Sunday 26 November 2017

వాస్తు సందేహాలు- సమాధానాలు



1. నైరుతి లోనే బెడ్ రూమ్ ఉండాలా? ఎక్కడైనా ఉండవచ్చా?

జ. బెడ్రూం కు దక్షిణ, పడమర,  ఇంకా నైరుతి దిశలు మంచివి. ఈశాన్యం లో కూడా బెడ్ రూమ్ ఉంచవచ్చు. చిన్నపిల్లలకు ఈశాన్యం బెడ్రూం ఉంచవచ్చు. వాయవ్య దిశ నందు కూడా బెడ్రూం ఉంచవచ్చు. ఇది కూడా మంచి దిక్కే. అయితే నైరుతి నందు బెడ్రూం కంటే స్టోర్ రూమ్ మంచిది. ఈ దిశలో స్టోర్ రూమ్ ఉంటే దక్షిణ పడమరలందు బెడ్రూం ఉంచవచ్చు. ఆగ్నేయం నందు బెడ్ రూమ్ మంచిది కాదు.

2. దక్షిణ ముఖంగా గృహాన్ని కట్టవచ్చా? చాలామంది మంచిది కాదు అని అంటారు కదా,,,,

జ. దిక్కులన్నీ మంచివే. ఒక్కొక్క దిశకు ఒక్కొక్క గుణం ఉంది. దానిని తెలుసుకొని వాస్తును పాటించాలి. దక్షిణ ముఖంగా చక్కగా గృహాన్ని నిర్మించుకోవచ్చు. భయం అక్కరలేదు.

3. పశువుల శాలలకు ఏ దిశ మంచిది?.

జ. వాయవ్యం దిశ పశువుల కొష్టాలకు శ్రేష్టం.

4. గృహాలకు, పరిశ్రమలకు, ఇంకా దేవాలయాలకు వాస్తు పద్దతులలో భేదం ఉందా?

జ. అన్నిటికి ఒకే విధమైన వాస్తు పనిచేయదు. కట్టడంలో చేసే కార్యాన్ని అనుసరించి వాస్తుని అమలు చేయాలి. అప్పుడే మంచి ప్రయోజనాలు ఉంటాయి. గృహవాస్తుకు పరిశ్రమల వాస్తుకు భేదం ఉంది. ఆలయాలకు గృహ వాస్తును పాటించకూడదు. ఆలయాలను  తప్పనిసరిగా ఆగమ శాస్త్రం అనుసరించి నిర్మించాలి. గృహవాస్తుకు ఆలయ వాస్తు కు చాలా భేదం ఉంది.

5. వర్గు నియమం మంచిదేనా?

జ. మంచి సమన్వయంతో వర్గు ను పాటిస్తే అద్భుత ఫలితాలుంటాయి

6. ఆయమ్ పాటించి గృహాన్ని నిర్మించాలా?

జ. సరైన పద్దతిని పాటించి మంచి ఆయాది గణితంతో గృహాన్ని నిర్మించాలి. అప్పుడే వాస్తు ఫలితాలు ఉంటాయి.

7. నైరుతి కట్ అయిన స్థలం మంచిదేనా?

జ. అన్నీ దిశలు ఉన్నప్పుడే మంచి ప్రయోజనాలుంటాయి. నైరుతి దిశ కట్ అయిన స్థలం మంచిది కాదు.

8. నీటి వాడ కానికి ఏ దిశ మంచిది?

జ. వాయవ్య దిశ చాలా మంచిది

9. కార్ పార్కింగ్ షెడ్ ఎక్కడ వేయవచ్చు?

జ. ఈశాన్యం మినహా ఎక్కడైనా వేయవచ్చు. అయితే సరైన పారులను గమనించాలి.

10. ఏ దిశ ముఖంగా కూర్చుని విద్యనభ్యసించాలి?

జ. తూర్పు, ఉత్తర దిశల అభిముఖంగా కూర్చుని విద్యనభ్యసించాలి.



venusuryadevara@gmail.com

సూర్యదేవర వేణుగోపాల్. M.A (జ్యోతిష్యం)
H. NO. 1-879
సుందరయ్య నగర్    మధిర    
ఖమ్మం జిల్లా 507203
ఖమ్మంజిల్లా.

No comments:

Post a Comment