11. నేను వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. ప్రస్తుతం అనేక ఆర్ధిక ఆరోగ్య సమస్యలతో కొన్ని ఏళ్ళు గా బాధపడుతున్నాను. ఎవరో చెపితే ప్రతిరోజూ శ్రీలలిత సహస్రనామ స్తోత్రం చదువుతున్నాను. ఫలితం లేదు. యజుర్వేద సంధ్యావందనం కొంతకాలం చేసి మానివేశాను ఇప్పుడు బాబాగారికి పూజా చేస్తున్నాను. పరిష్కారం చూపగలరు.
సంధ్యావందనం మానివేయడం ఘోరమైన తప్పు. మీరు సంధ్యావందనం జీవితాంతం తప్పనిసరిగా చేయాలి. సంధ్యావందనం చాలా పవిత్రమైన క్రియ. చతుర్విధ పురుషార్ధాలను ప్రసాదిస్తుంది. సంధ్యావందనం మానివేయడం పాపం. సంధ్యావందనం చేయకుండా మీరు యే పూజ చేసినప్పటికీ ఫలితం శూన్యం. సంధ్యావందనం చేసిన తరువాత మీరు యే పూజ చేసినప్పటికీ మంచిఫలితాలు వస్తాయి. సంధ్యావందనం చేస్తే మీకు సమాజానికి తప్పనిసరిగా మంచి జరుగుతుంది. మీరు సంధ్యావందనం చేసిన తరువాత మీ గురువుగారు చెప్పిన పూజలను చేయండి తప్పని సరిగా సమస్యల నుండి బయట పడతారు
12. కురుక్షేత్ర యుద్దానికి కారణమైన శకుని ఎవరి కుమారుడు? శకుని వివరాలు తెలపండి.
శకుని గాంధారి సోదరుడు. గాంధార రాజు యైన సుబలుని కుమారుడు. శకుని పుత్రుడు ఉలూకుడు. ధుర్యోధనునికి మేనమామ.
13. తల ఎటువైపు పెట్టి నిద్రించాలి?
తల దక్షిణం మరియు తూర్పు వైపు ఉంచి నిద్రించాలి. పరాయి గృహంలో పడమర వైపు తల ఉంచి నిద్రించాలి. ఉత్తరం వైపు అసలు తల పెట్టి నిద్రించ కూడదు
14. జీవులకు ఉన్న ప్రాణాలను పంచ ప్రాణాలంటారు కదా వాటి పేర్లు చెప్పండి.
ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ప్రాణాలే జీవులకు గల పంచ ప్రాణాలు.
15. గృహం లో తులసి మొక్కను ఏ వైపు ఉంచాలి.?
గృహంలో తులసి మొక్కను ఎటువైపు అయిన ఉంచవచ్చు. అయితే దర్వాజకు ఎదురుగా ఉంచాలి. ఇంటి గర్భంలో తులసి వీక్షణ ఉండేలాగా ఉంచితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
16. గృహం కట్టేటప్పుడు అన్నీ సరి సంఖ్య లో ఉండాలని చెప్తారు కదా. పిల్లర్స్ కూడా సరి సంఖ్య లో నే ఉండాలా?
దర్వాజాలు, కిటికీలు మాత్రమే సరిసంఖ్య చూడాలి. పిల్లర్స్ కు ఆ నియమం లేదు. అవసరాన్ని బట్టి పిల్లర్స్ వేసుకోవాలి. పిల్లర్స్ సరిసంఖ్యలో ఉండాల్సిన అవసరం లేదు.
17. నాగ దోషానికి కొంతమంది మానసా దేవి పూజ మంచిదని మరికొంత మంది సుబ్రహ్మణ్య పూజ మంచిదని చెప్తారు. ఏది మంచిది.
2 పూజలు మంచివే. అయితే కాలసర్పదోషం ఉన్నప్పుడూ ఈ 2 పూజలు చేసినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. ఏదైనా పూర్ణ విశ్వాసం తో చేస్తే మంచి ఫలాలు వస్తాయి.
18. జాతక దోషాలకు జపాలు చేయించడం మంచిదా లేక పూజ మంచిదా.
అన్ని దోషాలకు జపాలు అవసరం లేదు. తీవ్ర దోషాలకు అవసరం. అయితే ఎవరికి వారు వారి
జాతకానికి అనుకూలమైన దైవానికి పూజ చేసుకోవడం మంచిది.
19 అన్ని పేర్లు న్యూమరాలజీ ప్రకారం సవరించుకోవాలా?
నేమ్ కరక్షన్ అన్ని పేర్లకు అవసరం లేదు. అనవసరంగా Name కరక్షన్ చేస్తే మంచి జరగక పోగా నష్టం జరిగే అవకాశం ఉంది.
20. నక్షత్రాల ప్రకారం పేర్లు పెట్టుకోవడం మంచిదేనా?
నక్షత్రాల ప్రకారం పేర్లు పెట్టుకోవడం మంచిది.
సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)
H.NO 1-879
సుందరయ్య నగర్ మధిర ఖమ్మం జిల్లా
venusuryadevara@gmail.com
No comments:
Post a Comment