Tuesday, 20 June 2017

ధర్మసందేహాలు- సమాధానాలు 3

21. గర్భవతులు  ఎప్పటివరకు వైదిక కార్యక్రమాలు చేయకూడదు?

5 వ మాసం నిండినప్పటి నుండి వైదిక కార్యక్రమాలు చేయకూడదు. గృహ శంఖుస్థాపన, వంటి క్రతువులు చేయరాదు.  అయితే దైవానికి సంబంధించిన స్తోత్రాలు చదవవచ్చు.


22. గతించిన పెద్దలకు శ్రాద్ద కర్మలు చేయాలా?

తప్పనిసరిగా చేయాలి. పిండ ప్రదానం చేస్తే మంచిది. అలా చేయలేని వారు పితృ తిథి రోజు బ్రాహ్మణునకు స్వయం పాకం ఇవ్వాలి. అసలు చేయకుండా ఉండకూడదు.


23. పితృ దేవత శ్రాద్ద కర్మలు ప్రతి సం|రం వారు మరణించిన తేదీ రోజు చేయవచ్చా?

అలా చేయకూడదు. వారు మరణించిన తిథి రోజు చేయాలి. చాంద్రమానంను పాటించాలి.


24. మా మనవడు అక్షరాభ్యాసం మొన్న చేశాము. అయ్యగారు మొదటగా ఓం నమ శివాయా అనే పదముతో అక్షరాభ్యాసం  చేశారు. సరస్వతి దేవి పేరు తర్వాత రాశారు. ఈ విధంగా చేయవచ్చా?


సకల విద్యలకు మూలమై వెలుగొందువారు శివ పరమాత్మ, ఆయన లేనిది ఈ జగమే లేదు. మీ అయ్యగారు సరిగానే అక్షరాభ్యాసం చేశారు. ఆందోళన పడవద్దు.


25. పెళ్లి సమయంలో ఉపనయనం  మంచిదేనా?

ఉపనయనం చిన్నప్పుడే చేయాలి.  ఇప్పుడు వివాహ సమయంలో నామ మాత్రంగా చేస్తున్నారు. ఇది మంచిది కాదు.  చిన్నప్పుడే చేయడం మంచిది.


26. గృహం లో ఇంకుడు గుంతలు ఎటువైపు ఉంచాలి?


ఇంకుడు గుంతలు ఈశాన్యంలో గాని ఉత్తరం లో గాని తూర్పు న గాని ఉంచుకోవచ్చు...


27. మా ఇంటికి సింహా ద్వారం ఈశాన్యం లో లేదు. తూర్పు మధ్యలో ఉంది. ఈ విధంగా ఉంచవచ్చా?


ఉంచుకోవచ్చు. అయితే గృహ మధ్యభాగంలో సింహా ద్వారం ఉంటే దర్వాజాకు రెండు వైపులా కిటికీలు ఉంచాలి....


28. మహా భారతంలో ద్రౌపది కర్ణుని 6 వ భర్తగా కోరుకుందని చాలామంది అభిప్రాయం. ఇంకా సినిమాలలో కూడా చూపించారు.... నిజంగా ద్రౌపది కర్ణుని 6 భర్తగా పొందాలని కోరుకుందా?


నిజంగా ఈ అభిప్రాయం చాలా తప్పు.  వ్యాస భారతంలో అసలు ఈ ప్రస్తావన లేదు. అసలు ఈ విషయాన్ని ఎవరు ప్రచారం చేశారో తెలియదు.... వ్యాసభారతం ప్రకారం ద్రౌపది కర్ణుని 6 వ భర్తగా పొందాలని  ఆలోచించలేదు.. 


29. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణంను కౌరవులలో వ్యతిరేకించింది ఎవరు?

వికర్ణుడు. దుర్యోధనుని సోదరుడు. కౌరవుల 100 మంది సోదరులలో వికర్ణుడు ఒకడు. ద్రౌపది ని అవమానించడానికి కౌరవులకు అధికారం లేదని వాదించాడు.....


30. వేదాలు నాలుగు అంటారు మరి పంచమవేదం అంటే ఏమిటి.?

వేదాలు నాలుగే... మహాభారతాన్ని పంచమవేదం అని అంటారు.  మానవులు భారతం నుండి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అందుకే పంచమవేదం  అయింది.








సూర్యదేవర వేణుగోపాల్  M. A  (జ్యోతిష్యం)

H. NO    1-879   సుందరయ్య నగర్ 

మధిర   ఖమ్మం జిల్లా  తెలంగాణా

venusuryadevara@gmail.com

No comments:

Post a Comment