Saturday 4 April 2020

శని దోషం - పరిహారాలు||ధనుస్సు,మకర,కుంభ,మిథున తుల రాశి వారికి






శని దోషం- పరిహారాలు

సూర్యదేవర వేణుగోపాల్ M. A. (జ్యోతిష్యం)
ప్రస్తుతం ధనుస్సు, మకర, కుంభ  రాశుల వారికి ఎల్నాటి శని నడుస్తుంది. మిధున రాశి వారికి అష్టమ శని దోషం నడుస్తుంది. ఇంకా తులా వారికి అర్ధాష్టమ శని దోషం నడుస్తుంది. చేసే ప్రతి పనిలోనూ ఆటంకం, ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు, వివాదాలు, కొన్ని విషయాలలో అవమానాలు ఈ రాశుల వాళ్ళకి   ఉండే  అవకాశం ఉంటుంది. ఆరోగ్య ఆర్ధిక సమస్యలు వేధించవచ్చు. ఉద్యోగం లో సమస్యలు ఉండవచ్చు. నిరుద్యోగులకు నిరాశ మిగలవచ్చు. ఇవన్నీ సాధారణంగా శని గోచరం వల్ల కలిగే ఫలితాలు. జాతకం లో నడుస్తున్న దశ అంతర్దశ ల ప్రభావం వల్ల ఈ ఫలితాలల్లో మార్పు ఉండవచ్చు. 2023 వ సం|రం జనవరి వరకు మిధున తుల ధనుస్సు రాశుల వారికి , 2027 చివరి వరకు మకర, కుంభ రాశుల వారికి శని దోష ప్రభావం ఉంటుంది. జాతకం లో శని స్వక్షేత్రం లో గాని, ఉచ్చలో లో గాని ఇంకా మిత్ర స్థానాలలో గాని ఉంటే అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు...
పైన ఉదహరించిన రాశుల వారు శని దోష నివృత్తి కై ఈ క్రింది పరిహారాలు పాటించాలి....
*నెలకు 1 శనివారం శని భగవానునకు తైలాభిషేకం చేయాలి.
*ప్రతి మాస శివరాత్రికి శివాలయం లో రుద్రాభిషేకం జరిపించాలి.
*ప్రతి రోజు హనుమాన్ చాలీసా పఠించాలి....వీలుంటే రోజుకి 11 సార్లు చదవడం మంచిది.
*విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం కూడా శని దోషాన్ని హరిస్తుంది. డైలీ చేయండి.
*స్తోత్రాలు చదవలేని వాళ్ళు ప్రతి శనివారం శ్రీ ఆంజనేయ స్వామి వారికి 19 ప్రదక్షిణలు చేయవచ్చు.
*ప్రతి రోజు కాలభైరవ స్తోత్రం, కాళి స్తోత్రం చదవవచ్చు.
*దత్తాత్రేయుని నిత్య పూజ లేదా స్తోత్ర పఠనం శని దోషాన్ని హరిస్తుంది.
*శనివారం రోజు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయిస్తే చాలా మంచిది.
*ప్రతిరోజు శని స్తోత్రం, లేదా శని శ్లోకం తప్పనిసరిగా పఠించాలి.
ఈ పరిహారాలు పాటిస్తే శని భగవానుని ఆశీస్సులతో బాధలు తగ్గుతాయి.

సూర్యదేవర వేణుగోపాల్  M. A (జ్యోతిష్యం)
ఇంటి నెం  1-879సుందరయ్య నగర్
 మధిర  ఖమ్మం జిల్లా  తెలంగాణా  507 203
Venusuryadevara@gmail.com


No comments:

Post a Comment