగ్రహాలలో కుజ గ్రహం ఈ దిక్కునకు ఆధిపత్యం కలిగి ఉంటాడు. మన కర్మల ఫలాలను ఈ దిశ మనకు అందిస్తుంది.  ఈ దిక్కును సరియైన రీతిలో వినియోగించుకుంటే సత్వర అభివృద్ది తధ్యం. ఈ దిక్కును వినియోగించుకోవడంలో పొరపాట్లు జరిగితే అనేక నష్టాలు కలిగే ప్రమాదం ఉంది. సరియైన రీతిలో దక్షిణ దిక్కును ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం.
దక్షిణం ను సరిగ్గా ఉంచితే చాలా మంచి ఫలితాలు త్వరగా కలుగుతాయి. ముందుగా గృహ ప్రాంగణంలో దక్షిణ దిక్కును మెరకలో ఉంచాలి. ఉత్తరం కన్నా దక్షిణం మెరకగా ఉంటే ధనలాభం ఆరోగ్యం తప్పక కలుగుతాయి. దక్షిణ దిక్కును ఎప్పుడు పల్లంగా ఉంచరాదు. ఈ శ్లోకాన్ని గమనించండి......

నశ్యన్తి పురుషా స్తత్ర దేవతాచ ప్రణశ్యతి
ధన హానింకరో తధా నిత్యం రోగ కృ దక్షిణ ప్లవ
   అపరాజిత పృచ్చ
దక్షిణ దిశ పల్లంగా ఉంటే ధన నష్టం రోగాలు కలుగుతాయి అని దీనర్థం. దేవతలు కూడా ఇటువంటి స్థలాలలో ఉంటే నశిస్తారు  అని అపరాజిత పృచ్చ అనే ప్రాచీన వాస్తుగ్రంధం తెలుపుతుంది.  కనుక దక్షిణ దిక్కును ఎత్తులో ఉంచితే ఆరోగ్యం, ధనం సులభంగా ప్రాప్తిస్తాయి.  కనుక దక్షిణ దిక్కును ఫ్లోరింగ్ లోనూ, నిర్మాణం లోనూ ఎత్తులో ఉంచితే అనేక లాభాలు కలుగుతాయి.  కాబట్టి ఈ దిక్కును ఎత్తులో ఉంచినంత వరకు దక్షిణ దిక్కు ను గురించి భయపడనక్కర లేదు.

య, ర, ల, వ  అనే అక్షరాలతో పేరు ప్రారంభం అయ్యే వారికి దక్షిణ  ఫెసింగ్ చాలా బాగా కలిసి వస్తుంది. ఈ అక్షరాల తో ప్రారంభం అయ్యేపేరు గల  వ్యాపారాలు కూడా దక్షిణ ఫెసింగ్ లో ఉంటే బాగా సాగుతాయి.  అయితే దక్షిణం లో వేరే దోషాలు లేకపోతే ఈ అక్షరాల వారికి అద్భుతుంగా కలిసి వస్తుంది.  దక్షిణ ఫెసింగ్ లో ఉండటం అంటే ఉత్తరం లో నివసించినట్లే. అంటే రోడ్ దక్షిణం ఉంటుంది . వ్యాపార సంస్థలు రోడ్ కు ఉత్తరం లో ఉంటాయి. అంటే కుబేర స్థానంలో వ్యాపారాలు ఉంటాయి కాబట్టి అవి బాగా సాగి మంచి లాభాలు వస్తాయి. కిరాణా దుకాణాలు, హోటల్స్ ఇంకా నిత్యవసర వస్తు దుకాణాలు బాగా సాగుతాయి. ఈ సూత్రం య,ర, ల, వ అక్షరాల వారికి వర్తిస్తుంది. ఈ రహస్యం తెలియక చాలామంది దక్షిణ ముఖంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ఇష్టపడరు. భయపడతారు. దక్షిణంలో ఇతర దోషాలు లేనంతవరకు ఈ ముఖంగా వ్యాపారాలు ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయి. ఇది అనుభవ పూర్వకం గా తెలుసు కున్న సత్యం.
గృహంలో దక్షిణ దిక్కులో ఏ గది ఉంచాలో మన ప్రాచీన వాస్తు గ్రంధాలు తెలియజేశాయి.
దక్షిణేచైవ శయనం .......... సనత్ కుమార సంహిత
అంటే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న బెడ్రూం దక్షిణంలో ఉండాలని సనాత్కుమార సంహిత  తో పాటు అనేక ప్రాచీన వాస్తు గ్రంధాలు  తెలియజేశాయి. అయితే ఇప్పుడు మనం బెడ్రూం లను నైరుతిలో ఉంచుతున్నాము.  ఇది తప్పు లేదుకాని,  వీటిని దక్షిణంలో ఉంచితే ఇంకా మరిన్ని ప్రయోజనాలు తప్పక కలుగుతాయి. బెడ్ రూమ్ లను నైరుతి లో కన్నా దక్షిణ దిశలో ఉంచితే తప్పనిసరిగా మంచి ఆరోగ్యం కలుగుతుంది. సందేహం లేదు.  అయితే దక్షిణంలో తప్పనిసరిగా కిటికీ ఉంచాలి. అప్పుడు మాత్రమే అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది.
బరువులను మోసే దిశ దక్షిణం కనుక ఈ దిశలో ఎక్కువ బరువైన వస్తువులను ఉంచాలి. దక్షిణ నైరుతిలో స్టోర్ రూమ్ వేసి ఎక్కువ బరువులను ఉంచితే అద్భుతమైన ఫలితాలు తప్పక కలుగుతాయి. 
దక్షిణం పల్లంగా ఉండకూడదు కాబట్టి బావులు కానీ గుంటలు కానీ ఉంచరాదు. ఈ దిశలో బొర్స్ కానీ బావులు కానీ ఉంటే ఆకస్మిక ప్రమాదాలు,ఆరోగ్య ఆర్ధిక సమస్యలు వస్తాయి. ఇంకా ప్రమాదాలలో అంగవైకల్యం కలిగే వీలుంది.
స్త్రీకలహా స్త్రీ దౌష్ట్యం ..........  బృహత్ సంహిత...
దక్షిణంలో బావులుంటే స్త్రీ నాశనం, స్త్రీలకు సమస్య  అని బృహత్ సంహిత తెలియ జేస్తుంది..

గృహంలో దక్షిణ దిక్కును ఎత్తులో ఉంచాలని చాలామంది ఇంటి లోపలి భాగం కన్నా బయట  ఫ్లోరింగ్ ( అంటే ప్రహరికి, ఇంటికి మధ్య వదలిన ఖాళీస్థలం) ఎత్తులో ఉంచుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ విధమైన అమరిక వలన ధనం బాగా ఖర్చు అవుతుంది.  కనుక దక్షిణం ను గృహంలో కన్నా కొంచెం పల్లంలో ఉంచి ఉత్తరం కన్నా ఎత్తులో ఉంచాలి.  అప్పుడు మాత్రమే ఈ దిశ నుండి మంచి ఫలాలు లభిస్తాయి.  

గృహం లో కానీ ఇంకా ఏ  నిర్మాణం లో నైనా దక్షిణ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం వదలి నిర్మాణం చేపట్టాలి. దక్షిణం కన్నా ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ ఉంచి నిర్మాణం చేయాలి.
దక్షిణం వైపు అసలు ఖాళీ స్థలం వదలకుండా నిర్మాణాలు చేయకూడదు. నిర్మాణాలకు 4 ప్రక్కల ఖాళీ తప్పనిసరిగా ఉంచాలి. దక్షిణం వైపు ఇంటిని ఖాయం చేసి అంటే ఖాళీ స్థలం వదలకుండా నిర్మిస్తే గృహస్తుకు అనేక సమస్యలు వస్తాయి. చాలామంది దక్షిణం వైపు ద్వారాలను ఉంచడానికి భయపడతారు. ఇది అర్ధం లేని భయం మాత్రమే. నిరభ్యంతరంగా దక్షిణం వైపు ద్వారాన్ని అమర్చవచ్చు. అదే విధంగా దక్షిణ దిశలో కిటికీ తప్పనిసరిగా ఉండాలి.  దక్షిణంలో కిటికీ లేని గృహం రోగ గృహం.
కన్య, మకర, మిథున రాశులవారికి దక్షిణం సింహద్వారం శ్రేష్టం. ఇది గమనించండి...
కన్యా మకర యుగ్మానామ్ దక్షిణ ద్వారా మిష్టదమ్........... జ్యోతిర్నిబంధం
జ్యోతిర్నిబంధం అనే ప్రాచీన గ్రంధం  కన్య,  మకర మరియు మిధున రాశులవారికి దక్షిణ సింహద్వారం మంచిదని సూచిస్తుంది.  కనుక భయం లేకుండా దక్షిణ ద్వారం అమర్చవచ్చు.

ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమంటే, దక్షిణ దిశ చాలా బలమైనది. ఫలితాలను వెంటనే చూపిస్తుంది. ఈ దిశను వాస్తు ప్రకారం కరెక్ట్ గా ఉంచినట్లైతే భయపడనవసరం లేదు. ఈ దిశను మెరకగా ఉంచి, బావులు, సంప్స్ లేకుండా, ఇంకా తక్కువ స్థలం వదిలి నిర్మాణాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అంతే కానీ అసలు ఈ దిక్కు మంచిది కాదని నిర్ణయించి నిర్మాణాలు చేస్తే ప్రగతి లోపిస్తుంది. అన్ని దిక్కులను సమన్వయం చేసి ఉపయోగించుకుంటేనే మంచి అభివృద్ది సాధ్యం. అందుచేత సరియైన వాస్తు సూత్రాలను పాటించి దక్షిణంను సరియైన రీతి లో ఉపయోగించుకోవాలి అప్పుడు మాత్రమే మంచి ఆరోగ్యం, మంచి సంపద లభిస్తాయి.
 సూర్యదేవర వేణుగోపాల్. M.A. (జ్యోతిష్యం)
మధిర  ఖమ్మం జిల్లా.


venusuryadevara@gmail.
సూర్యదేవర వేణుగోపాల్ 
ఇంటి నెం  1-879
సుందరయ్య నగర్  మధిర
ఖమ్మం జిల్లా  తెలంగాణా 507 203