Wednesday 8 March 2017

యేఏ పుష్పాలతో నవగ్రహాలను పూజించాలి?



మానవ జీవితం సుఖప్రదంగా సాగిపోవాలంటే నవగ్రహాల యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా ఉండాలి. ఈ నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవడం కోసం జప, పూజ విధులు మరియు స్తోత్ర విధానాలు మన శాస్త్రాలు ఉదహరించాయి  వీటిని పాటించడం వలన నవగ్రహ ఆశీర్వాదం లభించి మానవ జీవితం లోని సమస్యలు తొలగిపోతాయి..  యే ఏ పూలతో నవగ్రహాలను పూజిస్తే మంచి జరుగుతుందో ఆ పూల వివరాలను  భవిష్య పురాణం  తెలియ జేసింది, గ్రహ శాంతి పూజలందు  భవిష్య పురాణం చెప్పిన ప్రకారం ఆ యా గ్రహ దేవతలను పూజిస్తే వారి అనుగ్రహం సులభంగా లభించి  సమస్యలు తొలగిపోతాయి.

హయారి కుసుమైః సూర్యం కుముదై చంద్ర అర్చయేత్

క్షితిజమ్ తు జపాపుష్పై చంపకేన తు సోమజం

శతపత్రై గురుః పూజ్యో జాజి పుష్పైస్తు భార్గవః

మల్లికా కుసుమై పంగు: కుంద పుష్పైర్విధంతుద:

కేతస్తు వివిధై: పుష్పే: శాంతి కాలేషు సర్వధా

భవిష్య పురాణం

రవిని పచ్చ గన్నేరు తో చంద్రుని కలువలతో, కుజ గ్రహాన్ని దాసాని పూలతో, బుధుని సంపెంగలతో, గురుని పద్మాలతో,  జాజి పూలతో శుక్రుని, శని గ్రహాన్ని మల్లె పూలతో  ఇంకా మొల్ల పూలతో రాహువుని, కేతు గ్రహాన్ని వివిధ పుష్పాలతో పూజిస్తే నవగ్రహ అనుగ్రహం సత్వరమే లభించి సమస్యలు తీరిపోతాయి.

No comments:

Post a Comment