Monday, 20 March 2017

ఇంటికి ప్రహరీ రక్షణ కవచం

ఇంటికి ప్రహరీ రక్షణ కవచం.
సూర్యదేవర వేణుగోపాల్. M.A (జ్యోతిష్యం)


నైసర్గిక వాస్తు దోషాలను అరికడుతుంది. గృహానికి ప్రహరీ లేకపోతే ఆ గృహం చుట్టూ ఉన్న వాస్తు దోషాల వలన అందులో  ఉండేవారు బాధపడవలసి వస్తుంది. అష్ట దిక్కులను మన గృహానికి అనుగుణంగా సవరించుకొని మేలు పొందాలంటే ప్రహరీ నిర్మాణం తప్పనిసరి. ప్రహరీ గోడను అనుభవం కలిగిన వాస్తు పండితుని పర్యవేక్షణలో నిర్మించాలి. పెరిగి ఉన్న మూలాలను,దిక్కులను సవరించి ప్రహరిని నిర్మించాలి. స్థలం ఉన్నంత మేరకు ప్రహరీని కట్టకూడదు. మంచి ఫలితాల కోసం దిక్కులను సవరించి ప్రహరిని కట్టాలి. యే నిర్మాణానికైనా ప్రహరీ తప్పనిసరి. గృహానికి ప్రహరీ చాలా ముఖ్యం. ప్రహరీలు లేని గృహం రాణించదు.
ప్రహరీ నిర్మాణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రహరి పునాది లేదా ఫౌండేషన్ ఎట్టి పరిస్థితిలోను ఇంటి పునాదిని మించకూడదు. ఇంటిపునాది కంటే ప్రహరీ పునాది ఎత్తులో ఉంటే ఇంటి ఆయుర్దాయం తగ్గిపోతుంది. దక్షిణం మరియు పడమర లు ఎత్తులో ఉండాలని కొంతమంది ఇంటి పునాది కంటే ప్రహరీ పునాది ని ఎత్తులో కడుతున్నారు. ఇది చాలా తప్పు. అన్ని దిశలందు ప్రహరీ ఫౌండేషన్ ఇంటి ఫౌండేషన్ కన్నా తక్కువలోనే ఉండాలి.
ప్రహరీలకు తూర్పు ఉత్తరంలో కట్టే ఫౌండేషన్ దక్షిణం పడమరల ఫౌండేషన్ కన్నా తక్కువ  ఎత్తులో ఉంచాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రహరీ నిర్మాణం 2 విధాలుగా ఉంటుంది. 4  దిక్కులందు సమానమైన ఎత్తులో ప్రహరీ నిర్మించుట ఒక పద్దతి. తూర్పు ప్రహరీ పడమర ప్రహరీ కన్నా తక్కువలో మరియు దక్షిణం ప్రహరీ ఉత్తరం ప్రహరీ కన్నా ఎత్తులో ఉంచి ప్రహరీ నిర్మించుట 2 వ పద్దతి. ఈ రెండింటిలో 2 వ పద్దతి సరియైనది. ప్రహరీ కట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి. ముందుగా గృహానికి దక్షిణం, పడమరల వైపు ప్రహరీని నిర్మించాలి. ఈ దిక్కులందు ప్రహరీ లేకుండా తూర్పు, ఉత్తర దిశలందు కాంపౌండ్ నిర్మించరాదు. పడమర,దక్షిణాల వైపు జలాశయాలు, బావులు, బొర్లు, లోతైన గుంటలు, పెద్ద డ్రైనేజీలు ఉన్నప్పుడూ  కొంత స్థలం వదలి ప్రహరీ నిర్మించాలి. ఈ పల్లపు ప్రాంతాలను ఆనుకొని ప్రహరీ కట్టకూడదు. కనీసం 5 నుండి 12 అడుగుల వరకు ఖాళీ స్థలం వదలి ప్రహరీ నిర్మించాలి. అప్పుడే ప్రహరీ వలన మంచి ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా పడమర దక్షిణ ముఖాలుగా నిర్మించే గృహాల కు నైరుతి ప్రాంతం నందు ప్రహరికి ఆనించి మెట్లను నిర్మిస్తున్నారు ఇది తప్పు. అదేవిధంగా నైరుతి మూసివేయాలని మరుగుదొడ్లు లేదా స్టోర్ రూమ్స్ నైరుతిని మూసివేసి నిర్మిస్తున్నారు ఇది కూడా చాలా తప్పు. ఈ విధమైన నిర్మాణాల వలన ప్రహరీ ప్రయోజనం నెరవేరదు. ఇటువంటి నిర్మాణాలు వలన కాంపౌండ్ బయట ఉన్న పల్లంతో తీవ్ర నష్టం జరుగుతుంది. తప్పనిసరి పరిస్థితులలో కాంపౌండ్ కు టచ్ చేసి మరుగుదొడ్లు నిర్మించవలసి వస్తే తప్పనిసరిగా కాంపౌండ్ బయట మట్టి వేసి ఎత్తు చేయాలి. కాంపౌండ్ బయట పల్లం లేకుండా మట్టి వేసి ఎత్తు లేపడం గాని లేదా అరుగులు వంటివి కట్టడంగాని చేయాలి. ప్రహరీ గోడకు గృహం లోని యే భాగము టచ్ కాకుండా నిర్మించడం మంచిది.
తూర్పు ఉత్తర సింహద్వారం తో నిర్మించే గృహాలకు సింహద్వారం బయటకు కనిపించే విధంగా ప్రహరీ నిర్మించాలి. తూర్పు ఉత్తరాలలో బాగా ఎత్తులో ప్రహరి నిర్మించుట మంచిది కాదు. మగ సంతానానికి ఎదుగుదల లోపిస్తుంది. అయితే దక్షిణ పశ్చిమ దిశలలో ప్రహరీని  ఎత్తులో ఉంచవచ్చు. తూర్పు ఉత్తరాలలో మరీ ఎత్తులో ప్రహరీ మంచిది కాదు. దక్షిణం, పడమరల వైపు కూడా గాలికి అవరోధం రానంత మేర ఎత్తులో ప్రహరీ నిర్మించాలి. మన పూర్వ నిర్మాణాలలో దక్షిణం,పడమరల వైపు ఇంటిని ఖాయం చేసి ఉండటం మనం చూస్తూంటాము. ఇది చాలా తప్పు. ఇటువంటి గృహాలకు నైసర్గిక వాస్తు దోషాలు బాగా తమ ప్రభావాన్ని చూపిస్తాయి. కొంతమంది నైరుతి మూసి నిర్మాణాలు చేయవచ్చునని సలహా ఇస్తున్నారు. ఇది కూడా తప్పు. నైరుతి మూసి నిర్మాణాలు చేస్తే ఇటువంటి నిర్మాణాలకు నైరుతి లో ఉండే నైసర్గిక వాస్తు దోషం తగిలి తీవ్ర నష్టాలు వస్తాయి. ఇంటికి దక్షిణం పడమర లో వేరే గృహం ఉంటే ఈ దిక్కులందు కాంపౌండ్ అవసరం లేదని భావిస్తారు.ఇది తప్పు. మన ప్రహరీ మనం కట్టుకోవలసిందే.
ప్రహరి ప్రధాన గృహం నుండి దక్షిణం ఆగ్నేయ, దక్షిణ నైరుతి దిక్కులు సమానమైన కొలతతో 90 డిగ్రీలు గా ఉండాలి. అదేవిధంగా పడమర వైపు పడమర, పడమర వాయవ్యం, పశ్చిమ నైరుతి ప్రధాన గృహం నుండి సమానమైన కొలతతో 90 డిగ్రీలు  గా ఉండాలి. ఏ దిశ పెరగరాదు.  అయితే తూర్పు ఉత్తరం వైపు తూర్పు ఆగ్నేయం కన్నా తూర్పు ఈశాన్యం అదే విధంగా ఉత్తర వాయవ్యం కన్నా ఉత్తర ఈశాన్యం ఎంతో కొంత పెరిగే విధంగా ప్రహరీ నిర్మించాలి. ఈశాన్యం పెరగకుండా ఉండరాదు. ఇంటి ప్రహరీ గోడ కు వీధి శూల తగిలే పక్షంలో నిర్లక్ష్యం చేయరాదు. ప్రహరీ కి ఎంతో కొంత ఖాళీ వదలి వేరే గోడను ప్రహరీ కి అడ్డం గా నిర్మించాలి. అప్పుడే ప్రహరీ కి వీధి శూల నుండి రక్షణ లభిస్తుంది.
ఈ రోజుల్లో చాలామంది ప్రహరిలను ఇంటి బీముల పై నిర్మిస్తున్నారు. ఇంటి బీమ్స్ ను ఇంటి నుండి బయటకు పెంచి వాటిపై ఇంటికి ఎడంగా ప్రహరిని కడుతున్నారు. భూమి పై మట్టం నుండి కాంపౌండ్, ఇంటి గోడలు ఎడంగా ఉన్నప్పటికి భూమి అడుగు భాగంలో ప్రధాన గృహం మరియు ప్రహరీలు బీమ్స్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఇటువంటి నిర్మాణం వలన ప్రహరీ ప్రయోజనం నెరవేరదు. ప్రహరీ ఇంటికి మద్య ఖచ్చితంగా కనెక్షన్ ఉండకూడదు. ఇంటికి ప్రహరీ మధ్య కనెక్షన్ ఉంటే ప్రహరీలకు తగిలే నైసర్గిక వాస్తు దోషాలు ఇంటికి కూడా తగిలి అనేక సమస్యలు వస్తాయి. కనుక ప్రహరీలకు వేరే పిల్లర్స్, బీమ్స్ వేసి ప్రహరిని నిర్మించాలి.
ఇంటి శ్లాబ్స్ ప్రహరీ గోడలపై వచ్చే విధంగా నిర్మించరాదు. ఇంటి శ్లాబ్ ఇంటి ప్రహరి కన్నా 2 లేక 3 అంగుళాలు లోపలికి ఉండే విధం గా వేయాలి. సెప్టిక్ టాంకులు,బోర్లు మొ|నవి ప్రహరికి టచ్ కాకుండా ఉండాలి.ప్రహరీ పై ఇంటికన్నా ఎత్తులో ఆర్చీలు డిజైన్లు కట్టరాదు. క్రూర మృగాల బొమ్మలు, భయం గొలిపే బొమ్మలు ప్రహరీపై ఉంచరాదు. ఇంకా ప్రహరీ పై గాజు పెంకు లను అమర్చకూడదు. ఇంటిని నిర్మించిన తదుపరి ప్రహరిని నిర్మించుట మంచిది. ఇంటిని ప్రాతిపదికగా తీసుకొని ప్రహరిని నిర్మించుట మంచిది. ఇంటికన్నా ప్రహరీ ముందుగా నిర్మిస్తే ఇంటిని ప్రహరికి అనుగుణంగా సవరించాలి. ఇది మంచి పద్దతి కాదు. అయితే ఖాళీ స్థలానికి నైరుతి ఆగ్నేయ దిక్కుల విపరీతంగా పెరిగిఉంటే ముందుగా పెరిగి ఉన్న దిక్కులను సవరించి ప్రహరీ నిర్మించాలి. అప్పుడు ఇల్లు సకాలంలో పూర్తి అవుతుంది.
ప్రహరికు ఉచ్చ స్థానంలో గేట్లు అమర్చాలి. ప్రహరికి కాలువలకు మధ్య ఎంతోకొంత ఖాళీ ఉండాలి. ప్రహరికి ఆనుకొని కాలువలు ఏ దిశలోనూ ఉండరాదు. పాత గృహానికి కాంపౌండ్ నిర్మించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధాన గృహానికి పారు చెడకుండా ప్రహరీ కట్టాలి. అదే విధంగా ప్రధాన గృహం ను ప్రాతిపదిక గా తీసుకొనే ప్రహరీ కట్టాలి. ప్రధాన గృహం నుండి కొలత తీసుకొని ప్రహరీ కట్టాలి. అంతేకాని ప్రహరికి నూతనంగా మూలమట్టం వేసి కట్టకూడదు. ఇంటిపారు లోనే ప్రహరీ ఉండాలి. ప్రహరీ గోడలు అన్నీ సమానమైన మందం తో నిర్మించాలి. దక్షిణ పడమరల వైపు ఎక్కువ మందం తో నిర్మించి తూర్పు ఉత్తరాలలో తక్కువ మందంతో ప్రహరీ నిర్మించవచ్చు. ఇలా కాకుండా తక్కువ మందంతో ప్రహరీ ని దక్షిణ పడమరలలో నిర్మించి ఎక్కువ మందంతో తూర్పు ఉత్తరాలలో ప్రహరి కట్టరాదు. 4 వైపులా సమానమైన మందంతో ప్రహరీ కట్టవచ్చును. ఇంటి సింహద్వారంలో గాని ఇతర దర్వాజలో కాని ప్రహరీ గోడ పిల్లర్స్ రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా బోర్లు టాంకులు మరియు బావులందు ప్రహరీ పిల్లర్లు రాకూడదు.
ప్రహరికి అమర్చే గేట్లు తూర్పు ఉత్తరాలలో ఇంటికన్నా తక్కువ ఎత్తులో ఉంచితే మంచిది. దక్షిణ పడమరల వైపు ఎత్తులో వుంచవచ్చు. అయితే ప్రహరీ గోడ నైరుతి లో ఉన్న ఎత్తుకంటే ఈ గేట్లు ఎత్తులో ఉండరాదు. ప్రహరీ గోడ మధ్య చెట్లు ఉండకూడదు. ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రహరీ నిర్మిస్తే  నైసర్గిక వాస్తు దోషాలు తొలగి సుఖ సౌఖ్యాలు పొందవచ్చు.
సూర్యదేవర వేణుగోపాల్ M. A జ్యోతిష్యం

H.NO—1-879   సుందరయ్య నగర్       మధిర  ఖమ్మం జిల్లా  తెలంగాణా

Wednesday, 8 March 2017

Suryadevara Venugopal: యేఏ పుష్పాలతో నవగ్రహాలను పూజించాలి?

Suryadevara Venugopal: యేఏ పుష్పాలతో నవగ్రహాలను పూజించాలి?: మానవ జీవితం సుఖప్రదంగా సాగిపోవాలంటే నవగ్రహాల యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలి. ఈ నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవడం కోసం జప, పూజ విధులు మర...

యేఏ పుష్పాలతో నవగ్రహాలను పూజించాలి?



మానవ జీవితం సుఖప్రదంగా సాగిపోవాలంటే నవగ్రహాల యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలి. ఈ నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవడం కోసం జప, పూజ విధులు మరియు స్తోత్ర విధానాలు మన శాస్త్రాలు ఉదహరించాయి  వీటిని పాటించడం వలన నవగ్రహ ఆశీర్వాదం లభించి మానవ జీవితం లోని సమస్యలు తొలగిపోతాయి..  యే ఏ పూలతో నవగ్రహాలను పూజిస్తే మంచి జరుగుతుందో ఆ పూల వివరాలను  భవిష్య పురాణం  తెలియ జేసింది, గ్రహ శాంతి పూజలందు  భవిష్య పురాణం చెప్పిన ప్రకారం ఆ యా గ్రహ దేవతలను పూజిస్తే వారి అనుగ్రహం సులభంగా లభించి  సమస్యలు తొలగిపోతాయి.

హయారి కుసుమైః సూర్యం కుముదై చంద్ర అర్చయేత్

క్షితిజమ్ తు జపాపుష్పై చంపకేన తు సోమజం

శతపత్రై గురుః పూజ్యో జాజి పుష్పైస్తు భార్గవః

మల్లికా కుసుమై పంగు: కుంద పుష్పైర్విధంతుద:

కేతస్తు వివిధై: పుష్పే: శాంతి కాలేషు సర్వధా

భవిష్య పురాణం

రవిని పచ్చ గన్నేరు తో చంద్రుని కలువలతో, కుజ గ్రహాన్ని దాసాని పూలతో, బుధుని సంపెంగలతో, గురుని పద్మాలతో,  జాజి పూలతో శుక్రుని, శని గ్రహాన్ని మల్లె పూలతో  ఇంకా మొల్ల పూలతో రాహువుని, కేతు గ్రహాన్ని వివిధ పుష్పాలతో పూజిస్తే నవగ్రహ అనుగ్రహం సత్వరమే లభించి సమస్యలు తీరిపోతాయి.

Saturday, 17 December 2016

Suryadevara Venugopal: తల స్నానం ఏ వారం చేయాలి.

Suryadevara Venugopal: తల స్నానం ఏ వారం చేయాలి.: తలస్నానం, అభ్యంగన స్నానం ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు చేయకూడదు. మన హిందూ జ్యోతీష్య గ్రంధాలు ఈ స్నానం విషయంలో అనేక సూచనలు చేశాయి.  మానవ ప్రయోజనార్...

తల స్నానం ఏ వారం చేయాలి.

తలస్నానం, అభ్యంగన స్నానం ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు చేయకూడదు. మన హిందూ జ్యోతీష్య గ్రంధాలు ఈ స్నానం విషయంలో అనేక సూచనలు చేశాయి.  మానవ ప్రయోజనార్ధం, ప్రకృతి నియమాలను దృష్టిలో ఉంచుకొని ఈ సలహాలను సూచించుట జరిగింది. ప్రస్తుత సమాజం ఈ నియమాలను అంతగా పట్టించుకోవడం లేదు. కానీ ఈ నియమాలను పాటిస్తే మంచి తప్పక జరుగుతుంది.

 తలస్నానం ఏ వారం చేయాలో, ఏ వారం చేయకూడదో, ఈ క్రింది పట్టికను గమనిస్తే తెలుస్తుంది.. 

ఆదివారం   తలస్నానం  చేస్తే  మనిషి తేజస్సు, అందం తగ్గుతుంది. మనస్తాపం కలుగుతుంది. చెడు వార్తలు వినవలసి వస్తుంది.

సోమవారం తలస్నానం వలన ముఖ కాంతి తగ్గుతుంది. అనవసర భయాలు ఆవరిస్తాయి. 

మంగళవారం తలస్నానం వలన అపాయం, ఆయుక్షీణమ్ కలుగుతుంది.. వివాహిత స్త్రీలు మంగళ వారం తలస్నానం చేస్తే భర్తకు కలసిరాదు.

బుధవారం తలస్నానం వలన కీర్తి, ధన, విద్యా లాభం కలుగుతుంది. అన్నింటా శుభం.

గురువారం తలస్నానం వలన విద్యలో ఆటంకాలు, అధిక ఖర్చు,  ఆందోళన, అందరితో విభేదాలు కలుగుతాయి.

శుక్రవారం తలస్నానం వలన అనారోగ్యం, ధన వస్తు నష్టం ఉంటాయి.

శనివారం తలస్నానం ఆయుర్దాయం పెంచుతుంది. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. అన్ని పనులు విజయవంతం అవుతాయి. సకల భోగాలు కలుగుతాయి.


పై విషయాలను మనం గమనిస్తే తలస్నానం బుధవారం, శనివారం చేస్తే మంచిదని తెలుస్తుంది.

మిగిలిన రోజులందు అత్యవసరంగా చేయవలసివస్తే తలకు కొంచెం నువ్వుల నూనె రాసుకొని, నీటిలో కొంచెం పూలు, గరిక వేసి తలస్నానం చేయవచ్చు. అయితే సోమవారం రోజు తలస్నానం పూర్తి నిషిద్దం. 

అభ్యంగన స్నానం  విషయంలో మంగళ, గురు వారములందు పూర్తి నిషిద్దం మిగిలిన వారాలలో చేయవచ్చు. ధన ప్రాప్తి కోసం శనివారం ఉదయం, లేదా శుక్రవారం సాయంత్రం అభ్యంగన స్నానం చేయాలి.

ఈ నియమాలన్నీ సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడే వర్తిస్తాయి. 

venusuryadevara@gmail.com

సూర్యదేవర వేణుగోపాల్  M. A. జ్యోతిష్యం

H. NO 1-879, సుందరయ్య నగర్ 

మధిర, ఖమ్మం జిల్లా   తెలంగాణా 507203


Saturday, 3 December 2016

Suryadevara Venugopal: ఇంట్లో ఏ దేవుని ఫోటో ఉంచాలి- శని యంత్రం ఉంచుకోవచ్...

Suryadevara Venugopal: ఇంట్లో ఏ దేవుని ఫోటో ఉంచాలి- శని యంత్రం ఉంచుకోవచ్...: నిలబడి ఉన్న లక్ష్మి దేవి చిత్రాన్ని గృహంలో ఉంచరాదు.కూర్చుని ఉన్న ఫోటో ని మాత్రమే ఇంట్లో ఉంచాలి. లక్ష్మి దేవి బొమ్మను కాని ఫోటో ని గాని ద...

Vastu Velugu @ Suryadevara Venugopaal: ఇంట్లో ఏ దేవుని ఫోటో ఉంచాలి- శని యంత్రం ఉంచుకోవచ్...

Vastu Velugu @ Suryadevara Venugopaal: ఇంట్లో ఏ దేవుని ఫోటో ఉంచాలి- శని యంత్రం ఉంచుకోవచ్...: నిలబడి ఉన్న లక్ష్మి దేవి చిత్రాన్ని గృహంలో ఉంచరాదు.కూర్చుని ఉన్న ఫోటో ని మాత్రమే ఇంట్లో ఉంచాలి. లక్ష్మి దేవి బొమ్మను కాని ఫోటో ని గాని ద...

Vastu Velugu @ Suryadevara Venugopaal: Vastu Velugu @ Suryadevara Venugopaal: శంఖువు- కొల...

Vastu Velugu @ Suryadevara Venugopaal: Vastu Velugu @ Suryadevara Venugopaal: శంఖువు- కొల...: Vastu Velugu @ Suryadevara Venugopaal: శంఖువు- కొలతలు- నమూనా- లక్షణాలు : గృహం నిర్మించడానికి ప్రధమం గా చేసే పని శంఖుస్థాపన. అంటే దారువుతో చ...

ఇంట్లో ఏ దేవుని ఫోటో ఉంచాలి- శని యంత్రం ఉంచుకోవచ్చా?

నిలబడి ఉన్న లక్ష్మి దేవి చిత్రాన్ని గృహంలో ఉంచరాదు.కూర్చుని ఉన్న ఫోటో ని మాత్రమే ఇంట్లో ఉంచాలి. లక్ష్మి దేవి బొమ్మను కాని ఫోటో ని గాని దర్వాజాలకు దగ్గరగా ఉంచరాదు. గృహం వెలుపల ఉంచరాదు. లక్ష్మి మాత ఫోటో ను పూజ మందిరం లో ఉంచుట మంచిది.
వ్యాపారస్తులు చాలామంది వారి వారి వ్యాపారాలకు లక్ష్మి దేవి పేరు ను పెడతారు. ఈ సందర్భంలో చాలామంది తమ వ్యాపారాల బోర్డ్ ల పై లక్ష్మి మాత బొమ్మను ఉంచుతారు. ఇది మంచిది కాదు. ఈ విధంగా చేస్తే ఆ వ్యాపారాలు తీవ్ర నష్టాలకు లోనై వ్యాపారం అమ్మివేయడం జరుగుతుంది..తీవ్ర నరఘోష తో బాధపడేవారు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఫోటోను గృహం లో ఉంచి ప్రతి రోజు అర్చించాలి. శుక్రవారం రోజు విశేష పూజా చేస్తే  మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లో ప్రశాంతతను కోరెవారు శ్రీరామపట్టాభిషేకం ఫోటో ను గృహం లో ఉంచాలి. ఇంటి ఎలివేషన్ పై కూడా ఈ ఫోటో ను ఉంచాలి.అనేక భయాలతో బాధపడేవారు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిత్రాన్ని ఉంచుకోవాలి. శని, మంగళ వారాలలో విశేష పూజ చేయాలి. నెలకు 1 మంగళవారం అయిన హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం చేయాలి.
సుఖప్రదమైన వివాహ జీవితానికి ఉమామహేశ్వరుల ఫోటోను గృహంలో ఉంచాలి. ఉమా మహేశ్వరుల ఫోటో ను గృహం లో ఉంచి సోమ, శుక్ర వారాలలో విశేషపూజ చేయాలి.

మంచి ఆరోగ్యం కోసం లక్ష్మీనారాయణుల ఫోటో ను ఉంచాలి. అదే విధంగా అన్నిటా జయం, సర్వత్ర అభివృద్ది కొరకు శ్రీ లలిత దేవి ఫోటో ను ఉంచి పూజించాలి. ప్రతిరోజూ శ్రీ లలిత దివ్య సహస్రనామ స్తోత్రం గృహం లో పారాయణ చేస్తే సకల మంగళ ప్రదంగా ఉండి, సుఖశాంతుల లభిస్తాయి.

దేవును విగ్రహాలను గృహంలో ఉంచితే నిత్య పూజ తప్పనిసరి. అడుగు లోపు ఉండే విగ్రహాలు పెట్టుకోవచ్చు. చిన్న చిన్న దేవుని విగ్రహాలు ఇంట్లో ఉండవచ్చు. అయితే పెద్ద విగ్రహాలను ఇంట్లో ఉంచరాదు. శని సింగన పూర్ నుండి తెచ్చిన శని యంత్రాలు ఇంట్లో ఉంచరాదు. నాడా, నల్లని విగ్రహం . ఇంట్లో ఉంచరాదు.

ఈ విధంగా ఆలోచించి విజ్ఞుని సలహా మేరకు గృహంలో దేవుని ఫోటోలు, విగ్రహాలు పెట్టుకొంటే మంచి అభివృద్ది ఉంటుంది.

venusuryadevara@gmail.com

సూర్యదేవర వేణుగోపాల్ M. A జ్యోతిష్యం.
సుందరయ్య నగర్    మధిర     ఖమ్మం జిల్లా తెలంగాణా.
507203



Image may contain: 1 person

Tuesday, 29 November 2016

Suryadevara Venugopal: కుజదోషం వివరణ- రెమెడీస్

Suryadevara Venugopal: కుజదోషం వివరణ- రెమెడీస్: స్త్రీ, పురుష జాతకాలలో కుజ గ్రహం 2, 4, 7, 8,10, 12 వ భావాలలో లేదా స్థానాలలో ఉంటే అది కుజ దోషం గా పరిగణించ బడుతుంది. ఈ దోషం వలన వివాహం ఆలస్య...

కుజదోషం వివరణ- రెమెడీస్

స్త్రీ, పురుష జాతకాలలో కుజ గ్రహం 2, 4, 7, 8,10, 12 వ భావాలలో లేదా స్థానాలలో ఉంటే అది కుజ దోషం గా పరిగణించ బడుతుంది. ఈ దోషం వలన వివాహం ఆలస్యం అవుతుంది. వివాహ జీవితంలో అనేక సమస్యలు ఏర్పడి కొన్ని సందర్భాలలో దంపతులు విడిపోవడం జరుగుతుంది. కుజ దోషానికి అనేక మినహాయింపులు ఉంటాయి. ఈ మినహాయింపులను పరిశీలించకుండా కుజ దోషం నిర్ధారించకూడదు. నేటి కాలంలో వివాహం ఆలస్యం అయితే లేదా వివాహ జీవితంలో సమస్యలు వస్తే కుజదోషం ఉందంటూ భయపెట్టడం జరుగుతుంది. పూర్తిగా శాస్రం తెలియనివారు కుజదోషం పేరు చెప్పి ప్రజలను భయ భ్రాంతులకు గురిచేసి వారి అమాయకత్వాన్ని సొమ్ముచేసుకుంటున్నారు.  కనుక ప్రజలు సరియైన దైవజ్ఞుని సంప్రదించాలి.  కుజదోషం దాని మినహాయింపులు తెలుసుకుందాం.

ఈ దోషం ప్రామాణిక జ్యోతీష్య గ్రంధాలైన ధర్మసింధువు, నిర్ణయ సింధువు మొదలైన గ్రంధాలలో ఉదహరింపబడలేదు. కుజ దోష వివరణ  చింతామణి వివాహ ప్రకరణం, వివాహ మాలిక, నారద సంహిత మొదలైన గ్రంధాలలో ఉంది.

.జాతకంలో.ఈ క్రింది స్థానాలలో కుజుడు ఉంటే కుజదోషంగా చూడ.కూడదు.
.
కర్కాటక సింహరాసులలోనూ, ఇంకా మకర రాశిలోను  కుజును మిత్ర రాసులలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు. కుజుడు 2 వ స్థానంలో ఉండే దోషం మిధున రాశి, కన్య రాశి అయితే కుజ దోషం లేదు..

12 వ స్థానం వృషభ, తులా రాసులైతే దోషం లేదు. 4 వ స్థానం మేషరాశి, వృశ్ఛిక రాశి అయితే దోషం లేదు. 7 వ స్థానం మకర  కర్కాటక రాసులైతే కుజదోషం ఉండదు. 8 వ స్థానం ధనస్సు మీన రాసులైతే దోషం ఉండదు.

ఇంకా కుజుడు గురు, చంద్ర గ్రహాలతో కలసి ఉంటే కుజదోషం లేదు. జాతకంలో శుక్ర గ్రహం బలం గా ఉంటే కుజదోషం లేదు. వధూవరుల ఇద్దరికీ కుజుడు 2, 4, 7, 8, 12 రాసులలో ఉంటే కుజదోషం పరిహరింపబడి సుఖప్రదమైన వివాహ జీవితాన్ని పొందుతారు.

దేవ కేరళమ్ అనే జ్యోతిష్య గ్రంధం ప్రకారం దంపతులలో ఒకరి జాతకంలో కుజదోషం ఉండి మరొకరి జాతకంలో కుజదోషం లేకపోతే వివాహ జీవితంలో తీవ్ర సమస్యలు ఉంటాయి.

దైవజ్ణ సంపూర్ణ చంద్రికా అనే గ్రంధం ప్రకారం       అశ్విని, మృగశిరా, పునర్వసు, పుష్యమి, ఉత్తర, స్వాతి, అనురాధా, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, శ్రవణం, ఉత్తరభాద్ర, రేవతి  నక్షత్రాలలో జన్మించిన వారికి కుజదోషం ఉండదు.

ఈ విధంగా అనేక మినహాయింపులు కుజదోషానికి ఉంతాయి . అన్ని జాతకాలకు కుజ దోషం వర్తించదు. ఇది అందరూ ముఖ్యంగా గుర్తుంచుకోవాలి.

కుజ దోష పరిహారాలు......


జాతకంలో కుజదోషం ఉంది అని నిర్ధారిస్తే ఈ క్రింది పరిహారాలు పాటించాలి. దోషం తోలగిపోతుంది.....
.

కనకపుష్య రాగం ఉంగరాన్ని ధరించాలి.

కందులు ఎర్రని వస్త్రం లో చుట్టి దానం ఇవ్వాలి.  మంగళ వారం రోజు గోమాతకు కందులు సమర్పించాలి.

శ్రీ లక్ష్మి నృసింహా స్వామి వారిని ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధించవచ్చు.

నరసింహ స్వామి వారి కళ్యాణం చేయించాలి.

కుజ గ్రహ శ్లోకాన్ని 7 సార్లు మరియు గురుగ్రహ శ్లోకాన్ని 16 సార్లు రోజు పఠించాలి.

అవసరం అయితే కుజగ్రహ జపం, శాంతి హోమం జరిపించాలి.

ప్రతిరోజూ శ్రీ లక్ష్మి నృసింహ కరావలంబ స్తోత్రం లేదా సహస్రనామ స్తోత్రమ్ చదవాలి.

11 మంగళ వారాలు సుబ్రహ్మణ్య స్వామిని అన్నీ నియమాలతో పూజించాలి.



మొదలైన పరిహారాలు పాటిస్తే కుజ దోష పరిహారం జరుగుతుంది.


జాతకంలో ఉన్న కుజదోష బలాన్ని బట్టి పరిహారాలను పాటించాలి.

దీనికై అనుభవం మరియు పూర్తి శాస్ర జ్ణానం

ఉన్నదైవజ్ఞుని సంప్రదించాలి...


సూర్యదేవర వేణుగోపాల్ M.A  జ్యోతిష్యం 

సుందరయ్య నగర్    మధిర      ఖమ్మం జిల్లా తెలంగాణా
507203

venusuryadevara@gmail.com