Sunday, 26 November 2017

వాస్తు సందేహాలు- సమాధానాలు



1. నైరుతి లోనే బెడ్ రూమ్ ఉండాలా? ఎక్కడైనా ఉండవచ్చా?

జ. బెడ్రూం కు దక్షిణ, పడమర,  ఇంకా నైరుతి దిశలు మంచివి. ఈశాన్యం లో కూడా బెడ్ రూమ్ ఉంచవచ్చు. చిన్నపిల్లలకు ఈశాన్యం బెడ్రూం ఉంచవచ్చు. వాయవ్య దిశ నందు కూడా బెడ్రూం ఉంచవచ్చు. ఇది కూడా మంచి దిక్కే. అయితే నైరుతి నందు బెడ్రూం కంటే స్టోర్ రూమ్ మంచిది. ఈ దిశలో స్టోర్ రూమ్ ఉంటే దక్షిణ పడమరలందు బెడ్రూం ఉంచవచ్చు. ఆగ్నేయం నందు బెడ్ రూమ్ మంచిది కాదు.

2. దక్షిణ ముఖంగా గృహాన్ని కట్టవచ్చా? చాలామంది మంచిది కాదు అని అంటారు కదా,,,,

జ. దిక్కులన్నీ మంచివే. ఒక్కొక్క దిశకు ఒక్కొక్క గుణం ఉంది. దానిని తెలుసుకొని వాస్తును పాటించాలి. దక్షిణ ముఖంగా చక్కగా గృహాన్ని నిర్మించుకోవచ్చు. భయం అక్కరలేదు.

3. పశువుల శాలలకు ఏ దిశ మంచిది?.

జ. వాయవ్యం దిశ పశువుల కొష్టాలకు శ్రేష్టం.

4. గృహాలకు, పరిశ్రమలకు, ఇంకా దేవాలయాలకు వాస్తు పద్దతులలో భేదం ఉందా?

జ. అన్నిటికి ఒకే విధమైన వాస్తు పనిచేయదు. కట్టడంలో చేసే కార్యాన్ని అనుసరించి వాస్తుని అమలు చేయాలి. అప్పుడే మంచి ప్రయోజనాలు ఉంటాయి. గృహవాస్తుకు పరిశ్రమల వాస్తుకు భేదం ఉంది. ఆలయాలకు గృహ వాస్తును పాటించకూడదు. ఆలయాలను  తప్పనిసరిగా ఆగమ శాస్త్రం అనుసరించి నిర్మించాలి. గృహవాస్తుకు ఆలయ వాస్తు కు చాలా భేదం ఉంది.

5. వర్గు నియమం మంచిదేనా?

జ. మంచి సమన్వయంతో వర్గు ను పాటిస్తే అద్భుత ఫలితాలుంటాయి

6. ఆయమ్ పాటించి గృహాన్ని నిర్మించాలా?

జ. సరైన పద్దతిని పాటించి మంచి ఆయాది గణితంతో గృహాన్ని నిర్మించాలి. అప్పుడే వాస్తు ఫలితాలు ఉంటాయి.

7. నైరుతి కట్ అయిన స్థలం మంచిదేనా?

జ. అన్నీ దిశలు ఉన్నప్పుడే మంచి ప్రయోజనాలుంటాయి. నైరుతి దిశ కట్ అయిన స్థలం మంచిది కాదు.

8. నీటి వాడ కానికి ఏ దిశ మంచిది?

జ. వాయవ్య దిశ చాలా మంచిది

9. కార్ పార్కింగ్ షెడ్ ఎక్కడ వేయవచ్చు?

జ. ఈశాన్యం మినహా ఎక్కడైనా వేయవచ్చు. అయితే సరైన పారులను గమనించాలి.

10. ఏ దిశ ముఖంగా కూర్చుని విద్యనభ్యసించాలి?

జ. తూర్పు, ఉత్తర దిశల అభిముఖంగా కూర్చుని విద్యనభ్యసించాలి.



venusuryadevara@gmail.com

సూర్యదేవర వేణుగోపాల్. M.A (జ్యోతిష్యం)
H. NO. 1-879
సుందరయ్య నగర్    మధిర    
ఖమ్మం జిల్లా 507203
ఖమ్మంజిల్లా.

Monday, 13 November 2017

దక్షిణం అంటే భయమెందుకు?

దక్షిణం అంటే భయం ఎందుకు?

 ఈ రోజుల్లో దక్షిణం దిశ మీద చాలా అపోహలు ప్రజలలో ఉన్నాయి. ఇప్పటి వాస్తు పండితులు కూడా దక్షిణ దిశ పై లేనిపోని భయాలను, అపోహలను పెంచుతున్నారు. వాస్తవం ఏమిటంటే వాస్తు లో అన్ని దిశలకు దేనికుండే లాభ నష్టాలు వాటికున్నాయి.. అయితే  పరిస్థితులకు అనుగుణంగా దిశలను సరిచేసి కట్టడాలను నిర్మించాలి. దిక్కుల యొక్క లక్షణాలు వాటి పరిమితులను తెలుసుకొని వాస్తు సూత్రాలను పాటించాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. అంతే కాని ఒక దిశ మంచిదని ఇంకొక దిశ మంచిది కాదని వర్గీకరించకూడదు.
దక్షిణ దిక్కు చాలా బలమైన దిక్కు. దీని అధిపతి యముడు. నవగ్రహాలలో కుజ గ్రహం ఈ దిక్కునకు ఆధిపత్యం కలిగి ఉంటాడు. మన కర్మల ఫలాలను ఈ దిశ మనకు అందిస్తుంది.  ఈ దిక్కును సరియైన రీతిలో వినియోగించుకుంటే సత్వర అభివృద్ది తధ్యం. ఈ దిక్కును వినియోగించుకోవడంలో పొరపాట్లు జరిగితే అనేక నష్టాలు కలిగే ప్రమాదం ఉంది. సరియైన రీతిలో దక్షిణ దిక్కును ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం.
దక్షిణం ను సరిగ్గా ఉంచితే చాలా మంచి ఫలితాలు త్వరగా కలుగుతాయి. ముందుగా గృహ ప్రాంగణంలో దక్షిణ దిక్కును మెరకలో ఉంచాలి. ఉత్తరం కన్నా దక్షిణం మెరకగా ఉంటే ధనలాభం ఆరోగ్యం తప్పక కలుగుతాయి. దక్షిణ దిక్కును ఎప్పుడు పల్లంగా ఉంచరాదు. ఈ శ్లోకాన్ని గమనించండి......

నశ్యన్తి పురుషా స్తత్ర దేవతాచ ప్రణశ్యతి
ధన హానింకరో తధా నిత్యం రోగ కృ దక్షిణ ప్లవ
   అపరాజిత పృచ్చ
దక్షిణ దిశ పల్లంగా ఉంటే ధన నష్టం రోగాలు కలుగుతాయి అని దీనర్థం. దేవతలు కూడా ఇటువంటి స్థలాలలో ఉంటే నశిస్తారు  అని అపరాజిత పృచ్చ అనే ప్రాచీన వాస్తుగ్రంధం తెలుపుతుంది.  కనుక దక్షిణ దిక్కును ఎత్తులో ఉంచితే ఆరోగ్యం, ధనం సులభంగా ప్రాప్తిస్తాయి.  కనుక దక్షిణ దిక్కును ఫ్లోరింగ్ లోనూ, నిర్మాణం లోనూ ఎత్తులో ఉంచితే అనేక లాభాలు కలుగుతాయి.  కాబట్టి ఈ దిక్కును ఎత్తులో ఉంచినంత వరకు దక్షిణ దిక్కు ను గురించి భయపడనక్కర లేదు.

య, ర, ల, వ  అనే అక్షరాలతో పేరు ప్రారంభం అయ్యే వారికి దక్షిణ  ఫెసింగ్ చాలా బాగా కలిసి వస్తుంది. ఈ అక్షరాల తో ప్రారంభం అయ్యేపేరు గల  వ్యాపారాలు కూడా దక్షిణ ఫెసింగ్ లో ఉంటే బాగా సాగుతాయి.  అయితే దక్షిణం లో వేరే దోషాలు లేకపోతే ఈ అక్షరాల వారికి అద్భుతుంగా కలిసి వస్తుంది.  దక్షిణ ఫెసింగ్ లో ఉండటం అంటే ఉత్తరం లో నివసించినట్లే. అంటే రోడ్ దక్షిణం ఉంటుంది . వ్యాపార సంస్థలు రోడ్ కు ఉత్తరం లో ఉంటాయి. అంటే కుబేర స్థానంలో వ్యాపారాలు ఉంటాయి కాబట్టి అవి బాగా సాగి మంచి లాభాలు వస్తాయి. కిరాణా దుకాణాలు, హోటల్స్ ఇంకా నిత్యవసర వస్తు దుకాణాలు బాగా సాగుతాయి. ఈ సూత్రం య,ర, ల, వ అక్షరాల వారికి వర్తిస్తుంది. ఈ రహస్యం తెలియక చాలామంది దక్షిణ ముఖంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ఇష్టపడరు. భయపడతారు. దక్షిణంలో ఇతర దోషాలు లేనంతవరకు ఈ ముఖంగా వ్యాపారాలు ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయి. ఇది అనుభవ పూర్వకం గా తెలుసు కున్న సత్యం.
గృహంలో దక్షిణ దిక్కులో ఏ గది ఉంచాలో మన ప్రాచీన వాస్తు గ్రంధాలు తెలియజేశాయి. 
దక్షిణేచైవ శయనం .......... సనత్ కుమార సంహిత
అంటే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న బెడ్రూం దక్షిణంలో ఉండాలని సనాత్కుమార సంహిత  తో పాటు అనేక ప్రాచీన వాస్తు గ్రంధాలు  తెలియజేశాయి. అయితే ఇప్పుడు మనం బెడ్రూం లను నైరుతిలో ఉంచుతున్నాము.  ఇది తప్పు లేదుకాని,  వీటిని దక్షిణంలో ఉంచితే ఇంకా మరిన్ని ప్రయోజనాలు తప్పక కలుగుతాయి. బెడ్ రూమ్ లను నైరుతి లో కన్నా దక్షిణ దిశలో ఉంచితే తప్పనిసరిగా మంచి ఆరోగ్యం కలుగుతుంది. సందేహం లేదు.  అయితే దక్షిణంలో తప్పనిసరిగా కిటికీ ఉంచాలి. అప్పుడు మాత్రమే అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. 
బరువులను మోసే దిశ దక్షిణం కనుక ఈ దిశలో ఎక్కువ బరువైన వస్తువులను ఉంచాలి. దక్షిణ నైరుతిలో స్టోర్ రూమ్ వేసి ఎక్కువ బరువులను ఉంచితే అద్భుతమైన ఫలితాలు తప్పక కలుగుతాయి.  
దక్షిణం పల్లంగా ఉండకూడదు కాబట్టి బావులు కానీ గుంటలు కానీ ఉంచరాదు. ఈ దిశలో బొర్స్ కానీ బావులు కానీ ఉంటే ఆకస్మిక ప్రమాదాలు,ఆరోగ్య ఆర్ధిక సమస్యలు వస్తాయి. ఇంకా ప్రమాదాలలో అంగవైకల్యం కలిగే వీలుంది.
స్త్రీకలహా స్త్రీ దౌష్ట్యం ..........  బృహత్ సంహిత...
దక్షిణంలో బావులుంటే స్త్రీ నాశనం, స్త్రీలకు సమస్య  అని బృహత్ సంహిత తెలియ జేస్తుంది..

గృహంలో దక్షిణ దిక్కును ఎత్తులో ఉంచాలని చాలామంది ఇంటి లోపలి భాగం కన్నా బయట  ఫ్లోరింగ్ ( అంటే ప్రహరికి, ఇంటికి మధ్య వదలిన ఖాళీస్థలం) ఎత్తులో ఉంచుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ విధమైన అమరిక వలన ధనం బాగా ఖర్చు అవుతుంది.  కనుక దక్షిణం ను గృహంలో కన్నా కొంచెం పల్లంలో ఉంచి ఉత్తరం కన్నా ఎత్తులో ఉంచాలి.  అప్పుడు మాత్రమే ఈ దిశ నుండి మంచి ఫలాలు లభిస్తాయి.  

గృహం లో కానీ ఇంకా ఏ  నిర్మాణం లో నైనా దక్షిణ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం వదలి నిర్మాణం చేపట్టాలి. దక్షిణం కన్నా ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ ఉంచి నిర్మాణం చేయాలి.
దక్షిణం వైపు అసలు ఖాళీ స్థలం వదలకుండా నిర్మాణాలు చేయకూడదు. నిర్మాణాలకు 4 ప్రక్కల ఖాళీ తప్పనిసరిగా ఉంచాలి. దక్షిణం వైపు ఇంటిని ఖాయం చేసి అంటే ఖాళీ స్థలం వదలకుండా నిర్మిస్తే గృహస్తుకు అనేక సమస్యలు వస్తాయి. చాలామంది దక్షిణం వైపు ద్వారాలను ఉంచడానికి భయపడతారు. ఇది అర్ధం లేని భయం మాత్రమే. నిరభ్యంతరంగా దక్షిణం వైపు ద్వారాన్ని అమర్చవచ్చు. అదే విధంగా దక్షిణ దిశలో కిటికీ తప్పనిసరిగా ఉండాలి.  దక్షిణంలో కిటికీ లేని గృహం రోగ గృహం.
కన్య, మకర, మిథున రాశులవారికి దక్షిణం సింహద్వారం శ్రేష్టం. ఇది గమనించండి...
కన్యా మకర యుగ్మానామ్ దక్షిణ ద్వారా మిష్టదమ్........... జ్యోతిర్నిబంధం
జ్యోతిర్నిబంధం అనే ప్రాచీన గ్రంధం  కన్య,  మకర మరియు మిధున రాశులవారికి దక్షిణ సింహద్వారం మంచిదని సూచిస్తుంది.  కనుక భయం లేకుండా దక్షిణ ద్వారం అమర్చవచ్చు.

ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమంటే, దక్షిణ దిశ చాలా బలమైనది. ఫలితాలను వెంటనే చూపిస్తుంది. ఈ దిశను వాస్తు ప్రకారం కరెక్ట్ గా ఉంచినట్లైతే భయపడనవసరం లేదు. ఈ దిశను మెరకగా ఉంచి, బావులు, సంప్స్ లేకుండా, ఇంకా తక్కువ స్థలం వదిలి నిర్మాణాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అంతే కానీ అసలు ఈ దిక్కు మంచిది కాదని నిర్ణయించి నిర్మాణాలు చేస్తే ప్రగతి లోపిస్తుంది. అన్ని దిక్కులను సమన్వయం చేసి ఉపయోగించుకుంటేనే మంచి అభివృద్ది సాధ్యం. అందుచేత సరియైన వాస్తు సూత్రాలను పాటించి దక్షిణంను సరియైన రీతి లో ఉపయోగించుకోవాలి అప్పుడు మాత్రమే మంచి ఆరోగ్యం, మంచి సంపద లభిస్తాయి.
 సూర్యదేవర వేణుగోపాల్. M.A. (జ్యోతిష్యం)
మధిర  ఖమ్మం జిల్లా.


venusuryadevara@gmail.
సూర్యదేవర వేణుగోపాల్  
ఇంటి నెం  1-879
సుందరయ్య నగర్  మధిర
ఖమ్మం జిల్లా

Monday, 30 October 2017

కార్తీక పౌర్ణిమ 03-11-2017


హెవలంబి నామ సం|ర లో కార్తీక పౌర్ణిమ 

ది 03 నవంబరు 2017 రోజున చేయాలి.

పౌర్ణిమ 03 వ తేదీ మ. 12:50 ని.లకు ప్రవేశిస్తుంది.

04 నవంబరు  ఉ.11;19 వరకు ఉంటుంది.

రాత్రి సమయం, లో పౌర్ణిమ 3 వ తేదీ లో ఉన్నది కాబట్టి

03 వ తేదీ సాయంత్రం వత్తులు వెలిగించాలి. కార్తీక పౌర్ణిమను ఆచరించాలి.

జ్వాలాతోరణం, 365 వత్తులు, 33 పున్నముల నోము లను 03 వ తేదీ సాయంత్రం నుండి ఆచరించాలి.

కేదారేశ్వర నోములను 04 వ తేదీ నందు ఆచరించాలి.

సద్గురు గురునానక్ జయంతిని 04 వ తేదీ న ఆచరించాలి..



సూర్యదేవర వేణుగోపాల్. M. A. జ్యోతిష్యం

సుందరయ్య నగర్. మధిర  ఖమ్మం జిల్లా  తెలంగాణా.

Saturday, 9 September 2017

Suryadevara Venugopal: 27-09-2017 సరస్వతి పూజ

Suryadevara Venugopal: 27-09-2019 సరస్వతి పూజ: శ్రీ హేవళంబి నామ సం|రం లో సరస్వతి పూజను ది.27-09-2017 శ్రీ ఆశ్వియుజ శుద్ద సప్తమి బుధవారం రోజున చేయాలి. ఉదయం గం| 09:20 ని| ల తరువాత సరస్వతి ...

27-09-2017 సరస్వతి పూజ

శ్రీ హేవళంబి నామ సం|రం లో సరస్వతి పూజను ది.27-09-2017 శ్రీ ఆశ్వియుజ శుద్ద సప్తమి బుధవారం రోజున చేయాలి. ఉదయం గం| 09:20 ని| ల తరువాత సరస్వతి పూజను ఆచరించాలి.

కొంతమంది 28-09-2017 గురువారం శుక్ల అష్టమి రోజున సరస్వతి పూజను చేయాలి అని చెపుతున్నారు. కానీ ఈ రోజున దుర్గాష్టమి ని ఆచరించాలి.

కనుక సరస్వతి పూజను ది. 27-09-2017 ఉదయం 09:గం| 20 ని|ల  తదుపరినుండి  చేసుకొనుట ఉత్తమం. అక్షరాభ్యాసం కూడా  09:20 తదుపరి చేసుకోవచ్చు.

Sunday, 20 August 2017

21-08-2017 సూర్య గ్రహణం

ది.21-08-2017  సోమవారం  శ్రీ హేవళంబి నామ స|ర  శ్రావణ అమావాస్య సంపూర్ణ సూర్యగ్రహణం.

అయితే ఇది భారత దేశం లో ఎక్కడ గోచరించదు. కనుక  మనం ఎటువంటి నియమాలు పాటించనవసరం లేదు.

ఈ గ్రహణం అమెరికా  పసిఫిక్ మహాసముద్రం ఇంకా ఆఫ్రికా లో పాక్షికంగా కనిపిస్తుంది.

అమెరికా లో నివసించే తెలుగు ప్రజలు గ్రహణ నియమాలు పాటించాలి.

భారత దేశంలో ఎక్కడా కనిపించదు కాబట్టి  మనం ఎటువంటి నియమాలు పాటించనక్కర లేదు.

ఈ గ్రహణ ప్రభావం వలన రానున్న రోజులలో అమెరికాలో రాజకీయ పరమైన సమస్యలు రావోచ్చు. ఇంకా అనేక మార్పులు సమస్యలు అమెరికా దేశానికి రాగల అవకాశం ఉంది.


సూర్యదేవర వేణుగోపాల్  M.A జ్యోతిష్యం
మధిర ఖమ్మం జిల్లా
venusuryadevara@gmail.com

Saturday, 5 August 2017

07 వ తేదీ రాఖీ పండుగ చేసుకోవచ్చా?

ఆగష్టు 7 వ తేదీ రాఖీ పండుగ.  అదే రోజు చంద్రగ్రహణం ఉంది. అందువల్ల చాలా మంది రాఖీ పండుగ రోజు గ్రహణం ఉంది కదా పండుగ చేసుకోవచ్చా? లేదా అని చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు....


చంద్రగ్రహణం 7 వ తేదీ రాత్రి ఉంది.   రాఖీ పండుగ ఉదయం చేసుకోవచ్చు. తప్పులేదు. ఉదయం 11 గ|ల వరకు రాఖీ పండుగ చేసుకోవచ్చు. తప్పులేదు.

కనుక సందేహం లేకుండా 7 వ తేదీ ఉదయం వరకు 11 గ|ల వరకు రాఖీ పండుగ చేసుకోవచ్చు.


సూర్యదేవర వేణుగోపాల్  M.A  జ్యోతిష్యం

సుందరయ్య నగర్  మధిర.....ఖమ్మం జిల్లా 

Friday, 4 August 2017

Suryadevara Venugopal: 07-08-2017 చంద్రగ్రహణం

Suryadevara Venugopal: 07-08-2017 చంద్రగ్రహణం: శ్రావణ శుక్ల పౌర్ణిమ సోమవారం ది.07-08-2017 చూడామణి నామం కల కేతుగ్రస్త చంద్ర గ్రహణం....ఇది పూర్తిగా భారతదేశం అంతటా గోచరిస్తుంది...... స్పర...

07-08-2017 చంద్రగ్రహణం

శ్రావణ శుక్ల పౌర్ణిమ సోమవారం ది.07-08-2017 చూడామణి నామం కల కేతుగ్రస్త చంద్ర గ్రహణం....ఇది పూర్తిగా భారతదేశం అంతటా గోచరిస్తుంది......

స్పర్శ కాలం       రాత్రి 10:52 నిలకు
మధ్యకాలం         రాత్రి 11:50 నిలకు
మోక్ష కాలం         రాత్రి 12:49 నిలకు.

గ్రహణ పుణ్యసమయం  1 గం-57 ని....
గ్రహణం శ్రవణా నక్షత్రం లో పడుతుంది.... మకర రాశి వారు చూడరాదు.
అన్ని నియమాలు అందరూ పాటించాలి.

మంత్ర ఉపదేశం పొందినవారికి మంచి కాలం. సాధకులకు మంచి అవకాశం.


సూర్యదేవర వేణుగోపాల్  ఏం ,ఏ   జ్యోతిష్యం

H.NO.1-879, సుందరయ్య నగర్  

మధిర   ఖమ్మం జిల్లా   తెలంగాణా 

Thursday, 3 August 2017

Suryadevara Venugopal: దంతావధానం ఏ విధంగా చేయాలి?

Suryadevara Venugopal: దంతావధానం ఏ విధంగా చేయాలి?: దంతవధానం లేకుండా చేసే పూజా, జపాలు వ్యర్ధం. మంచి ఆరోగ్యం కోసం దంతావధానం తప్పక చేయాలి.  మన ప్రాచీన హైందవ గ్రంధాలు దంతావధానం ఏ విధంగా చేయాలి  ...

దంతావధానం ఏ విధంగా చేయాలి?

దంతవధానం లేకుండా చేసే పూజా, జపాలు వ్యర్ధం. మంచి ఆరోగ్యం కోసం దంతావధానం తప్పక చేయాలి.  మన ప్రాచీన హైందవ గ్రంధాలు దంతావధానం ఏ విధంగా చేయాలి  ఏ యే పుల్లలతో చేయాలి అనే విషయాలను చక్కగా వివరించాయి. వీటిని పాటిస్తే మంచి తప్పక జరుగుతుంది.....

ప్రాగ్ముఖస్య ధృతిఃసౌఖ్యం  శరీర ఆరోగ్య మేవచ .......      గర్గ సంహిత

ఈశానాభిముఖః కుర్యాద్వాగ్యతో  దంతావధానం..........    జాతుకర్ణ్య


వీటి అర్ధం ఏమంటే  ఎల్లప్పుడు తూర్పు తిరిగి కానీ, లేదా ఈశాన్యం వైపు తిరిగి కానీ దంతావధానం చేయాలి.. ఈ విధంగా చేస్తే మంచి ఆరోగ్యము, సుఖం లభిస్తాయి.

ఉత్తరం వైపు తిరిగి కూడా దంతావధానం చేయవచ్చు.   మంచి ఆరోగ్యం సిద్దిస్తుంది..

దంతావధానం ఎప్పుడు దక్షిణం, పడమర ల వైపు తిరిగి చేయకూడదు,

 పశ్చిమే   దక్షిణే చైవ కుర్యాద్ధంత ధావనం ......    పద్మపురాణం......


చండ్ర, కానుగ, మేడి, మర్రి, చింత, వెదురు, మామిడి, వేప, ఉత్తరేణి, మారేడు, జిల్లేడు, కడిమి, రేగు, తుమికి   మొదలగు పుల్లలతో దంతావధానం చేయడం మంచిది.  నేటి కాలంలో వేప పుల్ల ఎక్కువ ప్రాముఖ్యతను పొందింది.

కుశమ్ కాసం పలాసం చ శింశపమ్ యస్తు భక్షయేత్
తావద్భవతి  చాండాలో యావద్ గంగాం నపస్యాత్   

 ఆచార మయూఖం.....

అంటే మోదుగ, మునగ, ప్రత్తి, దర్భ,గడ్డి, కుంకుడు మొదలగు పుల్లలతో  దంతావధానం చేయరాదు..

ఇంకా సూర్యోదయానికి ముందే దంతావధానం మంచిది.  ఆహారం తీసుకొన్న ప్రతిసారి నోటిని పుక్కిలించాలి.....

ప్రతి రోజు 2 సార్లు అంటే ఉదయం  సాయంత్రం దంతావధానం చేయాలని అనేక గ్రంథాలు చెప్పాయి......



సూర్యదేవర వేణుగోపాల్.  ఏం. ఏ   జ్యోతిష్యం.

ఇంటి నంబరు..... 1-879

సుందరయ్య నగర్  మధిర    ఖమ్మం జిల్లా

తెలంగాణా  507203
venusuryadevara@gmail.com

Friday, 30 June 2017

Suryadevara Venugopal: ఏ దేవతని ఏయే పుష్పాలతో పూజించాలి......

Suryadevara Venugopal: ఏ దేవతని ఏయే పుష్పాలతో పూజించాలి......: సూర్యుని, గణపతిని తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే వారి అనుగ్రహం సత్వరమే లభిస్తుంది. శ్రీ హరిని తులసి దళాలతో పూజిస్తే ఇష్ట కామ్య సిద్ది ల...

Suryadevara Venugopal: ఏ దేవతని ఏయే పుష్పాలతో పూజించాలి......

Suryadevara Venugopal: ఏ దేవతని ఏయే పుష్పాలతో పూజించాలి......: సూర్యుని, గణపతిని తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే వారి అనుగ్రహం సత్వరమే లభిస్తుంది. శ్రీ హరిని తులసి దళాలతో పూజిస్తే ఇష్ట కామ్య సిద్ది ల...

ఏ దేవతని ఏయే పుష్పాలతో పూజించాలి......

సూర్యుని, గణపతిని తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే వారి అనుగ్రహం సత్వరమే లభిస్తుంది.
శ్రీ హరిని తులసి దళాలతో పూజిస్తే ఇష్ట కామ్య సిద్ది లభిస్తుంది. ధన ప్రాప్తి కోసం మహాలక్ష్మి ని తామర పూలతో పూజించాలి.

గాయత్రి దేవిని మందార, కొండమల్లే, దర్భపూలగుత్తులు, జిల్లేడు, కదంబ, పున్నాగ, చంపక, గరిక పుష్పాలతో పూజిస్తే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. 

సకల మనోభీష్ట సాధన కోసం  శ్రీచక్రమును తామర పూలు, తులసి దళాలు, కలువలు,  జాజి, మల్లె, గన్నేరు, ఎర్ర కలువలు , పుష్పాలతో పూజించాలి.

శివ పరమాత్మ అనుగ్రహం కోసం లేత బిల్వ దళాలతో అర్చించాలి. 

నిత్య పూజకు, నిత్య మల్లె, గరుడవర్ధనం, ఎర్ర గన్నేరు, మంకెనపూలు, పద్మాలు, పారిజాతం, మాలతి, కనకాంబరాలు, నీలాంబరాలు, మందారం, నందివర్ధనం, చేమంతి, జాజి, కలువ పూలు మంచివి......వీటిని ఏ దేవతకైనా సమర్పించవచ్చును........


చేయకూడనివి....

శ్రీమహావిష్ణువును అక్షితలతో పూజించరాదు. దుర్గా దేవికి గరిక ను సమర్పించరాదు. మారేడు తో సూర్య భగవానుని పూజించరాదు.   సరస్వతి ని తమాల పూలతో పూజించరాదు. జిల్లేడు మరియు గన్నేరు పుష్పాలను లక్ష్మి దేవికి సమర్పించకూడదు. మొగలి పూలతో శివభగవానుని 
పూజించరాదు..........


సూర్యదేవర వేణుగోపాల్  M. A   జ్యోతిష్యం.

H. NO-  1-879

సుందరయ్య నగర్      మధిర      ఖమ్మం జిల్లా 

venusuryadevara@gmail.com

Tuesday, 20 June 2017

Suryadevara Venugopal: ధర్మసందేహాలు- సమాధానాలు 3

Suryadevara Venugopal: ధర్మసందేహాలు- సమాధానాలు 3: 21. గర్భవతులు  ఎప్పటివరకు వైదిక కార్యక్రమాలు చేయకూడదు? 5 వ మాసం నిండినప్పటి నుండి వైదిక కార్యక్రమాలు చేయకూడదు. గృహ శంఖుస్థాపన, వంటి క్రతు...

ధర్మసందేహాలు- సమాధానాలు 3

21. గర్భవతులు  ఎప్పటివరకు వైదిక కార్యక్రమాలు చేయకూడదు?

5 వ మాసం నిండినప్పటి నుండి వైదిక కార్యక్రమాలు చేయకూడదు. గృహ శంఖుస్థాపన, వంటి క్రతువులు చేయరాదు.  అయితే దైవానికి సంబంధించిన స్తోత్రాలు చదవవచ్చు.


22. గతించిన పెద్దలకు శ్రాద్ద కర్మలు చేయాలా?

తప్పనిసరిగా చేయాలి. పిండ ప్రదానం చేస్తే మంచిది. అలా చేయలేని వారు పితృ తిథి రోజు బ్రాహ్మణునకు స్వయం పాకం ఇవ్వాలి. అసలు చేయకుండా ఉండకూడదు.


23. పితృ దేవత శ్రాద్ద కర్మలు ప్రతి సం|రం వారు మరణించిన తేదీ రోజు చేయవచ్చా?

అలా చేయకూడదు. వారు మరణించిన తిథి రోజు చేయాలి. చాంద్రమానంను పాటించాలి.


24. మా మనవడు అక్షరాభ్యాసం మొన్న చేశాము. అయ్యగారు మొదటగా ఓం నమ శివాయా అనే పదముతో అక్షరాభ్యాసం  చేశారు. సరస్వతి దేవి పేరు తర్వాత రాశారు. ఈ విధంగా చేయవచ్చా?


సకల విద్యలకు మూలమై వెలుగొందువారు శివ పరమాత్మ, ఆయన లేనిది ఈ జగమే లేదు. మీ అయ్యగారు సరిగానే అక్షరాభ్యాసం చేశారు. ఆందోళన పడవద్దు.


25. పెళ్లి సమయంలో ఉపనయనం  మంచిదేనా?

ఉపనయనం చిన్నప్పుడే చేయాలి.  ఇప్పుడు వివాహ సమయంలో నామ మాత్రంగా చేస్తున్నారు. ఇది మంచిది కాదు.  చిన్నప్పుడే చేయడం మంచిది.


26. గృహం లో ఇంకుడు గుంతలు ఎటువైపు ఉంచాలి?


ఇంకుడు గుంతలు ఈశాన్యంలో గాని ఉత్తరం లో గాని తూర్పు న గాని ఉంచుకోవచ్చు...


27. మా ఇంటికి సింహా ద్వారం ఈశాన్యం లో లేదు. తూర్పు మధ్యలో ఉంది. ఈ విధంగా ఉంచవచ్చా?


ఉంచుకోవచ్చు. అయితే గృహ మధ్యభాగంలో సింహా ద్వారం ఉంటే దర్వాజాకు రెండు వైపులా కిటికీలు ఉంచాలి....


28. మహా భారతంలో ద్రౌపది కర్ణుని 6 వ భర్తగా కోరుకుందని చాలామంది అభిప్రాయం. ఇంకా సినిమాలలో కూడా చూపించారు.... నిజంగా ద్రౌపది కర్ణుని 6 భర్తగా పొందాలని కోరుకుందా?


నిజంగా ఈ అభిప్రాయం చాలా తప్పు.  వ్యాస భారతంలో అసలు ఈ ప్రస్తావన లేదు. అసలు ఈ విషయాన్ని ఎవరు ప్రచారం చేశారో తెలియదు.... వ్యాసభారతం ప్రకారం ద్రౌపది కర్ణుని 6 వ భర్తగా పొందాలని  ఆలోచించలేదు.. 


29. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణంను కౌరవులలో వ్యతిరేకించింది ఎవరు?

వికర్ణుడు. దుర్యోధనుని సోదరుడు. కౌరవుల 100 మంది సోదరులలో వికర్ణుడు ఒకడు. ద్రౌపది ని అవమానించడానికి కౌరవులకు అధికారం లేదని వాదించాడు.....


30. వేదాలు నాలుగు అంటారు మరి పంచమవేదం అంటే ఏమిటి.?

వేదాలు నాలుగే... మహాభారతాన్ని పంచమవేదం అని అంటారు.  మానవులు భారతం నుండి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అందుకే పంచమవేదం  అయింది.








సూర్యదేవర వేణుగోపాల్  M. A  (జ్యోతిష్యం)

H. NO    1-879   సుందరయ్య నగర్ 

మధిర   ఖమ్మం జిల్లా  తెలంగాణా

venusuryadevara@gmail.com

Saturday, 3 June 2017

ధర్మ సందేహాలు- సమాధానాలు 2








11. నేను వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. ప్రస్తుతం అనేక ఆర్ధిక ఆరోగ్య సమస్యలతో కొన్ని ఏళ్ళు గా బాధపడుతున్నాను. ఎవరో చెపితే ప్రతిరోజూ శ్రీలలిత సహస్రనామ స్తోత్రం చదువుతున్నాను. ఫలితం లేదు. యజుర్వేద సంధ్యావందనం  కొంతకాలం చేసి మానివేశాను ఇప్పుడు బాబాగారికి పూజా చేస్తున్నాను. పరిష్కారం చూపగలరు.

సంధ్యావందనం మానివేయడం ఘోరమైన తప్పు. మీరు సంధ్యావందనం జీవితాంతం తప్పనిసరిగా చేయాలి. సంధ్యావందనం చాలా పవిత్రమైన క్రియ. చతుర్విధ పురుషార్ధాలను  ప్రసాదిస్తుంది. సంధ్యావందనం మానివేయడం పాపం. సంధ్యావందనం చేయకుండా మీరు యే పూజ చేసినప్పటికీ ఫలితం శూన్యం. సంధ్యావందనం చేసిన తరువాత మీరు యే పూజ చేసినప్పటికీ మంచిఫలితాలు వస్తాయి. సంధ్యావందనం చేస్తే మీకు సమాజానికి తప్పనిసరిగా మంచి జరుగుతుంది. మీరు సంధ్యావందనం చేసిన తరువాత  మీ గురువుగారు చెప్పిన పూజలను చేయండి తప్పని సరిగా సమస్యల నుండి బయట పడతారు


12. కురుక్షేత్ర యుద్దానికి కారణమైన శకుని ఎవరి కుమారుడు? శకుని వివరాలు తెలపండి.

శకుని గాంధారి సోదరుడు.  గాంధార రాజు యైన సుబలుని  కుమారుడు. శకుని పుత్రుడు ఉలూకుడు. ధుర్యోధనునికి  మేనమామ.

13. తల ఎటువైపు పెట్టి నిద్రించాలి?

తల దక్షిణం మరియు తూర్పు వైపు ఉంచి నిద్రించాలి.  పరాయి గృహంలో పడమర వైపు తల ఉంచి నిద్రించాలి. ఉత్తరం వైపు అసలు తల పెట్టి నిద్రించ కూడదు

14. జీవులకు ఉన్న ప్రాణాలను పంచ ప్రాణాలంటారు కదా వాటి పేర్లు చెప్పండి.

ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన  ప్రాణాలే జీవులకు గల పంచ ప్రాణాలు.

15. గృహం లో తులసి మొక్కను ఏ వైపు ఉంచాలి.?

గృహంలో తులసి మొక్కను ఎటువైపు అయిన ఉంచవచ్చు. అయితే దర్వాజకు ఎదురుగా ఉంచాలి. ఇంటి గర్భంలో తులసి వీక్షణ ఉండేలాగా ఉంచితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

16. గృహం కట్టేటప్పుడు అన్నీ సరి సంఖ్య లో ఉండాలని చెప్తారు కదా. పిల్లర్స్ కూడా సరి సంఖ్య లో నే ఉండాలా?

దర్వాజాలు, కిటికీలు మాత్రమే సరిసంఖ్య చూడాలి. పిల్లర్స్ కు ఆ నియమం లేదు. అవసరాన్ని బట్టి పిల్లర్స్ వేసుకోవాలి. పిల్లర్స్ సరిసంఖ్యలో ఉండాల్సిన అవసరం లేదు.

17. నాగ దోషానికి కొంతమంది మానసా దేవి పూజ మంచిదని మరికొంత మంది సుబ్రహ్మణ్య పూజ మంచిదని చెప్తారు. ఏది మంచిది.

2 పూజలు మంచివే. అయితే కాలసర్పదోషం ఉన్నప్పుడూ ఈ 2 పూజలు చేసినట్లైతే మంచి ఫలితం ఉంటుంది. ఏదైనా పూర్ణ విశ్వాసం తో చేస్తే మంచి ఫలాలు వస్తాయి.

18.  జాతక దోషాలకు జపాలు చేయించడం మంచిదా లేక పూజ మంచిదా.

అన్ని దోషాలకు జపాలు అవసరం లేదు. తీవ్ర దోషాలకు అవసరం. అయితే ఎవరికి వారు వారి 
జాతకానికి అనుకూలమైన దైవానికి పూజ చేసుకోవడం మంచిది.

19 అన్ని పేర్లు న్యూమరాలజీ ప్రకారం సవరించుకోవాలా? 

నేమ్ కరక్షన్ అన్ని పేర్లకు అవసరం లేదు. అనవసరంగా Name కరక్షన్ చేస్తే మంచి జరగక పోగా నష్టం జరిగే అవకాశం ఉంది.

20. నక్షత్రాల ప్రకారం పేర్లు పెట్టుకోవడం మంచిదేనా?

నక్షత్రాల ప్రకారం పేర్లు పెట్టుకోవడం మంచిది.


సూర్యదేవర వేణుగోపాల్ M.A  (జ్యోతిష్యం)

H.NO  1-879
సుందరయ్య నగర్   మధిర    ఖమ్మం జిల్లా 
venusuryadevara@gmail.com


Monday, 22 May 2017

Suryadevara Venugopal: ధర్మసందేహాలు- సమాధానాలు 1

Suryadevara Venugopal: ధర్మసందేహాలు- సమాధానాలు 1: ధర్మ సందేహాలు- సమాధానాలు 1.      వాస్తు దోషాలు ఇంట్లో అద్దె కు ఉండేవారిపై చూపిస్తాయా? లేక యజమాని పై               ...

Tuesday, 28 March 2017

Suryadevara Venugopal: 2017- 2018 .హేవళంబి నామ స|ర ఫలితాలు

Suryadevara Venugopal: 2017- 2018 .హేవళంబి నామ స|ర ఫలితాలు:                                                                                                                                  ...

2017- 2018 .హేవళంబి నామ స|ర ఫలితాలు

                                                         
                                                         
                         

        ఓం శ్రీ గురుభ్యోనమ:
        ఓం శ్రీ మాత్రే నమ:                                                    



శ్రీ హేవళంబి నామ సం|ర ఫలం ఈ విధంగా వుంది.

ధరా మరా గోకుల ధర్మ ప్రసాక్తా ఖలు హేవళంబే
సీదంతి సర్వే విరలార్ఘ  సస్యెర్వృష్టిబి; క్షుధ్భయా పీడితాశ్చ
తస్కరై; పార్ధి వైర్ధెవి హ్యాభిభూత మిదం జగత్
అర్ఘం భవతి సామాన్యం హేవళంబే మహోదయే
హెవళంబేత్వితి భీతిర్మధ్య సస్యార్ధ వృష్టయ:
భాతి భూర్భూపతి క్షోభ: ఖండ విద్యుల్లతాది

శ్రీ హేవళంబి నామ సం|రం లో ప్రభుత్వాలు దేశాన్ని చక్కగా, సమర్ధవంతగా పరిపాలిస్తాయి.కొన్ని ప్రాంతలందు అల్లర్లు జరుగుతాయి. మోసం దుర్మార్గం ప్రబలుతుంది. పంటలు అనుకూలించవు. ధాన్యాదుల ధరలు మందగిస్తాయి ,సామాన్యం గా ఉంటాయి. తక్కువ వర్షపాతం ఉంటుంది. ఉరుములు మెరుపులతో గాలి ఉంటుంది. చొర బాధలు అధికం అవుతాయి. వ్యవసాయం అంతగా లాభసాటిగా ఉండదు.


హేవళంబి సం|రం నకు రాజు బుధుడు , మంత్రి శుక్రుడు, సేనాధిపతి గురుడు,సస్యాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి శని, మేఘాధిపతి గురుడు, రసాధిపతి బుధుడు, నీరసాధిపతి రవి.
ఈ సం|రానికి వీరు నవనాయకులు. నవ నాయకులలో 7 ఆధిపత్యములు శుభ గ్రహాలకు 2 ఆధిపత్యములు పాప గ్రహాలకు వచ్చినది. పరిపాలన సమర్ధవంతంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమర్ధవంతమైన పరిపాలను అందిస్తాయి. ఆర్ధిక విధానాలలో అనేక నూతన మార్పులు వస్తాయి. రూపాయి విలువ పెరుగుతుంది. అయితే వెండి బంగారం ధరలు అనేక మార్పులకు లోనుకాగలవు. స్వల్పంగా తగ్గే వీలుంది. ప్రజలు విదేశీ నాగరికతకు బాగా అలవాటు పడతారు. విలాసాలకు ధనం బాగా ఖర్చు పెడతారు. దేశం లోని ప్రధాన రాజకీయ పార్టీలో సంక్షోభం వస్తుంది. పాలక పక్షం పై అనేక విమర్శలు వస్తాయి..  పాకిస్తాన్ తో సరిహద్దులో యుద్ద వాతావరణం ఉంటుంది. మన సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పై పూర్తి ఆధిపత్యం పొందుతుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రానికి ఘర్షణ ఉంటుంది. ఉత్తర భారతంలో భూకంపాలు ఉంటాయి. వెస్ట్ బెంగాల్. ఒరిస్సా తదితర ప్రాంతాలందు వరదలు వస్తాయి. ప్రాణ ఆస్తినష్టం అధికం. ISRO ప్రయోగాలు అంతర్జాతీయంగా మంచి పేరు ప్రతిష్టాలను తెస్తాయి. క్రీడా రంగంలో విజయాలు ఉంటాయి.

ఉత్తరప్రదేశ్ లో BSP లో అంతర్గత కుమ్ములాటలు ఉంటాయి. అఖిలేశ్ యాదవ్ కు గడ్డుకాలం. అదేవిధంగా ఇక్కడ BJP లో కూడా సమస్యలు వస్తాయి. ఆంధ్ర తెలంగాణ మధ్య జల వివాదం కొంచెం తీవ్రంగా రాగల వీలుంది. అధికార BJP ప్రజాబలం తగ్గుతుంది. అక్టోబరు నుండి BJP పార్టీ కి శని ప్రభావం అధికం గా ఉంటుంది. కనుక దేశవ్యాప్తంగా BJP ప్రభ క్రమేపీ తగ్గుముఖం పడుతుంది.  కాంగ్రెస్ పార్టీ లో అనేక మార్పులు చోటుచేసుకొంటాయి. సీనియర్స్ కు గుర్తింపు ఉండదు.ఉత్తర భారతంలో కాంగ్రెస్ కొంచెం మెరుగు పడుతుంది. ఆంధ్ర తెలంగాణా లలో వారసత్వ రాజకీయాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. తెలంగాణ ముఖ్య మంత్రి కే‌సి‌ఆర్ గారు తమ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సినీ రంగం నార్మల్ గా వుంటుంది. వ్యవసాయం బాగుంటుంది. ప్రత్తి ,పసుపు, సుగంధ ద్రవ్యాలు, వేరుశెనగ , మొక్క జొన్నలకు మంచి ధరలు ఉంటాయి. మిర్చి ధర గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మామిడి ధర కొండెక్కుతుంది.

అక్టోబరు, డిసెంబరు  మధ్య కాలసర్పయోగం ఉంటుంది. దీని వలన అనే సమస్యలు వస్తాయి.అధికారం లో ఉండేవారు సమస్యలు పొందుతారు. అనేక రాజకీయ సంక్షోభాలు రాజకీయ పార్టీ లందు వస్తాయి.తుఫానులు, భూకంపాలు వస్తాయి. యుద్ద వాతావరణం వుంటుంది.ప్రార్ధన ప్రదేశాలు దేవాలయాలో అపశ్రుతులు ఉంటాయి. SHAREMARKET సమస్యలు ఉంటాయి. సీనియర్ రాజకీయ నాయకులకు ప్రమాదం. అమెరికా లో రాజకీయ సమస్యలు ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. బంగ్లాదేశ్ లో ప్రముఖ రాజకీయ నాయకులకు ప్రమాదం వుండవచ్చు. పాకిస్తాన్ లో ప్రభుత్వానికి సైన్యానికి మధ్య సమస్యలు వస్తాయి. ఉత్తర భారతంలో భూకంపాలు, తుఫానులు వస్తాయి.

మనదేశంలో ప్రసిద్ది వహించిన వ్యక్తి మరణం పొందే వీలుంది. విమాన ప్రమాదం లో ప్రసిద్దులు మరణం పొందే వీలుంది. ఈ సం|రం రోడ్డు ప్రమాదాలు అధికం. 2 పెద్ద రైలు ప్రమాదాలు జరుగుతాయి. తెలుగు సినీ రంగం సీనియర్ నటులను కోల్పోతుంది. హాస్య నటులు వివాదాలలో చిక్కుకుంటారు. ఆంధ్ర లో ప్రత్యేక హోదా ఉద్యమం పెరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీ ఆదరణ కొంచెం తగ్గవచ్చు. దక్షిణ భారతం లో బి‌జే‌పి పాగా వేయలేదు.. ఒరిస్సా లో బిజూ పట్నాయక్ ప్రభ కొంత తగ్గుతుంది. దేశం మొత్తం మీద BJP ప్రభ తగ్గుతుంది. ప్రధాని విదేశీ పర్యటనలు అధికం. చైనా పాకిస్తాన్ మధ్య సంబంధాలు కొంత మేరకు దెబ్బతింటాయి. ఆఫ్రికా ఖండం ప్రకృతి వైపరీత్యాలు అధికం అవుతాయి. సిమెంట్ ఇసుక ఇనుము ధరలు పెరుగుతాయి. ఒక ముఖ్య సంఘటన ప్రజలను భయానికి గురిచేస్తుంది. భారత్ లో నేరాల సంఖ్య అధికం. చంద్రబాబు గారికి, మోడి గారికి మరియు కే‌సి‌ఆర్ గారికి ఈ సం|రం అంతగా కలసిరాదు. జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్  ఐ‌టి రంగాలు కుదేలౌతాయి. ఐ‌టి ఉద్యోగులకు ఈ స|రం కలిసిరాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గుతుంది. సంక్షేమ పధకాలకు ధనం చాలక రుణాలు చేయవలసి వస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక సంక్షేమ పధకం ప్రవేశ పెడుతుంది. శాంతి భద్రతలు బాగా నియంత్రించ బడతాయి. అమెరికా విదేశీ విధానం అనేక విమర్శలకు గురిఅవుతుంది. నూతన వీసాల మంజూరు లో తీవ్ర జాప్యం ఉంటుంది. ముస్లిం ఉగ్రవాదం పెరుగుతుంది. మనదేశం లో సంగీత, సాహిత్య, రాజకీయ నాయకులకు ప్రమాదం ఉంటుంది. సీనియర్ రాజకీయ నాయకుని కి ప్రమాదం ఉండవచ్చు.

ఈ సం|రం మిధున, కర్కాటక, సింహా, ధనసు, మరియు మకర రాశుల వారికి చెడుకాలం. దేశ గ్రహస్తితి కాలసర్ప యోగంలో ఉండుటవలన అనేక వైపరీత్యాలు ఏర్పడవచ్చు. కనుక ప్రభుత్వాలు యధాశక్తి చండీ హోమాలు, సుబ్రహ్మణ్య, మరియు రుద్ర శాంతులు చేయిస్తే మంచిది. వ్యక్తులు కూడా యధా శక్తి నిత్య అనుష్టానాలు మానివేయ రాదు. సంధ్యావందనం అర్హత ఉన్నవారు తప్పనిసరిగా సంధ్యావందనం చేయాలి. ఈ సం|రం ప్రతి వారు 3 సార్లు నువ్వులు దానం చేయుట మంచిది. సమస్త దోషాలు పోతాయి.

ఈ సం|రం  2 చంద్ర గ్రహణాలు, 2 సూర్య గ్రహణాలు ఉన్నవి. అయితే సూర్య గ్రహణాలు మనదేశం లో గోచరించవు. చంద్ర గ్రహణాలు గోచరిస్తాయి. మనం అన్ని నియమాలు పాటించాలి.

శ్రావణ శుక్ల పౌర్ణిమ సోమవారం ది.07-08-2017 చూడామణి నామం కల కేతుగ్రస్త చంద్ర గ్రహణం....ఇది పూర్తిగా భారతదేశం అంతటా గోచరిస్తుంది......

స్పర్శ కాలం       రాత్రి 10:52 నిలకు
మధ్యకాలం         రాత్రి 11:50 నిలకు
మోక్ష కాలం         రాత్రి 12:49 నిలకు.

గ్రహణ పుణ్యసమయం  1 గం-57 ని....
గ్రహణం శ్రవణా నక్షత్రం లో పడుతుంది.... మకర రాశి వారు చూడరాదు.
అన్ని నియమాలు అందరూ పాటించాలి.

2 వ గ్రహణం   మాఘ శుక్ల పౌర్ణిమ బుధవారం  ది.31-01-2018 పడుతుంది...ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం....ఇది పుష్యమి, ఆశ్లేష ల లో జరుగుతుంది. కర్కాటక రాశి వారు చూడరాదు...

గ్రహణ స్పర్శ కాలం.... సా 05- 17 నిలకు
నిమిలనకాలం               సా 06-21 నిలకు
మధ్యకాలం.....              రా.  06:59 నిలకు
ఉన్మీలనకాలం              రా. 07-37 నిలకు
మోక్షకాలం                    రా.  08-41 నిలకు

గ్రహణ పుణ్యకాలం   03 గం 24 నిలకు....బింబదర్శన కాలం 1 గం 16 నిలకు

అందరు అన్నీ నియమాలు పాటించాలి.



  ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:


 సూర్యదేవర శ్రీ వేణుగోపాల్  M. A. జ్యోతిష్యం.
సుందరయ్య నగర్ మధిర   ఖమ్మం జిల్లా తెలంగాణా
venusuryadevara@gmail.com





\

Thursday, 23 March 2017

29 వ తేదీనే ఉగాది జరుపుకోవాలి.

ఈ హేవళంబి సం|ర ఉగాది 29 వ తేదీ న జరుపుకోవాలి. కొంతమంది 28 వ తేదీ ఉగాది అని ప్రచారం చేయడం జరుగుతుంది. ఇటువంటి వాదోపవాదాల వలన సామాన్య ప్రజలు ఉగాది యే రోజు జరుపుకోవాలో తెలియక సతమతమౌతున్నారు. మన హిందూ సంస్కృతి పట్ల చులకన భావం ఏర్పడుతుంది.

తెలుగు మాసాలలో ప్రధమ మాసం చైత్ర మాసం. ఆ చైత్ర మాసంలో మొదటగా వచ్చే తిధి పాడ్యమి. ఈ పాడ్యమి నే ఉగాది అని నిర్ణయించి పండుగ జరుపుకుంటున్నాము. అంటే చైత్ర శుక్ల పాడ్యమి ఉగాది. అయితే ఈ పాడ్యమి 2 రోజులుండటం వలన యే రోజు ఉగాది జరుపుకోవాలి అన్న మీమాంస ఏర్పడింది. 28 తెదీ న పాడ్యమి తిధి ఉదయం గం|| 08:39 ని|| లకు ప్రవేశించి 29 వ తేదీ ఉదయం గం|| 07:00 ని|| ల వరకు వ్యాప్తి చెంది ఉంది. అంటే 28  మరియు 29 తేదీ లలో 2 రోజులకు పాడ్యమి వ్యాప్తి ఉంది. 28 కూడా వ్యాప్తి ఉన్నది కాబట్టి 28 వ తేదీనే ఉగాది అని కొంత మంది పండితులు భావించుట జరిగింది.

ఇక్కడ ముఖ్య విషయం ఏమంటే సూర్యోదయం తో ఉండే పాడ్యమినే ఉగాది గా భావించాలి. ..ఈ విషయాన్నిధర్మసింధు..నిర్ణయ సింధు వంటి జ్యోతిష్య గ్రంధాలు ఉదహరించుట జరిగింది. 2 రోజులకు పాడ్యమి ఉంటే సూర్యోదయం తో వుండే పాడ్యమి రోజునే ఉగాది గా స్వీకరించాలి. కనుక సూర్యోదయం తో ఉండే పాడ్యమి 29 వ తేదీ న ఉన్నది కనుక ఈ రోజునే ఉగాది గా నిర్ణయించి పండుగ జరుపుకోవాలి. 2 రోజులకు పాడ్యమి సూర్యోదయం తో వుంటే ముందు రోజునే ఉగాది జరుపుకోవాలి. ఇక్కడి 2 రోజులకు పాడ్యమి ఉన్నప్పటికి మొదటి రోజు సూర్యోదయం నకు అమావాస్య  ఉంది. కాబట్టి 28 ఉగాది కాదు.

28 వ తెదీ  న సూర్యోదయం తో అమావాస్య ఉంది. పాడ్యమి తిధి ఉదయం గం|| 08:39 ని|| లకు ప్రవేశించింది  ఆ రోజు సూర్యోదయం గం|| 05: 59 ని||లకు ఉంది . పాడ్యమి సూర్యోదయానికి లేదు. సూర్యోదయానికి అమావాస్య ఉంది.  29 వ తెదీ నందు సూర్యోదయం గం|| 06:00 ని||లకు జరుగుతుంది. ఈ రోజు పాడ్యమి తిధి ఉదయం గం||07:00 ని||ల వరకు ఉంది. అంటే సూర్యోదయం తో పాడ్యమి ఉంది. కనుక 29 వ తేదీ రోజునే ఉగాది జరుపుకోవాలి. ఇది శాస్త్ర సమ్మతం....

సూర్యదేవర శ్రీ వేణుగోపాల్ ఎం.ఏ (జ్యోతిష్యం)

సుందరయ్య నగర్, మధిర    ఖమ్మం జిల్లా,  తెలంగాణా..

Monday, 20 March 2017

ఇంటికి ప్రహరీ రక్షణ కవచం

ఇంటికి ప్రహరీ రక్షణ కవచం.
సూర్యదేవర వేణుగోపాల్. M.A (జ్యోతిష్యం)


నైసర్గిక వాస్తు దోషాలను అరికడుతుంది. గృహానికి ప్రహరీ లేకపోతే ఆ గృహం చుట్టూ ఉన్న వాస్తు దోషాల వలన అందులో  ఉండేవారు బాధపడవలసి వస్తుంది. అష్ట దిక్కులను మన గృహానికి అనుగుణంగా సవరించుకొని మేలు పొందాలంటే ప్రహరీ నిర్మాణం తప్పనిసరి. ప్రహరీ గోడను అనుభవం కలిగిన వాస్తు పండితుని పర్యవేక్షణలో నిర్మించాలి. పెరిగి ఉన్న మూలాలను,దిక్కులను సవరించి ప్రహరిని నిర్మించాలి. స్థలం ఉన్నంత మేరకు ప్రహరీని కట్టకూడదు. మంచి ఫలితాల కోసం దిక్కులను సవరించి ప్రహరిని కట్టాలి. యే నిర్మాణానికైనా ప్రహరీ తప్పనిసరి. గృహానికి ప్రహరీ చాలా ముఖ్యం. ప్రహరీలు లేని గృహం రాణించదు.
ప్రహరీ నిర్మాణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రహరి పునాది లేదా ఫౌండేషన్ ఎట్టి పరిస్థితిలోను ఇంటి పునాదిని మించకూడదు. ఇంటిపునాది కంటే ప్రహరీ పునాది ఎత్తులో ఉంటే ఇంటి ఆయుర్దాయం తగ్గిపోతుంది. దక్షిణం మరియు పడమర లు ఎత్తులో ఉండాలని కొంతమంది ఇంటి పునాది కంటే ప్రహరీ పునాది ని ఎత్తులో కడుతున్నారు. ఇది చాలా తప్పు. అన్ని దిశలందు ప్రహరీ ఫౌండేషన్ ఇంటి ఫౌండేషన్ కన్నా తక్కువలోనే ఉండాలి.
ప్రహరీలకు తూర్పు ఉత్తరంలో కట్టే ఫౌండేషన్ దక్షిణం పడమరల ఫౌండేషన్ కన్నా తక్కువ  ఎత్తులో ఉంచాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రహరీ నిర్మాణం 2 విధాలుగా ఉంటుంది. 4  దిక్కులందు సమానమైన ఎత్తులో ప్రహరీ నిర్మించుట ఒక పద్దతి. తూర్పు ప్రహరీ పడమర ప్రహరీ కన్నా తక్కువలో మరియు దక్షిణం ప్రహరీ ఉత్తరం ప్రహరీ కన్నా ఎత్తులో ఉంచి ప్రహరీ నిర్మించుట 2 వ పద్దతి. ఈ రెండింటిలో 2 వ పద్దతి సరియైనది. ప్రహరీ కట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి. ముందుగా గృహానికి దక్షిణం, పడమరల వైపు ప్రహరీని నిర్మించాలి. ఈ దిక్కులందు ప్రహరీ లేకుండా తూర్పు, ఉత్తర దిశలందు కాంపౌండ్ నిర్మించరాదు. పడమర,దక్షిణాల వైపు జలాశయాలు, బావులు, బొర్లు, లోతైన గుంటలు, పెద్ద డ్రైనేజీలు ఉన్నప్పుడూ  కొంత స్థలం వదలి ప్రహరీ నిర్మించాలి. ఈ పల్లపు ప్రాంతాలను ఆనుకొని ప్రహరీ కట్టకూడదు. కనీసం 5 నుండి 12 అడుగుల వరకు ఖాళీ స్థలం వదలి ప్రహరీ నిర్మించాలి. అప్పుడే ప్రహరీ వలన మంచి ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా పడమర దక్షిణ ముఖాలుగా నిర్మించే గృహాల కు నైరుతి ప్రాంతం నందు ప్రహరికి ఆనించి మెట్లను నిర్మిస్తున్నారు ఇది తప్పు. అదేవిధంగా నైరుతి మూసివేయాలని మరుగుదొడ్లు లేదా స్టోర్ రూమ్స్ నైరుతిని మూసివేసి నిర్మిస్తున్నారు ఇది కూడా చాలా తప్పు. ఈ విధమైన నిర్మాణాల వలన ప్రహరీ ప్రయోజనం నెరవేరదు. ఇటువంటి నిర్మాణాలు వలన కాంపౌండ్ బయట ఉన్న పల్లంతో తీవ్ర నష్టం జరుగుతుంది. తప్పనిసరి పరిస్థితులలో కాంపౌండ్ కు టచ్ చేసి మరుగుదొడ్లు నిర్మించవలసి వస్తే తప్పనిసరిగా కాంపౌండ్ బయట మట్టి వేసి ఎత్తు చేయాలి. కాంపౌండ్ బయట పల్లం లేకుండా మట్టి వేసి ఎత్తు లేపడం గాని లేదా అరుగులు వంటివి కట్టడంగాని చేయాలి. ప్రహరీ గోడకు గృహం లోని యే భాగము టచ్ కాకుండా నిర్మించడం మంచిది.
తూర్పు ఉత్తర సింహద్వారం తో నిర్మించే గృహాలకు సింహద్వారం బయటకు కనిపించే విధంగా ప్రహరీ నిర్మించాలి. తూర్పు ఉత్తరాలలో బాగా ఎత్తులో ప్రహరి నిర్మించుట మంచిది కాదు. మగ సంతానానికి ఎదుగుదల లోపిస్తుంది. అయితే దక్షిణ పశ్చిమ దిశలలో ప్రహరీని  ఎత్తులో ఉంచవచ్చు. తూర్పు ఉత్తరాలలో మరీ ఎత్తులో ప్రహరీ మంచిది కాదు. దక్షిణం, పడమరల వైపు కూడా గాలికి అవరోధం రానంత మేర ఎత్తులో ప్రహరీ నిర్మించాలి. మన పూర్వ నిర్మాణాలలో దక్షిణం,పడమరల వైపు ఇంటిని ఖాయం చేసి ఉండటం మనం చూస్తూంటాము. ఇది చాలా తప్పు. ఇటువంటి గృహాలకు నైసర్గిక వాస్తు దోషాలు బాగా తమ ప్రభావాన్ని చూపిస్తాయి. కొంతమంది నైరుతి మూసి నిర్మాణాలు చేయవచ్చునని సలహా ఇస్తున్నారు. ఇది కూడా తప్పు. నైరుతి మూసి నిర్మాణాలు చేస్తే ఇటువంటి నిర్మాణాలకు నైరుతి లో ఉండే నైసర్గిక వాస్తు దోషం తగిలి తీవ్ర నష్టాలు వస్తాయి. ఇంటికి దక్షిణం పడమర లో వేరే గృహం ఉంటే ఈ దిక్కులందు కాంపౌండ్ అవసరం లేదని భావిస్తారు.ఇది తప్పు. మన ప్రహరీ మనం కట్టుకోవలసిందే.
ప్రహరి ప్రధాన గృహం నుండి దక్షిణం ఆగ్నేయ, దక్షిణ నైరుతి దిక్కులు సమానమైన కొలతతో 90 డిగ్రీలు గా ఉండాలి. అదేవిధంగా పడమర వైపు పడమర, పడమర వాయవ్యం, పశ్చిమ నైరుతి ప్రధాన గృహం నుండి సమానమైన కొలతతో 90 డిగ్రీలు  గా ఉండాలి. ఏ దిశ పెరగరాదు.  అయితే తూర్పు ఉత్తరం వైపు తూర్పు ఆగ్నేయం కన్నా తూర్పు ఈశాన్యం అదే విధంగా ఉత్తర వాయవ్యం కన్నా ఉత్తర ఈశాన్యం ఎంతో కొంత పెరిగే విధంగా ప్రహరీ నిర్మించాలి. ఈశాన్యం పెరగకుండా ఉండరాదు. ఇంటి ప్రహరీ గోడ కు వీధి శూల తగిలే పక్షంలో నిర్లక్ష్యం చేయరాదు. ప్రహరీ కి ఎంతో కొంత ఖాళీ వదలి వేరే గోడను ప్రహరీ కి అడ్డం గా నిర్మించాలి. అప్పుడే ప్రహరీ కి వీధి శూల నుండి రక్షణ లభిస్తుంది.
ఈ రోజుల్లో చాలామంది ప్రహరిలను ఇంటి బీముల పై నిర్మిస్తున్నారు. ఇంటి బీమ్స్ ను ఇంటి నుండి బయటకు పెంచి వాటిపై ఇంటికి ఎడంగా ప్రహరిని కడుతున్నారు. భూమి పై మట్టం నుండి కాంపౌండ్, ఇంటి గోడలు ఎడంగా ఉన్నప్పటికి భూమి అడుగు భాగంలో ప్రధాన గృహం మరియు ప్రహరీలు బీమ్స్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఇటువంటి నిర్మాణం వలన ప్రహరీ ప్రయోజనం నెరవేరదు. ప్రహరీ ఇంటికి మద్య ఖచ్చితంగా కనెక్షన్ ఉండకూడదు. ఇంటికి ప్రహరీ మధ్య కనెక్షన్ ఉంటే ప్రహరీలకు తగిలే నైసర్గిక వాస్తు దోషాలు ఇంటికి కూడా తగిలి అనేక సమస్యలు వస్తాయి. కనుక ప్రహరీలకు వేరే పిల్లర్స్, బీమ్స్ వేసి ప్రహరిని నిర్మించాలి.
ఇంటి శ్లాబ్స్ ప్రహరీ గోడలపై వచ్చే విధంగా నిర్మించరాదు. ఇంటి శ్లాబ్ ఇంటి ప్రహరి కన్నా 2 లేక 3 అంగుళాలు లోపలికి ఉండే విధం గా వేయాలి. సెప్టిక్ టాంకులు,బోర్లు మొ|నవి ప్రహరికి టచ్ కాకుండా ఉండాలి.ప్రహరీ పై ఇంటికన్నా ఎత్తులో ఆర్చీలు డిజైన్లు కట్టరాదు. క్రూర మృగాల బొమ్మలు, భయం గొలిపే బొమ్మలు ప్రహరీపై ఉంచరాదు. ఇంకా ప్రహరీ పై గాజు పెంకు లను అమర్చకూడదు. ఇంటిని నిర్మించిన తదుపరి ప్రహరిని నిర్మించుట మంచిది. ఇంటిని ప్రాతిపదికగా తీసుకొని ప్రహరిని నిర్మించుట మంచిది. ఇంటికన్నా ప్రహరీ ముందుగా నిర్మిస్తే ఇంటిని ప్రహరికి అనుగుణంగా సవరించాలి. ఇది మంచి పద్దతి కాదు. అయితే ఖాళీ స్థలానికి నైరుతి ఆగ్నేయ దిక్కుల విపరీతంగా పెరిగిఉంటే ముందుగా పెరిగి ఉన్న దిక్కులను సవరించి ప్రహరీ నిర్మించాలి. అప్పుడు ఇల్లు సకాలంలో పూర్తి అవుతుంది.
ప్రహరికు ఉచ్చ స్థానంలో గేట్లు అమర్చాలి. ప్రహరికి కాలువలకు మధ్య ఎంతోకొంత ఖాళీ ఉండాలి. ప్రహరికి ఆనుకొని కాలువలు ఏ దిశలోనూ ఉండరాదు. పాత గృహానికి కాంపౌండ్ నిర్మించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధాన గృహానికి పారు చెడకుండా ప్రహరీ కట్టాలి. అదే విధంగా ప్రధాన గృహం ను ప్రాతిపదిక గా తీసుకొనే ప్రహరీ కట్టాలి. ప్రధాన గృహం నుండి కొలత తీసుకొని ప్రహరీ కట్టాలి. అంతేకాని ప్రహరికి నూతనంగా మూలమట్టం వేసి కట్టకూడదు. ఇంటిపారు లోనే ప్రహరీ ఉండాలి. ప్రహరీ గోడలు అన్నీ సమానమైన మందం తో నిర్మించాలి. దక్షిణ పడమరల వైపు ఎక్కువ మందం తో నిర్మించి తూర్పు ఉత్తరాలలో తక్కువ మందంతో ప్రహరీ నిర్మించవచ్చు. ఇలా కాకుండా తక్కువ మందంతో ప్రహరీ ని దక్షిణ పడమరలలో నిర్మించి ఎక్కువ మందంతో తూర్పు ఉత్తరాలలో ప్రహరి కట్టరాదు. 4 వైపులా సమానమైన మందంతో ప్రహరీ కట్టవచ్చును. ఇంటి సింహద్వారంలో గాని ఇతర దర్వాజలో కాని ప్రహరీ గోడ పిల్లర్స్ రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా బోర్లు టాంకులు మరియు బావులందు ప్రహరీ పిల్లర్లు రాకూడదు.
ప్రహరికి అమర్చే గేట్లు తూర్పు ఉత్తరాలలో ఇంటికన్నా తక్కువ ఎత్తులో ఉంచితే మంచిది. దక్షిణ పడమరల వైపు ఎత్తులో వుంచవచ్చు. అయితే ప్రహరీ గోడ నైరుతి లో ఉన్న ఎత్తుకంటే ఈ గేట్లు ఎత్తులో ఉండరాదు. ప్రహరీ గోడ మధ్య చెట్లు ఉండకూడదు. ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రహరీ నిర్మిస్తే  నైసర్గిక వాస్తు దోషాలు తొలగి సుఖ సౌఖ్యాలు పొందవచ్చు.
సూర్యదేవర వేణుగోపాల్ M. A జ్యోతిష్యం

H.NO—1-879   సుందరయ్య నగర్       మధిర  ఖమ్మం జిల్లా  తెలంగాణా

Wednesday, 8 March 2017

Suryadevara Venugopal: యేఏ పుష్పాలతో నవగ్రహాలను పూజించాలి?

Suryadevara Venugopal: యేఏ పుష్పాలతో నవగ్రహాలను పూజించాలి?: మానవ జీవితం సుఖప్రదంగా సాగిపోవాలంటే నవగ్రహాల యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలి. ఈ నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవడం కోసం జప, పూజ విధులు మర...

యేఏ పుష్పాలతో నవగ్రహాలను పూజించాలి?



మానవ జీవితం సుఖప్రదంగా సాగిపోవాలంటే నవగ్రహాల యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలి. ఈ నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవడం కోసం జప, పూజ విధులు మరియు స్తోత్ర విధానాలు మన శాస్త్రాలు ఉదహరించాయి  వీటిని పాటించడం వలన నవగ్రహ ఆశీర్వాదం లభించి మానవ జీవితం లోని సమస్యలు తొలగిపోతాయి..  యే ఏ పూలతో నవగ్రహాలను పూజిస్తే మంచి జరుగుతుందో ఆ పూల వివరాలను  భవిష్య పురాణం  తెలియ జేసింది, గ్రహ శాంతి పూజలందు  భవిష్య పురాణం చెప్పిన ప్రకారం ఆ యా గ్రహ దేవతలను పూజిస్తే వారి అనుగ్రహం సులభంగా లభించి  సమస్యలు తొలగిపోతాయి.

హయారి కుసుమైః సూర్యం కుముదై చంద్ర అర్చయేత్

క్షితిజమ్ తు జపాపుష్పై చంపకేన తు సోమజం

శతపత్రై గురుః పూజ్యో జాజి పుష్పైస్తు భార్గవః

మల్లికా కుసుమై పంగు: కుంద పుష్పైర్విధంతుద:

కేతస్తు వివిధై: పుష్పే: శాంతి కాలేషు సర్వధా

భవిష్య పురాణం

రవిని పచ్చ గన్నేరు తో చంద్రుని కలువలతో, కుజ గ్రహాన్ని దాసాని పూలతో, బుధుని సంపెంగలతో, గురుని పద్మాలతో,  జాజి పూలతో శుక్రుని, శని గ్రహాన్ని మల్లె పూలతో  ఇంకా మొల్ల పూలతో రాహువుని, కేతు గ్రహాన్ని వివిధ పుష్పాలతో పూజిస్తే నవగ్రహ అనుగ్రహం సత్వరమే లభించి సమస్యలు తీరిపోతాయి.